Sreeleela : కేవలం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే కాకుండా సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ కొరియోగ్రాఫర్ లో జానీ మాస్టర్ ఒకరు. ఎన్నో అద్భుతమైన పాటలకు జానీ మాస్టర్ కంపోజ్ చేశారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరోతో కూడా పనిచేసే అవకాశం ఆయనకు దక్కింది. సాఫీగా సాగుతున్న తరుణంలో ఎన్నో ఒడిదుడుకులు జానీ మాస్టర్ కెరియర్ లో వచ్చాయి.
జానీ మాస్టర్ విషయానికొస్తే మొదట దర్శకుడు అవుతామని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే కొన్ని కారణాల వలన డాన్సర్ గా మారాడు. ఆ తర్వాత కొరియోగ్రాఫర్ అయిపోయారు. ఈటీవీలో వచ్చే ఢీ అనే షో ద్వారా బాగా పాపులర్ అయ్యారు జానీ మాస్టర్. అప్పట్లోనే జానీ మాస్టర్ కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది.
జానీ మాస్టర్ కు గిఫ్ట్
ప్రస్తుతం జానీ మాస్టర్ ఒక సాంగ్ కొరియోగ్రఫీ చేస్తున్నారు అంటే దానిమీద అంచనాలు నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయాయి. కొన్నిసార్లు స్టార్ హీరోలు డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఇది జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు అని చెప్పవచ్చు. జానీ మాస్టర్ డాన్స్ లో అంత గ్రేస్ ఉంటుంది. ప్రస్తుతం జానీ మాస్టర్ రవితేజ నటించిన మాస్ జాతర అనే సినిమాకి కొరియోగ్రాఫర్ గా చేస్తున్నారు. ఈ సినిమాలో శ్రీ లీల నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే శ్రీ లీలా తో పాటు కలిసి స్టెప్స్ వేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో జానీ మాస్టర్ అప్లోడ్ చేశారు. తనతో డాన్స్ వేయడమే కాకుండా మీ ఎనర్జీని రేపు ప్రేక్షకులు చూస్తారు అంటూ చెప్పుకొచ్చారు. వాళ్ళిద్దరూ డాన్స్ చేస్తున్న ఫొటోలతో పాటు శ్రీ లీల తనకు పంపించిన గిఫ్ట్ కు కూడా ఫోటో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు జానీ మాస్టర్.
శ్రీ లీలా మాస్ డాన్స్
ఇక ఆ ఫొటోస్ లో చూస్తే శ్రీ లీలా మరో మాస్ డాన్స్ నెంబర్ చేయబోతున్నట్లు ఈజీగా అర్థమవుతుంది. శ్రీ లీలా డాన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒక సినిమాలో నటిస్తుంది అంటేనే డాన్స్ సాంగ్స్ ఏముంటాయో అని ఆడియన్స్ కూడా ఎదురు చూడటం మొదలుపెట్టారు. తన ఎనర్జీ ని మ్యాచ్ చేయడం మామూలే విషయం కాదు. ఇక రీసెంట్ గా జూనియర్ సినిమాలో వైరల్ అనే సాంగ్ కూడా బాగా పాపులర్ అయింది. ఆ సినిమా ప్రస్తుతం విడుదలకి సిద్ధంగా ఉంది. ఇక శ్రీ లీలా విషయానికి వస్తే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలతో కూడా పనిచేసే అవకాశం దక్కింది. అయితే తనక్కూడా మంచి హిట్ సినిమా పడి చాలా రోజులైంది.
Also Read: K-RAMP Glimpse : ఇవేం చిల్లర పనులు కిరణ్, బూతులు మాట్లాడితే హిట్ అయిపోతుందా.?