Dhurandhar 2:ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్యధర్ (Adityadhar) దర్శకత్వంలో రణవీర్ సింగ్ (Ranveer Singh) హీరోగా, సారా అర్జున్ (Sara Arjun) హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం ధురంధర్. డిసెంబర్ 5 2025న ప్రేక్షకుల ముందుకు ఎటువంటి అంచనాలు లేకుండా ఊహించిన విజయాన్ని సొంతం చేసుకుంది. 1350 కోట్ల క్లబ్లో చేరి రికార్డులు సృష్టించింది. ఇక ఈ సినిమా సీక్వెల్ కూడా ఉంటుందని అప్పట్లోనే ప్రకటించిన విషయం తెలిసిందే. పైగా ధురంధర్ సినిమా విడుదల సమయంలోనే ఈ సినిమా సీక్వెల్ టీజర్ కూడా విడుదల చేసి అంచనాలు పెంచేశారు. దీంతో ఈ సినిమా కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఇక ఉగాది సందర్భంగా మార్చి 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
పైగా ఎర్లీ మార్నింగ్ గురువారం 2 గంటల నుండి ఈ సినిమా షోలు పడనున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా క్రేజ్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ ద్వారా 130 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసిన ఈ సినిమా మొదటిరోజు 250 కోట్లు రాబట్టడం గ్యారెంటీ అంటూ కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమా టికెట్ ధరలతో అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దేశ రాజధాని అయిన ఢిల్లీలో ఒక్కో టికెట్ ధర సుమారుగా రూ.3,100 పలుకుతూ ఉండడం గమనార్హం. అయితే ఈ టికెట్ ధర ఇక్కడ హాట్ టాపిక్ గా మారితే ఈ రేంజ్ లో ఉన్నా సరే అక్కడ టికెట్లు దొరకపోవడం సినిమాపై ఉన్న అంచనాలు హద్దులు చెరిపేస్తోంది అనడంలో సందేహం లేదు.
ALSO READ:Ram Charan: రామ్ చరణ్ గత 10 చిత్రాల బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్.. హైయెస్ట్ ఏది? పెద్ది సంగతేంటి?
Dhurandhar 2: ధురంధర్ 2 ఒక్కో టికెట్ ధర అన్ని వేలా..అయినా దొరకని టికెట్.. ఇదెక్కడి క్రేజ్ సామీ!అసలు విషయంలోకి వెళ్తే.. ఢిల్లీలోని ఐనాక్స్ మెగాప్లెక్స్ లోని ఒక ప్రీమియం స్క్రీన్ లో ఒక టికెట్ ధరను రూ.3,100 నిర్ణయించారు. కేవలం 42 సీట్ల సామర్థ్యం ఉన్న ఈ లగ్జరీ స్క్రీన్ లోని రిక్లైనర్ సీట్ల కోసం ఈ స్థాయి ధరను ఫిక్స్ చేశారు. అయితే దీనికి అదనంగా బుక్ మై షో వంటి ప్లాట్ఫామ్ చార్జీలు కలిపి మరో 45 రూపాయల వరకు పెరుగుతుంది.. అయినప్పటికీ కూడా ఈ షోలకు సంబంధించిన టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు అవుతుండడం రణవీర్ సింగ్ క్రేజ్ కి నిదర్శనం. కేవలం ఢిల్లీలోనే కాకుండా ముంబైలోని బోర్విలి ఐనాక్స్ మెగాప్లెక్స్ లో కూడా టికెట్ ధర 3,100 చేశారు. అలాగే బెంగళూరు వంటి నగరాలలో కూడా డైన్ ఇన్ స్క్రీన్ టికెట్ ధర రూ.2000 నుంచీ రూ.2900 వరకు విక్రయిస్తున్నారు. ఈ స్థాయిలో ధరలు ఉన్నప్పటికీ కూడా షోస్ హౌస్ఫుల్ అవుతున్నాయి.. ఇప్పటికే దేశవ్యాప్తంగా లక్షలాది టికెట్లు కూడా అమ్మడు అయ్యాయి..అటు హిందీ వెర్షన్తో పాటు తెలుగులో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ వంటి భారీ బడ్జెట్ చిత్రం పోటీగా ఉన్నప్పటికీ కూడా ఈ సినిమాకి టికెట్లు భారీగా అమ్ముడుపోవడం గమనార్హం. ఏది ఏమైనా ఈ ధురంధర్ 2 : ది రివేంజ్ పాత రికార్డులన్నింటినీ కూడా తుడిచి పెట్టేలా కనిపిస్తోంది అని చెప్పడంలో సందేహం లేదు.