TRIGGR Kraken X1 Plus: ప్రస్తుత టెక్నాలజీ యుగంలో వైర్డ్ ఇయర్ ఫోన్స్ కాలం చెల్లిపోయింది. ఎటు వెళ్లాలన్నా, ఏ పని చేయాలన్నా వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ వాడకం తప్పని సరిగా మారిపోయింది. ముఖ్యంగా స్టూడెంట్స్ , టెక్ లవర్స్ పాకెట్ ఫ్రెండ్లీ బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లు కోరుకుంటుంటారు. ఈ కోవకు చెందిందే TRIGGR Kraken X1 Plus ట్రూ వైర్‌లెస్ గేమింగ్ హెడ్ సెట్. బ్లాక్ ఇన్‌ఫెర్నో లుక్‌తో అల్ట్రా-స్టైలిష్‌గా కనిపిస్తున్న ఈ ఇయ ర్‌బడ్స్ యూత్ మధ్య హాట్ టాపిక్‌గా మారాయి. ఇంతకీ ఈ ఇయర్ బడ్స్ ఫీచర్లేంటో తెలుసుకుందామా..
ఈ ఇయ ర్‌బడ్స్ మెయిన్ హైలైట్ దీని పవర్-ఫుల్ బ్యాటరీ లైఫ్. మార్కెట్లో.. సాధారణంగా లభించే ఇయర్‌బడ్స్‌తో పోలిస్తే.. ఇది ఛార్జింగ్ కేస్‌తో కలిపి దాదాపు 70 గంటల నాన్ స్టాప్ బ్యాటరీ బ్యాకప్ అందిస్తుంది. అంటే ఒక్క సారి ఫుల్ ఛార్జ్ చేస్తే రోజుల తరబడి ఛార్జింగ్ గురించి ఆలోచించాల్సిన పనే లేదు. లాంగ్ జర్నీలు చేసేవారికి, రోజంతా మ్యూజిక్ వినేవారికి ఇది ఒక పర్ఫెక్ట్ గాడ్జెట్.
సాధారణ ఇయర్ బడ్స్‌లో బ్యాటరీ ఎంత ఉందో తెలుసుకోవడం కష్టంగా ఉంటుంది. కానీ ఇందులో ప్రత్యేకమైన డిజిటల్ బ్యాటరీ డిస్‌ప్లే అందించారు. దీని వల్ల కేస్, ఇయర్ బడ్స్‌లో ఎంత పర్సెంట్ ఛార్జ్ మిగిలి ఉందో స్పష్టంగా స్క్రీన్‌పై కనిపిస్తుంది. దీని ద్వారా ఛార్జింగ్ ఎప్పుడు పెట్టుకోవాలో ముందుగానే తెలుస్తుంది.
ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నప్పుడు.. లేదా ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతున్నప్పుడు బయటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండటానికి ఇందులో క్వాడ్ ENC టెక్నాలజీని ఉపయోగించారు. నాలుగు మైక్రో ఫోన్ల సపోర్ట్ ఉండటం వల్ల మీ వాయిస్ అవతలి వారికి ఎలాంటి నాయిస్ లేకుండా అత్యంత స్పష్టంగా చేరుతుంది. ఆఫీస్ మీటింగ్స్ ,కాల్స్ కోసం ఇది చాలా చక్కగా పని చేస్తుంది.
Also Read: ఫ్రై,బేక్,గ్రిల్ అన్నీ ఒక్క చోటే!రూ.2,599కే ఎయిర్ ఫ్రైయర్
గేమింగ్ మోడ్, బ్లూటూత్ v5.3:
గేమర్స్ కోసం ఇందులో ప్రత్యేక మైన లో-లేటెన్సీ గేమింగ్ మోడ్ అందుబాటులో ఉంది.ఇది గేమ్స్ ఆడేటప్పుడు ఆడియో సింక్ సమస్య లేకుండా పర్ఫెక్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. అలాగే.. ఇందులో లేటెస్ట్ బ్లూ టూత్ v5.3 టెక్నాలజీని వాడటం వల్ల ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌తో క్షణాల్లో కనెక్ట్ అవుతుంది. సిగ్నల్ డ్రాప్స్ లేని స్టేబుల్ కనెక్షన్ లభిస్తుంది. అంతే కాకుండా.. ఒకే సమయంలో రెండు డివైస్‌లకు కనెక్ట్ చేసు కునే డ్యూయల్ పేరింగ్ ఫీచర్ కూడా ఇందులో ఉంది.
మార్కెట్లో లభిస్తున్న ఇతర బ్రాండ్ల వైర్ లెస్ ఇయర్ బడ్స్‌తో పోలిస్తే..కేవలం రూ. 99 ధరకే లభిస్తున్న ఈ మోడల్ నిజంగా ఒక అద్భుతమైన వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్. తక్కువ బడ్జెట్‌లో.. అదిరి పోయే బ్యాటరీ లైఫ్, గేమింగ్ ఫీచర్లు కోరు కునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్.