M.M.Keeravani: ప్రముఖ సంగీత దర్శకులు, ఆస్కార్ గ్రహీత ఎంఎం కీరవాణి (MM Keeravani) ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి శివశక్తి దత్త (Shiva Shankti dutta) అలియాస్ కోడూరి సుబ్బారావు 92 సంవత్సరాల వయసులో హైదరాబాదులో అర్ధరాత్రి కన్నుమూశారు. దీంతో అటు రాజమౌళి (Rajamouli) కుటుంబంలోనే కాదు ఇటు సినీ ఇండస్ట్రీలో కూడా విషాదం అలుముకుంది. ఆయన సై, ఛత్రపతి, బాహుబలి, ఆర్ఆర్ఆర్, హనుమాన్ వంటి సినిమాలకు పాటలు రాశారు. అలాగే కొన్ని చిత్రాలకు స్క్రీన్ రైటర్ గా కూడా పనిచేశారు. ఇక స్టార్ డైరెక్టర్ రాజమౌళి (Rajamouli) తండ్రి విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad), అలాగే శివశక్తి దత్త ఇద్దరూ సోదరులు కావడం గమనార్హం. శివశక్తి దత్త మరణంతో సినీ సెలబ్రిటీలు.. ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. అలాగే రాజమౌళి, కీరవాణి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
శివశక్తి దత్తా బాల్యం, కుటుంబం..
తెలుగు సినిమా గీతా రచయితగా, స్క్రీన్ ప్లే రచయితగా,చిత్రకారుడుగా కూడా పేరు సొంతం చేసుకున్నారు. 1932 అక్టోబర్ 8న జన్మించిన ఈయన అసలు పేరు కోడూరి సుబ్బారావు. ఈయన కుటుంబం ఆంధ్రప్రదేశ్, రాజమండ్రి సమీపంలోని కోవూరుకు చెందింది. ఈయన తండ్రి కోడూరు విజయ అప్పారావు. ఈయన కోవూరులో పెద్ద భూస్వామి. కాంట్రాక్టర్ గా వ్యవహరించేవారు. అక్కడ 12 బస్సులతో రవాణా సంస్థను కూడా స్థాపించారు.
కమలేష్ పేరుతో రచనలు..
ఇక శివశక్తి దత్తాకి చిన్నప్పటి నుంచే కలల పట్ల ఎక్కువ మక్కువ ఉండడంతో మొదట ఏలూరు సి.ఆర్. రెడ్డి కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతూ మధ్యలోనే చదువు ఆపేశారు. ఇక చిన్నప్పటినుంచి కలల వైపు మొగ్గు చూపిన ఈయన.. తన ఇంటి నుండి పారిపోయి ముంబై సర్. జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్ కళాశాలలో చేరారు. ఇంటి నుండి పారిపోయి రెండు సంవత్సరాల తర్వాత డిప్లమా పూర్తి చేసి తిరిగి పట్టుకొని కోవూరికి చేరుకున్నాడు. ఇక చిన్నతనంలోనే కమలేష్ అనే కలం పేరుతో రచనలు చేయడం మొదలుపెట్టిన ఈయన.. ఆ తర్వాత సుబ్బారావు అనే తన పేరును శివశక్తి దత్తగా మార్చుకొని గిటార్, సితార్, హార్మోనియం వాయించడం నేర్చుకున్నారు.
శివశక్తి దత్తా సినీ జీవితం..
సినిమాల మీద మక్కువతో మద్రాస్ వెళ్లి పోయిన శివశక్తి దత్తా ఇద్దరి దర్శకుల వద్ద పనిచేసి ‘పిల్లను గ్రోవి’ అనే సినిమా ప్రారంభించారు. కానీ ఏ సినిమా ఆర్థిక కారణాల వల్ల మధ్యలో ఆగిపోయింది. ఆ తర్వాత తన స్నేహితుడైన సమతా ముఖర్జీ ద్వారా దర్శకుడు కే రాఘవేంద్రరావుతో పరిచయం ఏర్పడి, జానకి రాముడు సినిమాతో మొదటి అవకాశం అందుకున్నారు. 1988లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. ఇకపోతే ఉత్తమ గీతా రచయితగా ‘మమతల తల్లి’ పాట కోసం నామినేట్ కూడా చేయబడ్డారు. చంద్రహాస్ సినిమాకి దర్శకత్వం కూడా వహించారు.
ALSO READ:Nagarjuna: హమ్మయ్య.. ఇన్నాళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాగ్.. మరి వర్కౌట్ అవుతుందంటారా?