OTT Movie : ఓటీటీలో ఎన్నో సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటిలో కొన్ని సినిమాలు డిఫరెంట్ స్టోరీలతో, నెక్స్ట్ ఎం జరుగుతుందనే ఆసక్తిని పెంచుతాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో ఒక ఫ్లైట్ లో ఆత్మలు రివేంజ్ తీర్చుకోవడానికి వస్తాయి. ఆ తరువాత స్టోరీ బీభత్సంగా నడుస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ సూపర్ నాచురల్ హారర్-థ్రిల్లర్ మూవీ పేరు ‘ఫ్లైట్ 666’ (Flight 666). 2018 లో వచ్చిన ఈ సినిమాకి రాబ్ పల్లటినా దర్శకత్వం వహించారు. ఇందులో లిజ్ ఫెన్నింగ్, జోస్ రోసెట్, జోసెఫ్ మైఖేల్ హారిస్, రెనీ విలెట్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ కథ ఒక విమానంలో జరిగే అతీంద్రియ ఘటనల చుట్టూ తిరుగుతుంది. ఇక్కడ హత్యకు గురైన యువతుల ఆత్మలు హంతకుడిని లక్ష్యంగా చేసుకుంటాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ సినిమా అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళితే
ఈ సినిమా ఒక సీరియల్ కిల్లర్ యువతులను హత్య చేసే సీన్స్ తో ప్రారంభమవుతుంది. ఈ దృశ్యాలు ఓపెనింగ్ క్రెడిట్స్‌లో మాంటేజ్‌గా చూపబడతాయి. కెమెరా చివరి హత్య నుంచి ఆకాశంలోకి జూమ్ అవుట్ అయి, తుఫానులో చిక్కుకున్న పాన్ యూఎస్ 57 అనే విమానం వైపు తిరుగుతుంది. ఈ విమానం న్యూయార్క్ కు ప్రయాణిస్తున్న ఒక అంతర్జాతీయ విమానం. కానీ త్వరలోనే ఇందులో ఒక భయంకరమైన సంఘటన జరుగుతుంది. ఇప్పుడు విమానంలో ప్రయాణికులు, సిబ్బంది ప్రయాణం ప్రారంభిస్తారు. కానీ కొంత దూరం వెళ్ళాక, ఒక తుఫాను కారణంగా విమానం తీవ్రంగా కదిలిపోతుంది. ఇంజిన్ సమస్యలు తలెత్తుతాయి. ఒక ప్రయాణికుడు విమానం రెక్కలపై భయంకరమైన రూపాలను చూసి భయపడతాడు. దీంతో అతను విమానంలో గందరగోళం సృష్టిస్తాడు. ఎయిర్ మార్షల్ థాడియస్ అతన్ని అదుపు చేస్తాడు.
ఫ్లైట్ అటెండెంట్ అలీస్ ప్రయాణికులను శాంతింపజేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ విమానంలో వింత సంఘటనలు జరగడం ప్రారంభమవుతాయి. విమానంలో సర్వీస్ చేసిన ఆహారంలో పురుగులు కనిపిస్తాయి. విద్యుత్ సరఫరా ఆగిపోతుంది. ప్రయాణికులు క్యాబిన్‌లో భయంకరమైన ఆత్మలను చూస్తారు. టాయిలెట్‌లలో ఉన్నవారు అద్దంలో భూతాలను చూస్తారు. ఈ ఘటనలు ప్రయాణికులలో మరింత భయాన్ని కలిగిస్తాయి. వీళ్ళు ఈ అతీంద్రియ శక్తుల వెనుక కారణాన్ని కనిపెట్టేందుకు ప్రయత్నిస్తారు. ఈ ఆత్మలు ఒక సీరియల్ కిల్లర్ చేత హత్యకు గురైన యువతులవి. ఆ హంతకుడు ఈ విమానంలోనే ఉంటాడు. ఈ ఆత్మలు తమని చంపిన హంతకుడిపై ప్రతీకారం తీర్చుకోవడానికే విమానంలో కి వస్తాయి. చివరికి ఈ ఆత్మలు కిల్లర్ పై పగ తీర్చుకుంటాయా ? కిల్లర్ ఆత్మలను ఎదుర్కుంటాడా ? ఫ్లైట్ 666 సురక్షితంగా ల్యాండ్ అవుతుందా ? అనే విషయాలను, ఈ సూపర్ నాచురల్ హారర్-థ్రిల్లర్ మూవీని చూసి తెలుసుకోండి.
Read Also : ఈగకు దొంగతనం నేర్పి కోటీశ్వరులయ్యే ప్లాన్… చివరకు బుర్రపాడు ట్విస్ట్