E-Paper
Advertisement

 స్పేస్ స్టేషన్‌లో ఘోర ప్రమాదం… భూమికి తిరిగొచ్చేసరికి కూతురే మారిపోయింది మావా

 స్పేస్ స్టేషన్‌లో ఘోర ప్రమాదం… భూమికి తిరిగొచ్చేసరికి కూతురే మారిపోయింది మావా
Advertisement

Sci-Fi Mystery Thriller Series: అంతరిక్షంలో జరిగిన ఓ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఓ వ్యోమగామి భూమికి తిరిగి వస్తుంది. కానీ ప్రాణాలతో ఇంటికి చేరాననే ఆనందం ఆమెకు ఎక్కువసేపు ఉండదు. తన ఇంట్లో అన్నీ తెలిసినవే ఉన్నా… ఏదో తేడాగా అనిపిస్తుంది. ముఖ్యంగా తన కూతురు ప్రవర్తన ఆమెను షాక్‌ కు గురి చేస్తుంది. తాను గుర్తుపట్టే ప్రపంచం, తన కుటుంబం, తన గతం… అన్నీ ఒక్కొక్కటిగా అనుమానంగా మారుతాయి. అంతరిక్షంలో జరిగిన ఓ శాస్త్రీయ ప్రయోగం, తన అనుభవం, భూమికి వచ్చిన తర్వాత కనిపిస్తున్న మార్పుల మధ్య సంబంధం ఉందని ఆమెకు అర్థమవుతుంది. ఇలా ఇంట్రెస్టింగ్ గా సాగే సై-ఫై స్టోరీనే ‘కాన్‌స్టెలేషన్’ (Constellation). మరి ఈ సిరీస్ ను ఎక్కడ చూడవచ్చు ? అన్న విషయంపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

జో ఎరిక్సన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ లో మిషన్‌ లో పాల్గొంటుంది. అక్కడ జరుగుతున్న ఓ ప్రమాదం ఆమెతో పాటు మిషన్‌ లో ఉన్నవారి జీవితాలను ప్రమాదంలోకి నెడుతుంది. జో డేంజరస్ పరిస్థితుల మధ్య భూమికి తిరిగి రావడానికి ప్రయత్నిస్తుంది. చివరకు ఇంటికి చేరిన తర్వాత తన జీవితంలో కొన్ని కీలకమైన విషయాలు మారిపోయాయని గుర్తిస్తుంది. ముఖ్యంగా తన చిన్న కూతురు ఆలిస్ తో ఉన్న సంబంధం జోకు అర్థం కాని విధంగా మారుతుంది. కూతురి ప్రవర్తనలో కనిపించే మార్పులు ఆమెను కలవర పెడతాయి.

Advertisement

జోకు మాత్రం తన జ్ఞాపకాలు, తాను చూసిన సంఘటనలు నిజమేననే నమ్మకం ఉంటుంది. ప్రమాదానికి ముందు హెన్రీ కాల్డర్ ఓ ప్రయోగం నిర్వహిస్తుంటాడు. ఆ ప్రయోగం క్వాంటమ్ ఫిజిక్స్‌ కు సంబంధించిన ఓ కీలక అంశంతో ముడిపడి ఉంటుంది. ప్రమాదం తర్వాత ఆ ప్రయోగం, జో అనుభవించిన విషయాలు, భూమికి వచ్చిన తర్వాత కనిపిస్తున్న మార్పుల మధ్య సంబంధాన్ని శాస్త్రవేత్తలు పరిశీలించడం మొదలు పెడతారు. జో తనపై నమ్మకం పెట్టుకోని వాళ్ల మధ్య నిజాన్ని వెతకాల్సి వస్తుంది. ఆమెకు జరిగిన అనుభవాలను మానసిక సమస్యగా భావించే వాళ్లు కూడా ఉంటారు.

కానీ జోకు మాత్రం ఏదో పెద్ద విషయం దాగి ఉందనే నమ్మకం తగ్గదు. తన కూతురిని కాపాడుకోవడం ఆమెకు మొదటి లక్ష్యంగా మారుతుంది. అదే సమయంలో అంతరిక్షంలో జరిగిన ప్రమాదానికి అసలు కారణం ఏంటో తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంది. తనకు తెలిసిన వాస్తవం, ఇతరులు చెబుతున్న వాస్తవం మధ్య తేడా పెరుగుతున్న కొద్దీ కథ మరింత మైండ్‌ బెండింగ్‌ గా మారుతుంది. అంతరిక్ష ప్రమాదం నుంచి మొదలైన కథ చివరకు గుర్తింపు, కుటుంబం, శాస్త్రం, వాస్తవం అనే అంశాల చుట్టూ తిరుగుతుంది. మరి జో తన కూతురిని తిరిగి పొందడానికి ఏం చేసింది ? జరిగిన నిజాన్ని బయట పెట్టడానికి ఆమె ఏం చేసింది ? క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటి ? అన్నది తెలియాలంటే మూవీని చూడాల్సిందే.

తెలుగులో ఉందా లేదా ?

Advertisement

నూమీ రాపేస్ (Noomi Rapace), జొనాథన్ బ్యాంక్స్ (Jonathan Banks), జేమ్స్ డార్సీ (James D’Arcy) ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘కాన్‌స్టెలేషన్’. దీనికి పీటర్ హార్నెస్ (Peter Harness) సృష్టికర్త. Apple TVలో అందుబాటులో ఉంది. అయితే తెలుగు సబ్‌టైటిల్స్ తో మాత్రమే చూడవచ్చు.

Read Also: టీవీ రేటింగ్స్ కోసం నేరస్థులను లైవ్‌ లో పట్టుకునే రియాలిటీ షో… హై-టెన్షన్ థ్రిల్లర్

Tags

Related News

ఒక్క ఇంజెక్షన్ తో మల్టీవర్స్ లోకి… పెళ్ళాం కాని పెళ్ళాంతో కాపురం… మైండ్‌బ్లోయింగ్ సై-ఫై థ్రిల్లర్

టైమ్ ట్రావెల్ చేసి మరీ చావగొట్టే సైకో… మైండ్‌బెండింగ్ థ్రిల్లర్

చనిపోయిన బిడ్డను తిరిగి తెచ్చే నానీ… ఆ ఇంట్లోకి అడుగు పెట్టాక వెన్నులో వణుకు పుట్టించే వింతలు

ఓటీటీలోకి మమిత బైజు ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

17 ఏళ్ల తర్వాత కిల్లర్ కి విడుదల… అమాయకులను ఇరికించే లాయర్లను వేటాడే కిల్లర్… ఇంటెన్స్ సైకో థ్రిల్లర్

మనుషుల్ని వేటాడే కోటీశ్వరులు… వేటలో చిక్కుకున్న అమ్మాయే వేటగాళ్లను వేటాడితే ? బ్లడీ సర్వైవల్ థ్రిల్లర్

బిగ్ బాస్ తరహాలో మరో రియాలిటీ షో.. తెలుగులో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×