Chiranjeevi-Nandamuri Balakrishna: ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ చేసిన కామెంట్స్ పై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఏపీ అసెంబ్లీలో చిరంజీవి ఉద్దేశిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలను చిరు ఖండించారు. మాజీ సీఎం జగన్ ఒక సైకో.. కరోనా సమయంలో సినిమా టికెట్ల విషయమైన సినీ ఇండస్ట్రీ మొత్తం ఆయనను కలిశారు. ఆ సమయంలో చిరంజీవి అప్పటి సీఎంగా ఉన్న వైసీసీ అధినేత జగన్ అవమానించారంటూ అసెంబ్లీ సాక్షిగా బాలయ్య వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలపై చిరు స్పందిస్తూ..
“అసెంబ్లీలో బాలకృష్ణ ఒకింత వ్యంగ్యం మాట్లాడటం టీవీలో చూశా. నా పేరు ప్రస్థావనకు వచ్చింది కాబట్టి వివరణ ఇస్తున్నా. నన్ను లంచ్కి రావాలని జగన్ ఆహ్వానించారు. ఆయన ఆహ్వానం మేరకు మేమంత వెళ్లాం. నన్ను జగన్ సాదరంగా ఆహ్వానించారు. సినీ పరిశ్రమలోని సమస్యలన్ని ఆయనకు వివరించారు. సమయం ఇస్తే అందరం కలిసి వస్తామంటే సరే అన్నారు. కోవిడ్ కారణంగా ఐదుగురు మాత్రమే రావాలన్నారు. కానీ, మేము పదిమంది వస్తామంటే ఆయన సరే అన్నారు, టికెట్ ధరల పెంపు విషయమై మాట్లాడాం. ప్రభుత్వ నిర్ణయం వల్లే వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య మూవీ టికెట్ రేట్స్ పెరిగాయి” అని ఆయన అన్నారు.
“అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆహ్వానం మేరకే నేను ఆయన నివాసానికి వెళ్లాను. నన్ను వారు సాదరంగా ఆహ్వానించారు. లంచ్ చేస్తున్న సమయంలో నేను సినీ పరిశ్రమ ఇబ్బందులని వారికి వివరించాను. పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య గ్యాప్ ఉందని అందరూ అనుకుంటున్నారు. సమయం ఇస్తే.. అందరం కలిసి వస్తామని అన్నాను. నా రిక్వెస్ట్ మేరకు కొన్ని రోజుల తర్వాత మంత్రి పేర్ని నాని గారు ఫోన్ చేసి కొవిడ్ రెండో దశ కొనసాగుతున్నందున ఐదుగురు మాత్రమే రావాలి అని అన్నారు.
నేనప్పుడు ఓ 10 మంది వరకు వస్తామని చెప్పడంతో సరేనన్నారు. డేట్ ఫిక్స్ చేసి మమ్మల్ని రమ్మన్నారు. అప్పుడు నేను బాలకృష్ణ గారిని ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించాను. కానీ, ఆయన అందుబాటులోకి రాలేదు. జెమిని కిరణ్ గారిని వెళ్లి బాలకృష్ణ గారిని కలవమని చెప్పాను. ఆయన మూడుసార్లు ప్రయత్నించినా బాలకృష్ణ అందుబాటులోకి రాలేదు. దీంతో నేను ఒక ఫ్లైట్ ఏర్పాటు చేసి ఆర్ నారాయణ మూర్తి గారితో సహా మరి కొంతమందిని వెళ్లి ముఖ్యమంత్రి గారిని కలిశాము. ఆ సమయంలో నేను ముఖ్యమంత్రి గారితో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని వివరించాను. ఇండస్ట్రీకి ప్రభుత్వ సహకారం అందించాలని కోరాను.
Also Read: Shah Rukh Khan: కొడుకు చేసిన పనికి షారుక్‌కి భారీ మూల్యం.. రూ. 2 కోట్లు పరువు నష్టం దావా!
అందుకు అక్కడున్న వారందరూ సాక్ష్యమే. నేను ఆ రకమైన చొరవ తీసుకోవడం వల్లనే అప్పుటి ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల పెంపునకు అంగీకారం తెలిపింది. ఆ నిర్ణయంతో సినీ పరిశ్రమకు ఎంతో కొంత మేలు జరిగింది. ఆయన నిర్ణయం వల్లే వీరసింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాల టికెట్ రేట్స్ పెరిగింది. తద్వారా ఇటు నిర్మాతలకు, అటు డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు లాభం చేకూరింది. నేను రాష్ట్ర ముఖ్యమంత్రితోనైనా, సామాన్యుడితోనైనా నా సహజ సిద్ధమైన ధోరణిలోనే గౌరవం ఇచ్చిపుచ్చుకునే విధానంలోనే మాట్లాడుతాను. నేను ప్రస్తుతం ఇండియాలో లేను కనుక పత్రికా ప్రకటన ద్వారా జరిగిన వాస్తవాన్ని అందరికీ తెలియచేస్తున్నాను” అంటూ చిరు తన ప్రకటనలో పేర్కొన్నారు.