Chiranjeevi:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కి ప్రత్యేక స్థానం ఉంది. సినీ ఇండస్ట్రీలోకి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి.. నేడు మెగాస్టార్ గా ఎదిగారు అంటే ఆయన కష్టం ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆయన వేసిన విత్తనం ద్వారా ఇప్పుడు ఎంతోమంది హీరోలు ఆ కుటుంబం నుంచి ఇండస్ట్రీలో చలామణి అవుతున్నారు. స్టార్ హీరోలుగా, గ్లోబల్ స్టార్ కూడా పేరు తెచ్చుకున్న హీరోలు ఉన్నారు. ఇకపోతే చిరంజీవి ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరొకవైపు సామాజిక కార్యక్రమాలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. అంతేకాదు ఆయన చేసే సహాయ సహకారాల వల్ల ఎంతోమంది ఆయనకు రుణపడి ఉంటారనడంలో సందేహం లేదు అంటూ అభిమానులు కూడా చాలా గొప్పగా చెప్పుకుంటున్న విషయం తెలిసిందే..
బ్లడ్ బ్యాంక్ పేరిట భారీ సహాయం..
ఇకపోతే చిరంజీవి చేస్తున్న మంచి పనులలో బ్లడ్ బ్యాంకు కూడా ఒకటి. చాలా ప్రదేశాలలో ఆయన అభిమానులు ఈ బ్లడ్ బ్యాంకులను నిర్వహిస్తున్నారు. అవసరమైన వారికి సకాలంలో ఈ బ్లడ్ బ్యాంకు ద్వారా రక్తాన్ని సరఫరా చేస్తూ ప్రాణాన్ని నిలబెడుతున్నారు. ముఖ్యంగా ఇది కనివిని ఎరుగని రీతిలో భారీ స్థాయిలో పాపులారిటీ సొంతం చేసుకుంది. ఈ బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతోమంది సకాలంలో సేవలు పొందుతున్నారు. అయితే చిరంజీవి ఈ బ్లడ్ బ్యాంక్ పెట్టడం వెనుక అసలు కారణం ఏంటి? అనే విషయం మాత్రం చాలా మందికి తెలియదనే చెప్పాలి. అయితే తాజాగా ఒక ఈవెంట్ లో పాల్గొన్న ఆయన ఈ బ్లడ్ బ్యాంక్ పెట్టడం వెనక అసలు కారణాన్ని తెలియజేశారు.
బ్లడ్ బ్యాంక్ పెట్టడానికి ఆయనే కారణం – చిరంజీవి
అసలు విషయంలోకి వెళ్తే.. ఆగస్టు 22వ తేదీన మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు కావడంతో ఇప్పటి నుంచే అభిమానులు తెగ హడావిడి చేస్తున్న విషయం తెలిసిందే.. మరొకవైపు ఫీనిక్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ డ్రైవ్ కి చిరంజీవితో పాటు యంగ్ హీరో తేజ సజ్జ (Teja Sajja) కూడా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.. ఇక్కడ రక్తదానం గొప్పతనాన్ని కూడా వివరించారు. ఇక ఇదే విషయంపై చిరంజీవి మాట్లాడుతూ..” ఈ బ్లడ్ బ్యాంకు పెట్టాలనే ఆలోచన నాకు ఒక జర్నలిస్ట్ కారణంగా వచ్చింది. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఆయన రాసిన ఒక ఆర్టికల్ చదివిన తర్వాతే నాకు ఈ ఆలోచన వచ్చింది. అయితే ఇప్పటివరకు నేను ఆయనను చూడనేలేదు. కానీ ఎప్పుడూ కూడా ఆయనను గుర్తు చేసుకుంటూనే ఉంటాను” అంటూ చిరంజీవి తెలిపారు. మొత్తానికైతే ఒక జర్నలిస్ట్ ఇచ్చిన స్ఫూర్తితో నేడు బ్లడ్ బ్యాంక్ సామ్రాజ్యాన్ని విస్తరించారు చిరంజీవి. ఇకపోతే అలాంటి ఒక గొప్ప వ్యక్తిని తాను ఇప్పటివరకు చూడకపోవడం ఆశ్చర్యకరమనే చెప్పాలి.
చిరంజీవి సినిమాలు..
చిరంజీవి సినిమాల లైనప్ విషయానికి వస్తే వశిష్ట మల్లిడి (Vassishta Mallidi ) దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమా పూర్తి చేశారు.. ఈ సినిమా విడుదల డేట్ త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నట్లు సమాచారం. మరొకవైపు తన 157వ చిత్రాన్ని అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. అలాగే ప్రముఖ యంగ్ డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్నారు చిరంజీవి.
ALSO READ:Suman: పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్న హీరో సుమన్.. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ నుంచే!