Mint Tea: పుదీనా ఆకులు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. వీటిలోని పోషకాలు కొన్ని రకాల వ్యాధుల బారి నుంచి మనల్ని రక్షిస్తాయి. అయితే వీటిని టీ తయారీలో కూడా వాడొచ్చు. పుదీనా ఆకులతో తయారుచేసే టీ, మంచి సువాసనతో పాటు రుచితో మనస్సుకి, శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేదంలోనూ దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పుదీనా టీ తాగడం వల్ల మన శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయనే విషయాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పుదీనా టీ తాగితే కలిగే ప్రయోజనాలు:
జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది:
పుదీనా టీలో ఉండే మెంతాల్ అనే రసాయనం, జీర్ణవ్యవస్థలోని కండరాలను సడలించి, కడుపునొప్పి, గ్యాస్, ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలను తగ్గిస్తుంది. భోజనం తర్వాత ఒక కప్పు పుదీనా టీ తాగడం వల్ల ఆహారం తేలికగా జీర్ణమవుతుంది. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ వంటి జీర్ణ సమస్యల నివారణకు కూడా ఇది ఉపయోగపడుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
ఒత్తిడిని తగ్గిస్తుంది:
పుదీనా టీలో ఉండే సువాసన మనస్సును శాంతపరుస్తుంది. పుదీనా టీ తాగడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. అంతే కాకుండా ఇది మెదడులోని కొన్ని భాగాలను ప్రభావితం చేసి.. ప్రశాంతతను కలిగిస్తుంది. రాత్రి పడుకునే ముందు ఒక కప్పు పుదీనా టీ తాగడం వల్ల కూడా గాడ నిద్ర పడుతుంది.
తలనొప్పి, మైగ్రేన్‌లకు ఉపశమనం:
పుదీనా టీలో ఉండే మంటాటినిస్ లక్షణాలు తలనొప్పి, మైగ్రేన్‌లకు ఉపశమనాన్ని అందిస్తాయి. పుదీనా టీ ఆవిరిని పీల్చడం వల్ల ముక్కు దిబ్బడ తగ్గి, తలనొప్పి తగ్గుతుంది. మెంతాల్ కండరాలను సడలించడం ద్వారా తలనొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.
జలుబు, దగ్గు నుంచి ఉపశమనం:
జలుబు, దగ్గు వంటి సమస్యలు ఉన్నప్పుడు పుదీనా టీ తాగడం వల్ల శ్వాసనాళాలు తెరుచుకుంటాయి. తద్వారా శ్వాస తీసుకోవడం సులభమవుతుంది. దీనిలోని మెంతాల్ గొంతు నొప్పిని తగ్గించి, గొంతుకి ఉపశమనం ఇస్తుంది. ఇది ఒక సహజమైన కాండియాటక్ లాగా పనిచేస్తుంది.
నోటి ఆరోగ్యం:
పుదీనాలో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. పుదీనా టీ తాగడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది. అంతేకాకుండా.. నోటిలోని సూక్ష్మక్రిములను నాశనం చేసి.. నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
Also Read: తరచూ కాళ్లు, చేతులకు తిమ్మిర్లు పడుతున్నాయా ?
రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
పుదీనా టీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మన శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇది శరీరంలోని హానికరమైన ఫ్రీరాడికల్స్ నుంచి కణాలను రక్షించి, వ్యాధులు రాకుండా నివారిస్తుంది.
బరువు తగ్గడానికి సహాయపడుతుంది:
పుదీనా టీలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇది కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. అంతే కాకుండా ఆహారంపై కోరికలను తగ్గించి.. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
పుదీనా టీని తయారుచేయడం చాలా సులభం. వేడి నీటిలో కొన్ని తాజా పుదీనా ఆకులను వేసి, 5-10 నిమిషాలు ఉంచితే చాలు, ఆరోగ్యకరమైన, రుచికరమైన టీ సిద్ధం అవుతుంది. రుచి కోసం కొద్దిగా తేనె లేదా నిమ్మరసం కలుపి తీసుకున్నా కూడా మంచి ఫలితం ఉంటుంది.