E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

విశ్వంభర వచ్చేస్తోంది.. చిరు సోషియో-ఫాంటసీ అడ్వెంచర్ అఫీషియల్ రిలీజ్ డేట్ ఇదే

విశ్వంభర వచ్చేస్తోంది.. చిరు సోషియో-ఫాంటసీ అడ్వెంచర్ అఫీషియల్ రిలీజ్ డేట్ ఇదే
Advertisement

Vishwambhara Release:వచ్చేసింది …మెగాస్టార్ సినిమా సాలిడ్ అప్డేట్ వచ్చేసింది..ఎన్నాళ్ళగానో  ఎదురుచూస్తున్న విశ్వంభర రిలీజ్ డేట్ వచ్చేసింది.బింబిసారా ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సోషల్ ఫాంటసీ అడ్వెంచర్ విజువల్ వండర్ రిలీజ్ డేట్ పై ఒక క్లారిటీ వచ్చేసింది.ఈ భారీ బడ్జెట్ సినిమాని వచ్చే దసరా పండక్కి అంటే 2026 అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గా థియేటర్లో రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారట మేకర్స్ .ఎన్నేళ్లగానో వాయిదాల పాటలు పాడుతున్న విశ్వంభర ఇప్పటికైనా వచ్చేస్తుందంటూ మురిసిపోతున్నారు మెగా ఫ్యాన్స్ .

పూర్తిస్థాయి సోషల్ ఫాంటసీ అడ్వెంచర్ ఇదే

మెగాస్టార్ కెరీర్ లోనే మైల్ స్టోన్స్ గా నిలిచిన జగదేకవీరుడు అతిలోకసుందరి, అంజి వంటి సోషియో ఫాంటసీ సినిమాలు  టాలీవుడ్ హిస్టరీలోనే సరికొత్త ట్రెండ్ సెట్ చేశాయి. మళ్లీ ఇన్నేళ్ళకి  పూర్తిస్థాయి సోషల్ ఫాంటసీ అడ్వెంచర్ ఇదే సినిమా కావడంపై విశ్వంభరపై భారీ అంచనాలు పెట్టేసుకున్నారు అంతా .ఇక మొదటి సినిమాతోనే సాలిడ్ హిట్ కొట్టిన బింబిసారా ఫేమ్ వశిష్ట దీన్ని తెరకెక్కిస్తుండటం ఇక్కడ విశేషం.

Advertisement

Also read :లెక్చర్లు లేవు.. డైరెక్ట్ కౌంటర్! కాలేజీ ఈవెంట్‌లో అలియా భట్ మాస్ పంచ్.. వైరల్ వీడియో!

విఎఫ్ఎక్స్ అండ్  గ్రాఫిక్స్ పనులపై ప్రత్యేక శ్రద్ధ

ప్రముఖ నిర్మాణ సంస్థ యు వి క్రియేషన్స్ ఎక్కడ రాజీ పడకుండా భారీ బడ్జెట్ తో (దాదాపు 160 కోట్లని టాక్ ) ఈ సినిమాని నిర్మిస్తుంది .ఇక RRR తో ఆస్కార్ దక్కించుకున్న ఎం ఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతాన్ని అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తుండటంతో సినిమా రేంజ్ మరో లెవెల్ కి చేరింది.వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది.కానీ మొదటగా వదిలిన గ్లిమ్ప్స్ లో విఎఫ్ఎక్స్ నాసిరకంగా ఉందన్న విమర్శలు రావడంతో సినిమా విజువల్ విఎఫ్ఎక్స్ అండ్  గ్రాఫిక్స్ పనులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు వశిష్ట.

2026 అక్టోబర్ 16వ తేదీన రిలీజ్ 

Advertisement

ఇక ఈ విశ్వంభర లోని ఫాంటసీ వరల్డ్ లో చిరంజీవి మార్క్ డైలాగ్స్, గ్రేస్ ఫుల్ డాన్స్, అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ అన్ని విజువల్ ఫీస్ట్ లా ఉండబోతున్నాయని ఇన్ సైడ్ టాక్ అసలే  దసరా అంటేనే హిట్ సినిమాల సీజన్.అలాంటి సీజన్ రేస్ లోకి  విశ్వంభర రావటం చూస్తుంటే బాక్సాఫీస్  వద్ద సరికొత్త రికార్డులు రిరైట్ అవుతాయి అనడంలో ఆశ్చర్యం లేదు.మొత్తంగా 2026 అక్టోబర్ 16వ తేదీ కోసం అటు టాలీవుడ్ ట్రేడ్ వర్గాలతో పాటు ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు చూడాలి మరి భారీ అంచనాలతో దసరా బరిలోకి దిగుతున్న ఈ విశ్వం భరుడు అంచనాలు అందుకుంటాడో  లేక అంజి సినిమాల డిసప్పాయింట్ చేస్తాడో .

Also read :నోలన్ మార్క్ విజువల్ వండర్: ‘ది ఒడిస్సీ’ ఫైనల్ ట్రైలర్ అవుట్.

Related News

గ్లోబల్ లెవెల్‌లో గౌరవం… రాజమౌళి ఎమోషనల్ పోస్ట్ !

మూడేళ్ల గ్యాప్ పై అఖిల్ రియాక్షన్.. 48 కుట్లు.. 2 సర్జరీలు అంటూ!

నా జీవితాన్ని మార్చిన దేవుడు – ఐశ్వర్య రాజేష్!

లెక్చర్లు లేవు.. డైరెక్ట్ కౌంటర్! కాలేజీ ఈవెంట్‌లో అలియా భట్ మాస్ పంచ్.. వైరల్ వీడియో!

పెళ్లే వద్దన్న బ్యూటీ.. బిడ్డల్ని కనాలనుందంటోందేంటి ?

జైలర్ 2 రిలీజ్ డేట్.. కౌంట్ డౌన్ మొదలుపెట్టిన మేకర్స్!

నోలన్ మార్క్ విజువల్ వండర్: ‘ది ఒడిస్సీ’ ఫైనల్ ట్రైలర్ అవుట్.

Big Stories

×