Akhil Akkineni:కింగ్ నాగార్జున వారసుడిగా సిసింద్రీ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అఖిల్ ఆ తర్వాత అఖిల్ సినిమాతో హీరోగా అవతరించి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు.. గుడ్ లుకింగ్ తో అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిన అఖిల్ వరుస పెట్టి హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ వచ్చారు. కానీ అవేవీ ఆయన కెరియర్ కు ఉపయోగపడలేదు. ఏజెంట్ సినిమాతో ఎలాగైనా సరే బ్లాక్ బాస్టర్ అందుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఈ సినిమా కోసం రిస్క్ కూడా తీసుకున్నారు. కానీ ఈ సినిమా కూడా అఖిల్ కు విజయాన్ని అందించలేకపోయింది. ఇక ఏజెంట్ సినిమా డిజాస్టర్ తర్వాత సుమారుగా మూడేళ్ల గ్యాప్ తీసుకొని లెనిన్ సినిమా ప్రకటించారు.
ఆ సమయంలో 3 ఏళ్లు గ్యాప్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనే విషయంపై పలు రకాల వార్తలు వినిపించాయి. ఏజెంట్ సినిమా ఫలితంతో ఆయన డిప్రెషన్ లోకి వెళ్లిపోయారని కొంతమంది కామెంట్లు చేస్తే.. మరికొంతమంది మంచి కథతో విజయాన్ని అందుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.. అందుకే మూడేళ్ల గ్యాప్ తీసుకున్నారు అంటూ ఇలా ఎవరికివారు తమకు తోచిన అభిప్రాయాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ రూమర్స్ అన్నింటికీ చెక్ పెడుతూ తాను ఏజెంట్ తర్వాత మూడు సంవత్సరాల గ్యాప్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనే విషయంపై స్పందించారు.
ఏజెంట్ డిజాస్టర్ తర్వాత లెనిన్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అఖిల్. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయగా అటు ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. యూట్యూబ్లో ట్రెండింగ్ లో నిలిచింది. అఖిల్ రగ్గడ్ లుక్, మాస్ అప్పియరెన్స్ కి అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ఈ సినిమాతో ఆయన ఖాతాలో బ్లాక్ బాస్టర్ గ్యారంటీ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇటు ప్రమోషన్ ఇంటర్వ్యూలలో పాల్గొన్న అఖిల్ తాజాగా గ్యాప్ గురించి మాట్లాడారు.
also read:నా జీవితాన్ని మార్చిన దేవుడు – ఐశ్వర్య రాజేష్!
లెనిన్ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో భాగంగా అఖిల్ మాట్లాడుతూ..” ఏజెంట్ సినిమా తర్వాత నేను వరుసగా సినిమాలు చేయాల్సింది. అయితే ఆ సినిమా విడుదలైన మూడు నెలలకు ప్రమాదవశాత్తు నేను బాత్రూంలో జారి పడ్డాను. నా చేతికి గాజు ముక్కలు చాలా బలంగా గుచ్చుకున్నాయి. దీంతో ఎడమ చేతి వేళ్ళకు రెండు శస్త్ర చికిత్సలు జరిగాయి. మొత్తం 48 కుట్లు పడ్డాయి. ఇక 16 నెలల పాటు నేను విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. అందుకే ఈ మూడేళ్ల గ్యాప్ వచ్చింది ” అంటూ వివరణ ఇచ్చారు అఖిల్.
ఇక అంతేకాదు ఈ సందర్భంగా అభిమానులకు హామీ కూడా ఇచ్చారు.” నేను మూడేళ్లు గ్యాప్ తీసుకోవడంతో నా అభిమానులు నాపై కోపంగా ఉన్నారు. ఇకపై అలా జరగదు” అంటూ హామీ ఇచ్చారు. ఇక లెనిన్ విషయానికి వస్తే మురళీ కిషోర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది. జూలై 10వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటు ట్రైలర్ తోనే అంచనాలు పెంచేసిన అఖిల్.. ఈ సినిమాతో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి. ఈ సినిమా ట్రైలర్ చూసిన మహేష్ బాబు, రామ్ చరణ్ లాంటి అగ్రతారలు ప్రశంసలు కురిపించడం సినిమాకు మరింత బూస్ట్ ఇచ్చింది.