Mega157: పటాస్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు అనిల్ రావిపూడి. ఈ సినిమా కథను చాలామందికి చెప్పాడు. అయితే పెద్దగా ఎవరు ఆసక్తి చూపించలేదు. కానీ కళ్యాణ్ రామ్ చెప్పినప్పుడు మాత్రం ఈ కథను తాను హీరోగా చేయకపోయినా కూడా నిర్మిస్తాను అని మాట ఇచ్చాడు. అంత బలంగా దర్శకుడిని నమ్మాడు కళ్యాణ్ రామ్. అలా కొత్త దర్శకుల్ని కళ్యాణ్ రామ్ నమ్మిన దాఖలాలు చాలా ఉన్నాయి.
పటాస్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఆ తర్వాత చేసిన సుప్రీం సినిమా కూడా మంచి సక్సెస్ సాధించింది. అసలు ఇప్పటివరకు అనిల్ చేసిన ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ సాధించింది. డిజాస్టర్ తెలియని దర్శకులను రాజమౌళి పేరు మొదటి వరుసలో ఉంటే సెకండ్ పేరు అనిల్ అని వినిపిస్తుంది.
మెగాస్టార్ తో సినిమాకి టైటిల్ ఫిక్స్
మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని చాలామంది కలలు కంటారు. ఆ కలలో అందరికీ నిజం కావు. ఒకవేళ ఆ కల నిజమై సినిమా ప్లాప్ అయితే అదొక పీడకలగా మారిపోతుంది. దర్శకుడు కొరటాల శివకు అదే జరిగింది. వరస నాలుగు బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత ఆశ్చర్య సినిమా ఇచ్చిన అనుభవం మామూలుది కాదు. ఇక ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సినిమాకు “మన శంకర వరప్రసాద్” గారు అనే టైటిల్ పెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. కానీ ఇక్కడే అసలైన సెంటిమెంట్ వెంటాడుతుంది. అదేంటి అంటే శంకర్ అనే పేరు ఈ మధ్య కాలంలో అసలు మెగా ఫ్యామిలీకి వర్కౌట్ కావడం లేదు. కనుక సినిమా టైటిల్ అదే అయితే గనుక మార్చే ఆలోచనలో పడాలి చిత్ర యూనిట్. అలానే ఇది టైటిల్ అని చెప్పగానే చాలామంది నెటిజెన్స్ కూడా అది వద్దు అని కామెంట్ చేస్తున్నారు.
మెగా ఫ్యామిలీ శంకర్ సెంటిమెంట్
మెగా ఫ్యామిలీకి ‘శంకర్’ రిఫరెన్సులు కలిసి రావడం లేదు అని రీసెంట్ టైమ్స్ లో మనకు అర్థమవుతూనే ఉంది. చిరంజీవి అసలు పేరు శివ శంకర్ వరప్రసాద్ అయినప్పటికీ అతనికి ‘భోళా శంకర్’ పెద్ద డిజాస్టర్ ఇచ్చింది. ఇక శంకర్ దర్శకత్వంలో చరణ్ చేసిన ‘గేమ్ ఛేంజర్’ భారీ నష్టాలు మిగిల్చింది. వైష్ణవ్ తేజ్ ‘ఆది కేశవ’ కూడా డిజాస్టర్స్ లో ఒకటిగా మిగిలిపోయింది. ‘బ్రో’ సినిమాలో కూడా సాయి ధరమ్ తేజ్ పేరులో మార్కండేయ అని ఉంటుంది. అది కూడా ఆడలేదు. అందుకే మెగా హీరోలకి శంకర్ రిఫరెన్సులు కలిసిరావడం లేదు అని స్పష్టమవుతుంది. ఈ తరుణంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న సినిమాకి “మన శంకర వరప్రసాద్” అనే టైటిల్ మెగా అభిమానుల్లో దడలు పుట్టిస్తుంది.
Also Read : Phanindra Narsetti: దయచేసి మమ్మల్ని వదిలేయ్, దర్శకుడిపై మండిపడుతున్న నెటిజన్స్