Nayanatara – Sekar kammula: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల పేరు తెలియని వాళ్లు ఉండరు. కుటుంబ కథా చిత్రాలతో ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంటాడు. ఈయన పేరు వినగానే అందరికి టక్కున గుర్తుకు వచ్చే మూవీ ఆనంద్. ఓ మంచి కాఫీ తాగిన తరువాత కలిగే తీపి అనుభూతిలా ఉండే ఈ సినిమాతోనే అభిమానుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నాడు. అతి నిశబ్దంగా గుండెను తాకే భావోద్వేగాలు, నిజాయితీతో నిండి ఉండే పాత్రలు, చక్కటి సంభాషణలు కనిపిస్తాయి. గోదావరి, హ్యాపీ డేస్, లీడర్, ఫిదా, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వంటి చిత్రాలు ఆయన ప్రత్యేకతను మరింతగా చాటాయి.. రీసెంట్ గా ధనుష్, నాగార్జున తో కుబేర మూవీతో మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదిలా ఉండగా ఈయనకు, హీరోయిన్ నయనతార మధ్య పెద్ద గొడవ జరిగిందని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అందులో నిజమేంత ఉందో ఒక్కసారి తెలుసుకుందాం..
అనామిక మూవీ వల్లే ఇద్దరి మధ్య గొడవ..?
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నటించిన సినిమాల్లో ఒకటి అనామిక. ఈ మూవీని డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించారు. ఇది బాలీవుడ్‌లో విద్యాబాలన్ నటించిన కహానీ సినిమా రీమేక్. ఈ చిత్రంలో నయనతార ప్రధాన పాత్రలో నటించగా, సినిమా ప్రేక్షకుల మన్ననలు పొందడంలో విఫలమైంది.. అందుకు కారణం నయనతార అని అప్పటిలో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. నయనతార ప్రమోషన్లలో పాల్గొనకపోవడమేనని అప్పట్లో చర్చ జరిగింది. దర్శకుడిగా శేఖర్ ఖమ్ముల, సినిమా విజయాన్ని సాధించడంలో భాగంగా నటీనటులు ప్రమోషన్లలో భాగస్వామ్యం కావాలని నమ్ముతారు. అయితే నయన్ చేసిన చిత్రాల ప్రమోషన్స్ కు ఆమె హాజరు కాదు. ఈ నేపధ్యంలో ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి. షూటింగ్ సమయంలో కూడా నయనతార తీరుపై శేఖర్ అసంతృప్తిగా ఉన్నారని అప్పట్లో గుసగుసలు వినిపించాయి..
Also Read: ‘కన్నప్ప’ మూవీకి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. టికెట్ ధర ఎంతంటే..?
నయన్ కు నో ఛాన్స్..?
ఈ మూవీ ప్రమోషన్స్ విషయంలో ఆమె దూరం అవ్వడంతో ఆ తర్వాత డైరెక్టర్ చాలా హర్ట్ అయ్యాడట. ఆమె తీరుతోవిసిగిపోయిన శేఖర్ కమ్ముల, సినిమా విడుదల తరువాత నయనతారతో ఇకపై పని చేయను అని స్వయంగా ప్రకటించారు.. రీమేక్ చిత్రాలకు అప్పటి నుంచి దూరంగా ఉంటున్నాడు.ఆయన ఇప్పుడు యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ మధ్య ఒక బ్రాండ్‌గా మారారు. నయనతారతో జరిగిన సంఘటన కూడా ఆయన దృఢ నిర్ణయాలను ప్రతిబింబిస్తుంది.. ప్రస్తుతం కేవలం కథకు ప్రాధాన్యత ఇస్తూ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నాడు. నెక్స్ట్ ఏ హీరోతో సినిమా చేస్తాడో చూడాలి…
నయనతార సినిమాల విషయానికొస్తే.. కోలీవుడ్ లో పలు సినిమాలు చేస్తుంది. తెలుగు మెగాస్టార్ చిరంజీవి సరసన మెగా 157 మూవీలో నటిస్తుంది.. వచ్చే ఏడాది సంక్రాంతికి మూవీ థియేటర్లలోకి రాబోతుంది. ఈ మూవీ రెమ్యూనరేషన్ విషయంలో టీమ్ తో గొడవలు అని వార్తలు వినిపిస్తున్నాయి.. దీనిపై ఆమె ఇంకా రెస్పాండ్ అవ్వలేదు.