OTT Movie : హాలీవుడ్ సినిమాలకు ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. వీటిలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఎక్కువగా వస్తుంటాయి. వీటిలో యూత్ కి మంచి స్టఫ్ ఇచ్చే సినిమాలు కూడా వస్తుంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే. ఇందులో ప్రియుడితో కలసి భర్తను చంపే ప్లాన్ చేస్తుంది భార్య. ఈ సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ అమెరికన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘Obsession’. 2019 లో రిలీజ్ అయిన ఈ సినిమాకి గోరాన్ డుకిచ్ దర్శకత్వం వహించారు. ఇందులో మెఖీ ఫైఫర్ (సన్నీ జోర్డాన్), బ్రాడ్ డౌరిఫ్ (జార్జ్ గుడ్), ఎలికా పోర్ట్‌నాయ్ (లారిస్సా గుడ్), కెర్రీ కాహిల్ (డిటెక్టివ్ ఎలియాస్), రూబెన్ సాంటియాగో-హడ్సన్ (డిటెక్టివ్ క్రాఫోర్డ్) ప్రధాన పాత్రలలో నటించారు. ఇది లూసియానా బయౌలో సెట్ చేయబడిన ఒక క్రైమ్ థ్రిల్లర్. ప్రేమ, ద్రోహం, హత్య చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. ఈ చిత్రం The Postman Always Rings Twice వంటి క్లాసిక్ నోయిర్ థ్రిల్లర్‌లతో పోలికలను కలిగి ఉంటుంది. 1 గంట 30 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాకి IMDb: 5.3/10 రేటింగ్ ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళితే
ఈ స్టోరీ లూసియానా బయౌలోని ఒక మారుమూల గ్రామీణ ప్రాంతంలో జరుగుతుంది. సన్నీ జోర్డాన్ అనే వ్యక్తి పని కోసం వెతుకుతుంటాడు. ఒక రోజు, అతను జార్జ్ గుడ్ అనే ఒక వృద్ధ రైతును, వీధిలో దాడి చేస్తున్న ఒక దొంగ నుండి రక్షిస్తాడు. కృతజ్ఞతగా, జార్జ్ సన్నీకి తన వ్యవసాయ క్షేత్రంలో మెకానిక్‌గా ఉద్యోగం, ఉండడానికి ఒక స్థలం ఇస్తాడు. సన్నీ తొందరగానే అక్కడ స్థిరపడతాడు. జార్జ్ ఫామ్‌లో ఒక మంచి పనోడిగా పేరు తెచ్చుకుంటాడు. అయితే సన్నీకి అక్కడే ఉండే జార్జ్ భార్య లారిస్సా పరిచయం అవుతుంది. ఆమె వయసులో ఉండటంతో, లారిస్సా, సన్నీ మధ్య అట్రాక్షన్ ఏర్పడుతుంది. వీళ్ళు సీక్రెట్ గా వ్యవహారాన్ని నడుపుతారు.
లారిస్సా తన ముసలి భర్తతో సంతృప్తి చెందని జీవితం గడుపుతోంది. సన్నీ ఆమెకు ఇక్కడి బంధం నుంచి తప్పించుకునే ఒక మార్గంగా కనిపిస్తాడు. జార్జ్ తన వ్యవసాయ పొలంలో ఒక మోటార్ పార్క్ నిర్మించాలనే కలను సన్నీతో పంచుకుంటాడు. అతన్ని ఆ జార్జ్ బాగా నమ్ముతుంటాడు. కానీ సన్నీ, లారిస్సా అక్రమ సంబంధాన్ని పెట్టుకుంటారు. ఈ సమయంలో లారిస్సా సన్నీని జార్జ్‌ను చంపడానికి ఒక పథకంలో భాగం చేస్తుంది. వీళ్ళు ఒక ట్రాక్టర్ ప్రమాదంగా కనిపించేలా జార్జ్‌ను చంపడానికి ప్లాన్ చేస్తారు. సన్నీ మొదట్లో ఈ ప్లాన్ పై ఆలోచనలో ఉన్నప్పటికీ, లారిస్సా మాయాజాలంలో చిక్కుకుని జార్జ్ ని చంపడానికి ఒప్పుకుంటాడు.
ఇక సన్నీ, లారిస్సా అనుకున్నట్టుగా ప్లాన్ అమలు చేస్తారు. జార్జ్‌ను ట్రాక్టర్ కింద పడి చనిపోయినట్లుగా హత్య చేస్తారు. దీనిని ప్రమాదంగా చిత్రీకరించడానికి జాగ్రత్తలు తీసుకుంటారు. లారిస్సా తన అలీబీని సృష్టించడానికి గ్రామీణ దుకాణానికి వెళ్తుంది. సన్నీ తన చేతికి గాయం చేసుకుంటాడు. దీని వల్ల అతను కూడా అనుమానం నుండి తప్పించుకుంటాడు. అయితే జార్జ్ దీర్ఘకాల స్నేహితుడైన డిటెక్టివ్ క్రాఫోర్డ్ ఈ మరణంపై సందేహం వ్యక్తం చేస్తాడు. వీళ్ళు ట్రాక్టర్ రెండుసార్లు పడినట్లు గుర్తిస్తారు. ఇది ప్రమాదం కాదని తెలుసుకుంటారు. ఇప్పుడు సన్నీ, లారిస్సా ఈ హత్యను దాచడానికి మరింత అబద్ధాలు చెప్పడం ప్రారంభిస్తారు. కానీ వీళ్ళ పథకం క్రమంగా కుప్పకూలడం మొదలవుతుంది. ఊహకందని క్లైమాక్స్ ట్విస్ట్ తో ఈ స్టోరీ ఎండ్ అవుతుంది. చివరికి ఈ హత్య వెనుక ఉన్న నిజాన్ని డిటెక్టివ్ బయట పెడతాడా ? సన్నీ, లారిస్సా ల సంబంధం అలాగే నడుస్తుందా ? ఈ స్టోరీ క్లైమాక్స్ ట్విస్ట్ ఏమిటి ? అనే విషయాలను, ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : ఫ్లైట్ ను గాల్లో ఉండగానే ఓ ఆటాడించే దెయ్యం… ఓటీటీని గడగడలాడిస్తున్న హర్రర్ మూవీ