OTT Movie : ఓటీటీ ఎంటర్టైన్మెంట్ కి ఒక వేదికగా మారింది. ఏ కంటెంట్ కావాలన్నా వీటిలో అందుబాటులో ఉంది. అందుకే ఇప్పుడు థియేటర్లకు వెల్లకుండానే ఓటీటీలోనే ఎక్కువగా సినిమాలు చూస్తున్నారు. హారర్ సినిమాలనయితే మరీ ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే హారర్ సినిమా ఆరుగురు అమ్మాయిల చుట్టూ తిరుగుతుంది. వీళ్ళంతా అమావాస్య రోజు పుట్టడంతో, అసలు స్టోరీ మొదలవుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ అమెరికన్ సూపర్‌నాచురల్ హారర్ మూవీ పేరు ‘ది డెవిల్స్ హ్యాండ్’ (The Devil’s Hand). 2014 లో వచ్చిన ఈ సినిమాకి ఇ. క్రిస్టియన్సెన్ దర్శకత్వం వహించారు. ఇందులో రూఫస్ సెవెల్ (జాకబ్ బ్రౌన్), అలిసియా డెబ్‌నామ్-కేరీ (మేరీ), జెన్నిఫర్ కార్పెంటర్ (రెబెకా), కోల్మ్ మీనీ (ఎల్డర్ బీకన్), అడిలైడ్ కేన్ (రూత్), లియా పైప్స్ (సారా), రిక్ రీట్జ్ (ఎల్డర్ స్టోన్) ప్రధాన పాత్రలలో నటించారు. మారియో మిస్సియోన్ సినిమాటోగ్రఫీ, టిమోతీ మన్ సంగీతం, అందించారు. ఈ సినిమా 2014 అక్టోబర్ 10న థియేటర్లలో విడుదలై, తర్వాత Amazon Prime Video, Tubi TV వంటి OTT ప్లాట్‌ఫారమ్‌లలో స్ట్రీమింగ్ కు వచ్చింది. 1 గంట 26 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDb లో 5/10 రేటింగ్ ఉంది.
స్టోరీలోకి వెళితే
ఈ స్టోరీ న్యూ హార్మొనీ అనే ఒక అమిష్ సమాజంలో జరుగుతుంది. ఇక్కడ మతపరమైన నియమాలు, మూఢనమ్మకాలు మనుషుల్ని నడిపిస్తాయి. ఒక అమావాస్య రోజు రాత్రి ఆరుగురు ఆడపిల్లలు ఒకే సారి జన్మించడంతో, ఇది ఒక పురాతన శాపానికి సంబంధించినదని అక్కడ ఉన్న వాళ్ళు భయపడతారు. ఈ శాపం ప్రకారం, ఆరుగురు అమ్మాయిలలో ఒకరు 18వ జన్మదినం రోజున సాతాను ‘devil’s hand’ గా మారి, సమాజాన్ని నాశనం చేస్తుందని నమ్ముతారు. ఈ భయంతో అక్కడి నాయకుడు ఎల్డర్ బీకన్ ఆ ఆరుగురు శిశువులను చంపాలని అనుకుంటాడు.
18 సంవత్సరాల తర్వాత, మేరీ, రూత్ , సారా మిగిలిన అమ్మాయిలు న్యూ హార్మొనీలో సాధారణ జీవితం గడుపుతుంటారు. అయితే వీళ్ళకు 18వ పుట్టిన రోజు దగ్గరపడుతుంది. మేరీ ఒక దేరిస్ట్ అమ్మాయి. తన తండ్రి జాకబ్ బ్రౌన్, తల్లి సుసాన్‌తో కలిసి ఉంటుంది. సమాజంలో ఉన్న మతపరమైన నియమాలు, ఈ శాపం గురించి మేరీకి పూర్తి అవగాహన లేదు. కానీ ఆమెకు భయంకరమైన కలలు వచ్చి భయపెడుతుంటాయి. ఈ సమయంలో ఆరుగురు అమ్మాయిలలో ఒక్కొక్కరూ వరుసగా మరణిస్తుంటారు. ఇది అక్కడి సమాజంలో శాపం గురించి భయాన్ని మరింత పెంచుతుంది. ఎల్డర్ బీకన్ ఈ మరణాల వెనుక సాతాను శక్తులు ఉన్నాయని నమ్ముతాడు.
మేరీ, రూత్‌ల 18వ జన్మదినం రాగానే, ఈ మరణాలు జరుగుతాయి. ఇప్పుడు మేరీ తన గతం, శాపం గురించి నిజాలను తెలుసుకుంటుంది. జాకబ్ తన కుమార్తెను రక్షించడానికి, సమాజంలోని మత నాయకులతో పోరాడుతాడు. అయితే సుసాన్ మేరీ గతానికి సంబంధించిన ఒక రహస్యాన్ని బయటపెడుతుంది. ఇది కథకు కొత్త మలుపును ఇస్తుంది. భయంకరమైన సన్నివేశాలు, దెయ్యం సంబంధిత ఎలిమెంట్స్, ఊహించని ట్విస్ట్‌తో ఇక్కడ స్టోరీ సూపర్‌నాచురల్ హారర్‌గా మారుతుంది. చివరికి ఈ శాపం వెనుక దాగిన అసలు రహస్యం ఏమిటి ? ఈ అమ్మాయిలందరూ చనిపోతారా ? దీనికి విరుగుడు ఏమిటి ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సూపర్‌నాచురల్ హారర్ సినిమాను మిస్ కకుండా చూడండి.
Read Also : నచ్చిన ఫుడ్ పెట్టలేదని తల్లిదండ్రులకే నరకం చూపించే కుర్రాడు… స్పైన్ చిల్లింగ్ హర్రర్ స్టోరీ