E-Paper
Advertisement

Vishwambhara Film: ‘విశ్వంభర’ సినిమాకు షాకింగ్ బడ్జెట్.. సాహసం చేసిన నిర్మాతలు!

Vishwambhara Film: ‘విశ్వంభర’ సినిమాకు షాకింగ్ బడ్జెట్.. సాహసం చేసిన నిర్మాతలు!
Advertisement

Vishwambhara Film: మెగాస్టార్ చిరంజీవి ఇటీవల మన శంకర వరప్రసాద్ గారు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారు .అయితే ఈ సినిమా కంటే ముందుగా చిరంజీవి బింబిసారా దర్శకుడు వశిష్ట (vassistha)దర్శకత్వంలో విశ్వంభర (Vishwambhara) అనే సినిమాలో నటించారు అయితే ఈ సినిమా ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు. నిజానికి ఈ సినిమా గత ఏడాదే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా విఎఫ్ ఎక్స్ పనులు కారణంగా ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమా విడుదల గురించి ఇప్పటివరకు చిత్ర నిర్మాతలు ఎక్కడ సరైన స్పష్టత మాత్రం వెల్లడించలేదు.

తలదించుకొని పనిచేస్తున్నా..

ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్న చోట కె నాయుడు జగపతిబాబు లయ ప్రధాన పాత్రలో నటించిన వదలా సినిమా వేడుకలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా చోటా కె నాయుడుకు విశ్వంభర సినిమా గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే ఈయన ఇదివరకే చిరంజీవి హీరోగా నటించిన అంజి సినిమాకు కూడా సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చోటా కె నాయుడు మాట్లాడుతూ అంజి సినిమా కోసం తలెత్తుకొని పనిచేస్తాం కానీ విశ్వంభర సినిమా కోసం తలదించుకొని పనిచేస్తున్నామని తెలిపారు.

విశ్వంభర రూ.400 కోట్ల బడ్జెట్..

Advertisement

విశ్వంభర సినిమాకు సీజీ వర్క్ చాలా అద్భుతంగా ఉండబోతుందని, అక్కడికి వెళ్లి మన ఇగో చూపిస్తే వర్క్ అవుట్ కాదు అందుకే ఈ సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు పెట్టుకొని పనిచేస్తున్నామని ఈ సినిమా వెనుక 400 కోట్ల బడ్జెట్ ఉందని చోటా కె నాయుడు తెలిపారు. ఇలా ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ కేటాయించడం వల్ల సరైన అవుట్ ఫుట్ కోసమే ఆలస్యం అవుతుందని ప్రస్తుతం సీజీ వర్క్ జరుగుతోందని చోటా కె నాయుడు తెలియచేశారు. ఇలా చిరంజీవి సినిమాకు 400 కోట్ల బడ్జెట్ కేటాయించారనే విషయం తెలిసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.

సినిమా విడుదలకు అదే ఆలస్యమా..

Advertisement

చిరంజీవి కెరియర్ లోనే ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ సినిమా గా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ సినిమా విషయంలో యు .వి.క్రియేషన్స్ వారు పెద్ద సాహసమే చేస్తున్నారని చెప్పాలి. ఇటీవల ఈ బ్యానర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలు పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయినా చిరంజీవి గారిపై నమ్మకంతో ఏకంగా 400 కోట్ల బడ్జెట్ కేటాయించారని తెలిసి షాక్ అవుతున్నారు. ఇక ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా త్రిష హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా జూన్ 10వ తేదీ విడుదల కాబోతోంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పటివరకు ఈ సినిమా విడుదల గురించి చిత్ర బృందం ఎలాంటి అప్డేట్ వెల్లడించలేదు.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×