Vishwambhara Movie:విశ్వంభర (Vishwambhara) .. ప్రముఖ డైరెక్టర్ వశిష్ట మల్లిడి (Vassishta Mallidi) దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఎంతో పగడ్బందీగా.. పక్కా ప్లాన్ ప్రకారం చేస్తున్న సినిమా ఇది. ఇందులో హీరోయిన్ గా త్రిష (Trisha Krishnan) నటిస్తోంది. వాస్తవానికి ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 10వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ముందుగానే ప్రకటించారు. కానీ చిరంజీవికి చికెన్ గున్యా రావడంతో ఆయన సకాలంలో షూటింగ్ పూర్తి చేయలేకపోయారు. దీంతో సినిమా విడుదల ఆగిపోయింది. ఇక తర్వాత ఈ ఏడాది సమ్మర్ సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించినప్పటికీ అది కూడా జరగలేదు. అయితే ఇప్పుడు మళ్లీ మెగా ఫ్యాన్స్ కి చిరాకు తెప్పించే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అదేంటంటే విశ్వంభర సినిమాను మళ్ళీ వాయిదా వేసినట్లు సమాచారం.
మళ్లీ వాయిదా పడ్డ విశ్వంభర..
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. త్వరలో మెగాస్టార్ చిరంజీవి అవుట్ పుట్ ను వీక్షించి సమీక్షించబోతున్నారు అని, అటు VFX వర్క్ కూడా ఆకట్టుకుంటుందని సమాచారం. మొత్తం అన్ని పనులు పూర్తయితే.. ఈ ఏడాది సెప్టెంబర్ లో విడుదల చేయాలని టీం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ సకాలంలో సిద్ధంగా లేకపోతే మాత్రం వచ్చే ఏడాది వేసవికి వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ విషయం తెలిసి మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకెన్నిసార్లు వాయిదా వేస్తారు అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
సెప్టెంబర్ లో లేనట్టే?
వాస్తవానికి ఈ సినిమాను ‘ఇంద్ర ‘ సినిమా రిలీజ్ అయిన సందర్భంగా జూలై 24న విడుదల చేయాలనుకున్నారు. అది జరగలేదు. కారణం గ్రాఫిక్ వర్క్ ఇంకా పూర్తి కాలేదు. అటు క్వాలిటీ విషయంలో రాజీపడడం ఇష్టం లేక విడుదల తేదీని ప్రకటించకుండా సైలెంట్ గా ఉండిపోయింది చిత్ర బృందం. దీనికి తోడు జూలై – ఆగస్టు నెలలు కాకుండా సెప్టెంబర్ లేదా అక్టోబర్లో విడుదల చేస్తే.. చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి (Anil Ravipudi)తో చేస్తున్న ‘Mega 157’ సినిమాకి అలాగే విశ్వంభర మూవీకి మధ్య విడుదల తేదీల్లో గ్యాప్ బాగా తగ్గిపోతుంది. దీనికి తోడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఓజీ (OG), బాలకృష్ణ(Balakrishna ) అఖండ 2 (Akhanda 2) సినిమాలు కూడా ఇదే సెప్టెంబర్ నెలలో స్లాట్ ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. కాబట్టి ఈ సినిమా సెప్టెంబర్ లో లేనట్లే అని స్పష్టం అవుతుంది.
వచ్చే ఏడాదైనా విడుదలవుతుందా?
ఒకవేళ నేరుగా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేద్దామనుకుంటే.. అప్పటికే అనిల్ రావిపూడి సినిమా జనవరి 10వ తేదీన స్లాట్ బుక్ చేసుకోవడం జరిగింది. ఇక అందుకే ఇప్పుడు చేసేదేమీ లేక ఈ సినిమాను వచ్చే ఏడాది అందులోను సమ్మర్ స్పెషల్ గా విడుదల చేసే అవకాశాలున్నట్లు సమాచారం. ఏది ఏమైనా గ్రాఫిక్స్ కష్టాలను ఎదుర్కొని ఇన్ని రోజులు వాయిదా పడ్డ ఈ సినిమా వచ్చే యేడాది సమ్మర్ కైనా సకాలంలో విడుదలవుతుందో లేదో చూడాలి.
ALSO READ:Sri Sathya: ఫీలింగ్స్ లేవు.. పెళ్లి టాపిక్‌పై శ్రీ సత్య సంచలన ప్రకటన!