Sri Satya: ప్రస్తుత కాలంలో చాలామంది తమ టాలెంట్ ను నిరూపించుకోవడానికి అలాగే తమ ఉనికిని చాటుకోవడానికి సోషల్ మీడియాను వేదికగా వాడుకుంటున్నారు. అటు దర్శక నిర్మాతలు కూడా సినిమాలలోకి హీరోయిన్గా తీసుకోవాలి అంటే కూడా.. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు అని అడుగుతున్నట్లు ఇటీవలే చాలామంది చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. అందుకే చాలామంది డైరెక్టుగా సినిమాలలో అవకాశాల కోసం ప్రయత్నించకుండా సోషల్ మీడియా ద్వారా ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో పడ్డారు. అలా సోషల్ మీడియాను నమ్ముకుని ఇండస్ట్రీలో రాణించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇందులో కొంతమంది సోషల్ మీడియా ద్వారా వర్క్ అవుట్ అవ్వదని.. ఇండస్ట్రీలో తెలిసిన వారిని పట్టుకుని ఒక్కో మెట్టు ఎక్కుతుంటే.మీ మరికొంతమంది నేరుగా ఇండస్ట్రీకి వచ్చి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పుడు అలాంటి వారి జాబితాలోకి బిగ్ బాస్ బ్యూటీ శ్రీ సత్య (Sri Satya) కూడా చేరిపోయారు.
ఫీలింగ్స్ చచ్చిపోయాయి – శ్రీ సత్య
సినిమా ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ ముందుకు సాగుతున్న శ్రీ సత్య.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ద్వారా భారీ పాపులారిటీ అందుకుంది. బిగ్ బాస్ కంటెస్టెంట్గా వచ్చిన ఈమె అక్కడ తన అందంతో ఆడియన్స్ ను ఆకట్టుకొని స్టార్ గా మారిపోయింది. అప్పట్నుంచి ఈమెకు మంచి గుర్తింపు లభిస్తోందని చెప్పాలి.ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇది చూసి నెటిజెన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. శ్రీ సత్య పెళ్లి పై మాత్రం ఎవరు ఊహించని కామెంట్లు చేస్తూ..” నేను జీవితంలో పెళ్లి చేసుకోను. ఆ ఆశ కూడా లేదు. అసలు ఫీలింగ్స్ అన్ని చచ్చిపోయాయి ” అంటూ పెళ్లిపై తన అభిప్రాయాన్ని పంచుకుంది శ్రీ సత్య.
నెటిజన్స్ ట్రోల్స్..
ఇక ఈ కామెంట్లు వైరల్ అవ్వడంతో నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. లవ్ ఫెయిల్యూర్ అయినట్లుంది అందుకే ఇలా మాట్లాడుతోంది అని కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మొత్తానికైతే పెళ్లి చేసుకోను అంటూ చెప్పిన శ్రీ సత్య భవిష్యత్తులో తన మనసు మార్చుకుంటుందేమో చూడాలి.
శ్రీ సత్య కెరియర్..
శ్రీ సత్య సినిమాలలోనే కాదు సీరియల్స్ లో కూడా నటించింది. నిన్నే పెళ్ళాడతా, అత్తారింట్లో అక్క చెల్లెళ్ళు , త్రినయిని వంటి సీరియల్స్ లో నటించి బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. అంతేకాదు కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ.అలాగే సిద్దు జొన్నలగడ్డ నటించిన ‘టిల్లు స్క్వేర్’ సినిమాలో కూడా ఒక చిన్న పాత్రలో కొద్దిసేపు తెరపై కనిపించింది.
సోషల్ మీడియా ట్రోల్స్ పై స్పందించిన శ్రీ సత్య..
ఇకపోతే అదే ఇంటర్వ్యూలో సోషల్ మీడియా ట్రోల్స్ పై కూడా స్పందించింది. గతంలో ఎక్కడ అవకాశాల కోసం వెళ్ళినా ముఖం చిన్నదిగా కనిపిస్తోందని అనేవారు. ఈ సమస్యను సరిదిద్దుకోవడానికి లిప్ ఫిల్లర్స్ చేయిస్తే బాగుంటుందని తెలిసింది. అందుకే టెంపరరీగా మూడు నెలల కోసం ఇలా లిప్ ఫిల్లర్స్ చేయించాను. కానీ కొంతమంది అప్పటి లుక్ బాగుందన్నా.. మరికొంతమంది మెచ్యూరిటీగా కనిపిస్తున్నావు అన్నారు. ఇక డాన్స్ షోస్ చేసే సమయంలో ఎవరితో డాన్స్ చేసినా వారితో సంబంధం కలిపేవారు.. అలాంటి నీచమైన కామెంట్లతో ఇబ్బంది పడ్డాను అంటూ తెలిపింది సత్య.
also read:Khushi Mukharjee: అర్ధ నగ్నంగా వీధుల్లోకి.. ట్రోల్స్ పై హీరోయిన్ రియాక్షన్..అయినా?