BigTV English

Ram Charan – Rashmika : చరణ్‌తో రష్మిక.. కల నెరవేరింది

Ram Charan – Rashmika : చరణ్‌తో రష్మిక.. కల నెరవేరింది
Advertisement

Ram Charan – Rashmika Movie : ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ సెట్ అవ్వాలని అభిమానులు కోరుకుంటారు. హీరో – డైరెక్టర్ కాంబో అయినా.. హీరో – హీరోయిన్ కాంబో అయినా.. ఇలా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటారు. కానీ, అవి నెరవేరడం చాలా అరుదుగా కనిపిస్తుంది. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఓ కాంబోను కోరుకుంటున్నారు. అదే రామ్ చరణ్ – రష్మిక మందన్నా. ఈ కాంబోలో ఓ సినిమా వస్తే, వాళ్లు ఆడిపాడితే చూడాలని అనుకుంటున్నారు. అయితే ఈ కల నెరవేరబోతుంది. రామ్ చరణ్ – రష్మిక మందన్నా ఒకే సినిమాలో చేసే ఛాన్స్ రాబోతుంది. అది ఏంటో ఇప్పుడు చూద్దాం.


ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ ఎవరు అంటే… టక్కున వచ్చే ఆన్సర్ రష్మిక మందన్నా. చిన్న సినిమాలతో స్టార్ట్ అయిన రష్మిక మందన్నా ఇప్పుడు… పాన్ ఇండియా రేంజ్ హీరోయిన్ అయిపోయింది. బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతుంది.

ఈ మధ్య ఆమె హీరోయిన్ గా చేసిన యానిమల్ మూవీ 950 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. పుష్ప 2 మూవీ అయితే 1800 కోట్ల వరకు రాబట్టింది. చావా మూవీ కూడా 900 కోట్లకు పైగా వసూల్ చేసింది. ఇక సికిందర్ 200 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక ఇటీవల రిలీజ్ అయిన కుబేర మూవీ కూడా 100 కోట్ల క్లబ్‌లో ఇటీవల చేరింది.


ఇలా సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గా రష్మిక కొనసాగుతుంది. ఇదే టైంలో ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలు అందరితో దాదాపు చేసింది. ఒక రామ్ చరణ్‌తో మాత్రమే రష్మిక జత కట్టలేదు. ఇప్పుడు ఈ హీరోతో చేయడానికి కూడా రెడీ అయిపోతుంది.

రామ్ చరణ్ కూడా ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయ్యాడు. ఆయన సినిమాలు కూడా ఇదే రేంజ్‌లో ఉన్నాయి. లాస్ట్ మూవీ గేమ్ ఛేంజర్ కూడా పెద్ద సినిమానే. కానీ, అది పెద్ద డిజాస్టర్ అయింది. దీని తర్వాత ఆయన చేస్తున్న సినిమాలన్నీ కూడా భారీ బడ్జెట్‌తోనే చేస్తున్నాడు.

ప్రస్తుతం ఆయన బుచ్చిబాబు డైరెక్షన్‌లో పెద్ది అనే మూవీ చేస్తున్నాడు. ఆ మూవీకి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ఇటీవలే రిలీజ్ అయింది. పెద్ది ఫస్ట్ షాట్ అనే పేరుతో ఈ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఈ పెద్ది ఫస్ట్ షాట్‌కు ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. బుచ్చిబాబు డైరెక్షన్ కాబట్టి ఎలాంటి డౌట్ లేకుండా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ గట్టిగానే నమ్ముతున్నారు.

చరణ్ – రష్మిక మూవీ ఇదే

దీని తర్వాత సుకుమార్‌తో రామ్ చరణ్ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన అఫిసియల్ అనౌన్స్‌మెంట్ కూడా వచ్చింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మిక పేరును ఫిక్స్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. సుకుమార్ – రష్మిక మధ్య మంచి సన్నిహిత్యం ఉంది. అలాగే ఈ కాంబినేషన్‌ను ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రష్మిక కూడా చరణ్‌తో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్‌తో ఉంది. అలా… సుక్కు – చరణ్ ప్రాజెక్ట్‌లో రష్మిక మందన్నా ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది.

Related News

Pawan Kalyan: పవన్ కోసం స్క్రిప్ట్ లాక్ చేసిన దిల్ రాజు .. ఫస్ట్ టైం ఆ పాత్రలో పవర్ స్టార్?

Samantha -Raj Nidumori: డైరెక్టర్ రాజ్ పోస్ట్ పై సమంత కామెంట్స్.. రిలేషన్ బయట పెట్టినట్టేనా?

Mass Jathara: మాస్ జాతర టైటిల్ ఆలోచన అతనిదేనా.. ఈ టాలెంట్ కూడా ఉందా బాసు?

Nani Sujeeth : నాని సరసన పూజ హెగ్డే, సెంటిమెంటును ఛాలెంజ్ చేస్తున్న సుజీత్ 

Raviteja-Sreeleela: శ్రీ లీల నటన పై రవితేజ కామెంట్స్.. ఇంకా బయట పెట్టలేదంటూ!

Prabhas: ప్రభాస్ బర్త్ డే సందర్భంగా రానున్న అప్డేట్స్ , సుకుమార్ కల నెరవేరినట్లే

Akhanda 2 : అఖండ 2 టీం కు జియో హాట్ స్టార్ కండిషన్స్, మరి ఇంతలో ఇన్వాల్వ్ అవుతారా?

Suriya 46 : అసిస్టెంట్ డైరెక్టర్ గా మారిన మాస్ మహారాజా కొడుకు, యాక్టింగ్ కు దూరమైనట్లేనా? 

Big Stories

×