BigTV English

Coolie Collections : కూలీ బ్లాక్ బస్టర్ హిట్ అయినట్టే.. అక్కడ ఛావా రికార్డు బ్రేక్..

Coolie Collections : కూలీ బ్లాక్ బస్టర్ హిట్ అయినట్టే.. అక్కడ ఛావా రికార్డు బ్రేక్..

Coolie Collections : తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ చిత్రం కూలీ.. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. ఈనెల 14న థియేటర్లలో కి వచ్చిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం బాక్సాఫీస్ ని దున్నేస్తుంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు.. అటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా వరుసగా రికార్డులను బ్రేక్ చేస్తుంది. రోజు రోజుకు వసూళ్లు పెరుగుతున్నాయి. తాజాగా అమెరికాలో మరో రికార్డ్ ని బ్రేక్ చేసిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అక్కడ ఎన్ని కోట్లు వసూలు చేసిందో ఒక్కసారి తెలుసుకుందాం..


‘కూలీ’ కలెక్షన్స్…

రజనీకాంత్‌కు తమిళనాడుతో సమానంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ ఫాలోయింగ్ ఉంది. ఈ మేరకు కూలీకి ఫస్ట్ డే భారీ ఓపెనింగ్స్‌ దక్కాయి. మొదటి వీక్ లో కొంచెం డల్ గా కలెక్షన్స్ వసూల్ అయ్యాయి.. సన్‌పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రచార కార్యక్రమాల తో కలిపి కూలీకి రూ.370 కోట్ల భారీ బడ్జెట్‌ అయినట్లుగా ట్రేడ్ వర్గాలు అంచనా వస్తున్నాయి… ఇప్పటివరకు తొమ్మిది రోజులకు భారీగానే వసూల్ చేసింది. తమిళంలో 3 కోట్ల రూపాయలు, తెలుగులో కోటి 50 లక్షల రూపాయలు, కర్ణాటక, కేరళ, హిందీలో 2 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో కోటి రూపాయలు పైగా వసూల్ చేసి 447 కోట్లు వసూల్ చేసిందని తెలుస్తుంది.. అధికార ప్రకటన మూవీ టీమ్ అనౌన్స్ చెయ్యాల్సి ఉంది.


Also Read : ‘ఓజీ’ నుంచి వినాయక చవితి సర్ ప్రైజ్ రెడీ.. ఫ్యాన్స్ కు పూనకాలు పక్కా..!

అమెరికాలో ఛావా రికార్డ్ బ్రేక్.. 

రజినీకాంత్ నటించిన భారీ యాక్షన్ సినిమా కూలీ.. ఇటీవలే థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా ఒకవైపు మిక్స్డ్ టాక్ ని అందుకున్న సరే.. మరోవైపు కాసుల వర్షం కురిపిస్తుంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు.. అటు అమెరికాలో కూడా ఈ సినిమా హవాని కొనసాగిస్తుంది. ఓవర్సీస్ రైట్స్‌ను డిస్ట్రిబ్యూట్ చేసే ప్రముఖ సంస్థ చేజిక్కించుకొన్నది. నార్త్ అమెరికా, యూకే, గల్ఫ్, శ్రీలంక, సింగపూర్, మలేషియా వంటి దేశాల ఈ సినిమా హక్కులు సుమారుగా 85 కోట్ల కు అమ్ముపోయింది..గత వారం రోజుల్లో సుమారుగా 7 మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టింది. భారతీయ కరెన్సీలో సుమారుగా 61 కోట్లు వసూల్ చేసింది. గతంలో అమెరికాలో బాలీవుడ్ చిత్రమైన ఛావా సాధించిన రికార్డ్ ను కూలీ బ్రేక్ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. గత ఏడాది రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది ఈ చిత్రం. బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్, రష్మిక మందన్న జోడిగా నటించారు. ఇదే జోరు నువ్వు కొనసాగిస్తే మాత్రం మరో వారం రెండు వారాల్లో 1000 కోట్లు సాధిస్తుందని అభిప్రాయపడుతున్నారు రజినీ అభిమానులు..

Related News

Kaithi 2: కార్తీకి హ్యాండ్ ఇచ్చిన లోకేష్ కనగరాజ్, ఖైదీ 2 వాయిదా.. మరో స్టార్ డైరెక్టర్‌కి ఒకే చెప్పిన కార్తీ!

Teja Sajja: ఆ ఇద్దరి స్టార్ హీరోలను టార్గెట్ చేసిన తేజ సజ్జా? దసరా బరిలో

Chiranjeevi : 2027 సంక్రాంతి బరిలో మళ్లీ చిరునే… కానీ, ఇప్పుడు ఆ పప్పులేం ఉడకవు

TVK Maanadu : విజయ్ పొలిటికల్ బోణి అదిరిపోయింది… ఏకంగా 86 లక్షల మంది

Cine Workers Strike: ఈ వేతనాలు మాకోద్దు.. సినీ కార్మికులు అసంతృప్తి.. సోమవారం ఏం జరగబోతుంది?

Big Stories

×