E-Paper
Advertisement

చాపెల్ వివాదం నుండి లార్డ్స్ గర్జన వరకు.. గంగూలీ బయోపిక్‌పై భారీ అంచనాలు!

చాపెల్ వివాదం నుండి లార్డ్స్ గర్జన వరకు.. గంగూలీ బయోపిక్‌పై భారీ అంచనాలు!
Advertisement

Ganguly Biopic: ‘సౌరవ్ గంగూలీ’.. ఇండియన్ క్రికెట్ కి పరుగులు నేర్పించిన టాలెంటెడ్ బ్యాట్స్ మెన్.ఒకరకంగా చెప్పాలంటే గంగూలీకి ముందు, గంగూలీకి తర్వాత అని ఇండియన్ క్రికెట్ ని డివైడ్ చేయొచ్చు అంటే క్రికెట్ పై ఇతగాడి ఇంపాక్ట్ ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతుంది.ముఖ్యంగా ఆస్ట్రేలియా క్రికెటర్స్ ని చూసి అందరూ వణికిపోతున్న వేళ వారి గడ్డపైనే వారిని ఓడింఛి అసలైన ఫియర్ లెస్ క్రికెట్ కి శ్రీకారం చుట్టాడు.ఇక యువరాజ్, సెహ్వాగ్, హర్భజన్ వంటి టాలెంటెడ్ క్రికెటర్స్ ని జట్టులోకి తీసుకొచ్చి ఎంకరేజ్ చేసింది కూడా గంగూలినే.

2002 నాట్‌వెస్ట్ ట్రోఫీ లార్డ్స్ బాల్కనీ ఇన్సిడెంట్

అలాంటి గంగూలీ బయోపిక్ ని తెరకెక్కించే పనిలో పడింది బాలీవుడ్.‘దాదా – ది సౌరవ్ గంగూలీ స్టోరీ’ గా వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ రాజ్‌కుమార్ రావ్ టైటిల్ రోల్ పోషిస్తుండటం విశేషం. ఇక తాజాగా ఈ సినిమాకి సంబందించిన పోస్టర్ ఒకటి మేకర్స్ వదలడంతో అది కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. క్రికెట్ అభిమానులకి 2002 నాట్‌వెస్ట్ ట్రోఫీ లార్డ్స్ బాల్కనీ ఇన్సిడెంట్ గుర్తు ఉండే ఉంటుంది. క్రికెట్ హిస్టరీలో ఈ పిక్ కి ఏకంగా ఒక చాప్టర్ ఉంది కూడా.అదిగో ఆ ఇన్సిడెంట్ పిక్ నే పోస్టర్ రూపంలో వదిలింది మూవీ టీమ్.అయితే గంగూలీ రోల్ చేస్తున్న రాజ్ కుమార్ ఆ పాత్రని పండించగలడా, ఇప్పటి వరకు వచ్చిన గొప్ప గొప్ప బయో పిక్ ల సరసన ఈ సినిమా నిలబడుతుందా అన్న ప్రశ్న ని కొంతమంది రైజ్ చేస్తున్నారు.

Advertisement

also read:ఆ డ్రామా నా వల్ల కాదు.. భాగ్యరాజ్ అంత్యక్రియలకు వెళ్లకపోవడంపై ఊర్వశి సంచలన వ్యాఖ్యలు!

‘ట్రాప్డ్’ సినిమాలో రాజ్ కుమార్ నటన టాప్ నాచ్

ఈ క్వశ్చన్ కి ఆన్సర్ దొరకాలంటే ఫస్ట్ రాజ్ కుమార్ రావ్ ట్రాక్ రికార్డ్ చూడాలి.గంగూలీని దించాలంటే కేవలం బ్యాట్ పట్టుకుని ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్‌లా మేకోవర్ చేస్తే సరిపోదు.దాదాకి ఒక సెపరేట్ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది.ముఖ్యంగా ఆయన పిచ్ పైకి వస్తున్నప్పుడు,సెంచరీ కొట్టినప్పుడు, వికెట్ తీసినప్పుడు, అన్నింటికన్నా మించి గ్రౌండ్ లో చూపించే దూకుడు ఇవన్నీ ఆన్ స్క్రీన్ మీద పండించడం చాలా ముఖ్యం. ఇక రాజ్ కుమార్ కూడా గతంలో చేసిన ‘షాహిద్’, ‘అలీఘర్’ వంటి సినిమాలలో రియల్ రోల్స్ చేసి ఏకంగా నేషనల్ అవార్డ్ దక్కించుకోవడం మనకు తెల్సిందే.ముఖ్యంగా విక్రమాదిత్య మోత్వానే తెరకెక్కించిన ‘ట్రాప్డ్’ సినిమాలో రాజ్ కుమార్ నటన టాప్ నాచ్. అలాంటి నటుడు గంగూలీగా మెప్పిస్తాడని చెప్పక్కర్లేదు. పైగా వదిలిన పోస్టర్ కూడా దాన్ని ప్రూవ్ చేస్తుంది.

సినిమా ఇండస్ట్రీలో బయో పిక్ లకి స్పెషల్ చాప్టర్

Advertisement

ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో బయో పిక్ లకి స్పెషల్ చాప్టర్ ఉంటుంది. ముఖ్యంగాMS ధోని బయో పిక్ గా వచ్చిన ‘MS Dhoni: The Untold Story’ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో చెప్పక్కర్లేదు. అందులో ధోనిగా చేసిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పెర్ఫామెన్స్ ని చూసి ఫిదా అయిపోయారు ,ఇక కపిల్ దేవ్ కెప్టెన్సీ లో ఇండియా తొలిసారిగా 1983 వరల్డ్ కప్ విన్నింగ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ‘83’ చిత్రంలో రణ్‌వీర్ సింగ్ అయితే కపిల్ దేవ్‌ను అచ్చుగుద్దినట్టు దించేశాడు కూడా.ఇక ఈ గంగూలీ బయోపిక్ ఆ స్థాయిలోనే ఉండాలంటే లార్డ్స్ సెలబ్రేషన్స్ ఒక్కటే సరిపోదు ,అంతకు మించి గంగూలీ జీవితంలో ఉన్న అప్ అండ్ డౌన్స్ ని చూపించలవలసి ఉంటుంది. ముఖ్యంగా గంగూలీ కెరీర్ లో గ్రెగ్ చాపెల్ ఎపిసోడ్ ని, టీమ్ నుండి తీసేస్తే ఎలా రికవర్ అయి సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చాడన్న ఎపిసోడ్స్ ని ఈ సినిమాలో ఎలా డీల్ చేస్తారో చూడాలి.

మరి లవ్ ఫిల్మ్స్, టి-సిరీస్ కలిసి విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలకి తెరతీస్తుందో మే 14, 2027నే చూడాలి !

Related News

సోదరి అన్షు పెళ్లిలో స్పెషల్ అట్రాక్షన్ గా జాన్వీ వాచ్.. ఖరీదు, ప్రత్యేకతలు తెలిస్తే షాక్!

సైలెంట్ గా రెండో పెళ్లి చేసుకున్న కలర్స్ స్వాతి.. ఈ సడన్ ట్విస్ట్ ఏంటి?

సడెన్ గా ఓటీటీకి వచ్చేసిన సింగీతం మ్యాజిక్.. ఎందులో చూడాలో తెలుసా?

అమితాబ్ అర్ధరాత్రి రూ.15 కోట్ల ల్యాండ్ డీల్.. భూముల కొనుగోలుపై కీలక విషయాలు వెలుగులోకి!

ఆ డ్రామా నా వల్ల కాదు.. భాగ్యరాజ్ అంత్యక్రియలకు వెళ్లకపోవడంపై ఊర్వశి సంచలన వ్యాఖ్యలు!

బాలీవుడ్ పై విమర్శలు గుప్పించిన సోనాలి బింద్రే.. టాలీవుడ్ ఎంతో బెటర్ అంటూ!

చిన్నారి అభిమాని నిరంజన్ మృతిపై పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్!

Big Stories

Advertisement
×