Lokesh kanakaraj : తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఈయన తమిళ డైరెక్ట్ అయినా తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. స్టార్ హీరోలతో ఎన్నో బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాలను తెరకెక్కించారు. ఇప్పటివరకు ఈయన మాస్ యాక్షన్ సినిమాలను తెరకెక్కించి ప్రేక్షకులు మనసులో మాస్ డైరెక్టర్ గా చెరగని ముద్ర వేసుకున్నారు. రీసెంట్ గా ఈ లోకి తీసిన రజినీకాంత్ కూలీ మూవీ థియేటర్లలో సందడి చేస్తుంది. మొదటి షోతోనే మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు అటు కలెక్షన్ల వర్షం కూడా కురిపిస్తుంది. ఇదంతా బాగానే ఉంది కానీ తాజాగా డైరెక్టర్ లోకి గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది..
లోకేష్ ను పక్కనపెట్టిన హీరోలు..
సినీ ఇండస్ట్రీలో ఒక సినిమా హిట్ అయితే ఆ డైరెక్టర్ తో సినిమాలు చేసేందుకు హీరోలు ఆసక్తి చూపిస్తారు.. డైరెక్టర్ లోకేష్ కనకరాజు ఇండస్ట్రీలోని స్టార్ హీరోలతో సినిమాలు చేశారు. అయితే కొన్ని సినిమాలు యావరేజ్ టాక్ ని అందుకున్న కలెక్షన్ల పరంగా మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకున్నాయి.. లోకి ఎక్కించిన కూలీ సినిమా ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో రన్ అవుతుంది. అయితే యాక్షన్ పరంగా ఈ సినిమా అదిరిపోయినా, రైటింగ్ పరంగా కాస్త వెనుకబడిందని ఈ చిత్రాన్ని చూసిన వారు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో లోకేష్ కెరీర్‌లోనే ఇది వీక్ రైటింగ్ అని పలువురు సినీ క్రిటిక్స్ కామెంట్స్ చేస్తున్నారు.. లోకేష్ సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌తో ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలు జాగ్రత్త పడుతున్నారని సినీ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్, రామ్ చరణ్ తో లోకీ సినిమాలు చేస్తాడని గతంలో వార్తలు వినిపించాయి.. ప్రభాస్ తో దాదాపు మూవీ కన్ఫామ్ అయ్యిందని అప్పట్లో వార్తలు గట్టిగానే వినిపించాయి. ఆ తర్వాత ఎన్టీఆర్ తో కూడా మూవీ చేస్తారని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. కానీ డ్రాప్ అయ్యారని టాక్.
ఖైదీ 2 మూవీ..
లోకేష్ కనకరాజు గతంలో తనకి ఎక్కించిన కార్తీ హిట్ చిత్రం ఖైదీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకు సీక్వెల్ గా ఖైదీ 2 రాబోతున్న విషయం తెలిసిందే.. తెలుగులో స్టార్ హీరోలతో సినిమాలు కన్ఫామ్ అయ్యినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు కూలీ చిత్రానికి వచ్చిన రెస్పాన్స్ చూసి వారు లోకేష్‌తో ఇప్పట్లో సినిమాలు చేసేందుకు ఆసక్తిగా లేనట్లు తెలుస్తోంది.. మరి తెలుగులో ఈ డైరెక్టర్ స్టార్ హీరోలతో ఒక్క సినిమానైనా తెరకెక్కిస్తారేమో చూడాలి.. ప్రస్తుతం కూలీ మూవీ మంచి టాక్ ను అందుకుంది. ఈ మూవీ కలెక్షన్ల విషయమే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.. మరి ఈ వీకెండు ఎన్ని కోట్ల వసూళ్లను రాబడుతుందో చూడాలి..