Lokesh Kanagraj: కోలీవుడ్ ఇండస్ట్రీలో వరుస హిట్ సినిమాలకు దర్శకుడుగా వ్యవహరిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న లోకేష్ కనగరాజ్ (Lokesh Kangaraj)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటివరకు ఈయన దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలన్నీ ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇకపోతే తాజాగా రజినీకాంత్(Rajinikanth) హీరోగా నటించిన కూలీ సినిమా (Coolie Movie)ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఆగస్టు 14వ తేదీ విడుదల అయ్యి అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన నేపథ్యంలో ఇతర భాష సెలబ్రిటీలు కూడా కీలక పాత్రలలో నటించారు.
తెలుగులో 50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్..
అన్ని భాషలలో కూడా ఈ సినిమాకు ఎంతో మంచి ఆదరణ లభిస్తుంది. ఇకపోతే తాజాగా కూలీ సినిమా ద్వారా డైరెక్టర్ లోకేష్ కనగ రాజ్ తెలుగులో సరికొత్త రికార్డు సొంతం చేసుకున్నారు. ఇప్పటివరకు లోకేష్ దర్శకత్వంలో వచ్చిన ఖైదీ, లియో, విక్రమ్ వంటి సినిమాలు తెలుగులో విడుదలయ్యాయి. అయితే ఈ సినిమాలు ఏవి కూడా తెలుగులో 50 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించలేకపోయాయి కానీ, కూలీ సినిమా మాత్రం 50 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా విడుదలైన నాలుగు రోజులకే ఈ స్థాయిలో తెలుగులో కలెక్షన్లను రాబట్టడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఆరో స్థానంలో కూలీ సినిమా..
ఇలా లోకేష్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలలో తెలుగులో ఈ స్థాయిలో కలెక్షన్లను రాబట్టిన సినిమాగా కూలీ రికార్డు సాధించింది. అయితే కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి తెలుగులో విడుదల అయ్యి 50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టిన సినిమాల జాబితాలో కూలీ సినిమా ఆరో స్థానంలో ఉంది. ఈ ఆరు సినిమాలలో నాలుగు సినిమాలు రజనీకాంత్ సినిమాలే కావటం విశేషం. రోబో, ఐ, రోబో 2.0, జైలర్, అమరన్, కూలీ సినిమాలు వరుసగా తెలుగులో 50 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టాయి. అయితే ఇందులో నాలుగు రజనీకాంత్ సినిమాలు ఉండటం విశేషం.
హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న లోకేష్ కనగరాజ్…
ఇక లోకేష్ డైరెక్షన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలు వందల కోట్ల కలెక్షన్లను రాబట్టాయి కానీ తెలుగులో కూలీ సినిమా స్థాయిలో ఏ సినిమా కూడా కలెక్షన్లను రాబట్టకపోవడం గమనార్హం. ఇక ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకున్న నేపథ్యంలో లోకేష్ తన తదుపరి సినిమాలపై దృష్టి సారించారు. ఇప్పటికే ఈయన సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా పలు సినిమాలకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. త్వరలోనే కార్తి హీరోగా నటిస్తున్న ఖైదీ2 సినిమా పనులను ప్రారంభించబోతున్నారు. లోకేష్దర్శకుడిగా మాత్రమే కాకుండా, హీరోగా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తెలుస్తుంది. ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాటు కూడా జరుగుతున్నట్టు సమాచారం.
Also Read: Bejawada Bebakka: కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన బెజవాడ బేబక్క… ఇల్లు చూశారా ఎంత బాగుందో?