Prakasam: ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కె.బిట్రగుంటలో ఉన్నటువంటి బికె థ్రెషర్స్ పొగాకు కంపెనీలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. గోడౌన్‌లో పొగాకు బేళ్లు ఉండటంతో మంటలు ఎగసి పడ్డాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు పైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు భారీ ప్రయత్నాలు చేపట్టారు. ఈ ప్రమాదంలో భారీ నష్టం జరిగినట్టు తెలుస్తోంది. పొగాకు సంబంధిత తయారీ వాడేటువంటి కెమికల్ ఫైర్ అయి ఉండొచ్చని ప్రమాదానికి ప్రాథమిక కారణంగా అగ్నిమాపక సిబ్బంది అంచనా వేస్తుంది.