బీహార్ ప్రజల చిరకాల స్వప్నం అయిన మెట్రో రైలు ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. అక్టోబర్ 6న ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పాట్నా మొదటి దశ మెట్రోను ప్రారంభించారు. ఇందులో భాగంగా 3.6 కిలో మీటర్ల ఎలివేటెడ్ స్ట్రెచ్ ను అందుబాటులోకి తెచ్చారు. అక్టోబర్ 7 నుంచి కమర్షియల్ ఆపరేషన్స్ మొదలయ్యాయి. ఎన్నో ఏళ్లుగా ఎదరు చూస్తున్న మెట్రో అందుబాటులోకి రావడంతో చాలా మంది ప్రయాణీకులు సంతోషం వ్యక్తం చేశారు. అయితే, మెట్రో ప్రారంభం అయిన మూడు రోజులకే ఆయా స్టేషన్లలో షాకింగ్ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. మెట్రో స్టేషన్ల మెట్లతో పాటు గోడలు, ప్లాట్ ఫారమ్ ప్రాంతాలు, ట్రాక్ ల మీద ఎర్రటి గుట్కా మరకలు కనిపించాయి.
పాట్నా మెట్రో మీద ‘గుట్కా గ్యాంగ్’ ఎఫెక్ట్ పడిందంటూ ఓ నెటిజన్ ఈ వీడియోను షేర్ చేశాడు. “పాట్నా మెట్రో ప్రారంభమై మూడు రోజులే అయింది. అప్పుడే గుట్కా గ్యాంగ్ దాని రంగును మార్చే ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వం దీనిపై ఫోకస్ పెట్టాలి” అంటూ ఓ నెటిజన్ వీడియో పోస్టు చేశాడు.
पटना मेट्रो के शुरू हुए 4, 5 दिन ही हुए लेकिन गुटका गैंग सक्रिय हो गए है इसको रंगीन बनाने के लिए। सरकार को इसपर ध्यान देना चाहिए। pic.twitter.com/D2npWQy7J3
— छपरा जिला 🇮🇳 (@ChapraZila) October 9, 2025
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు సీరియస్ అవుతున్నారు. కొంత మంది ఈ ఘటనపై నిరాశ వ్యక్తం చేయగా, మరికొంత మంది ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. “మెట్రో స్టేషన్లలో గుట్కా గ్యాంగ్ అరాచకాలను అడ్డుకోవాలి. ఎవరైతే గుట్కా ఉమ్మివేస్తారు. వారితోనే ఆ మరకలను శుభ్రం చేయించాలి” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. “మెట్రో రైలు రాలేదని ప్రభుత్వాన్ని నిందిస్తాం. వచ్చాక దాన్ని పాడు చేసేందుకు ముందు ఉంటాం” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. “ప్రభుత్వం పాన్ మసాలా/గుట్కా తయారీ కంపెనీలపై నిషేధం ఎందుకు విధించదో నాకు అర్థం కావడం లేదు” అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. “మెట్రో పరిసరాల్లో గుట్కా వేసే వారిని పట్టుకుని ఆ మరకలను శుభ్రం చేయించడంతో పాటు గంటసేపు వీధుల్లోనూ శుభ్రం చేయించాలి” అని ఇంకో వ్యక్తి కామెంట్ చేశాడు. “దేశం మొత్తం గుట్కా గ్యాంగ్ తో ఇబ్బంది పడుతోంది. గుట్కాపై పూర్తి నిషేధం విధించాలి” అని మరో నెటిజన్ అభిప్రాయపడ్డాడు. “గుట్కా వేసుకుని ఎక్కడపడితే అక్కడ ఉమ్మేసేవారిని వెంటనే ఎన్ కౌంటర్ చేయాలి” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు.
పాట్నా మెట్రో ఫస్ట్ ఫేజ్ లో మూడు ముఖ్యమైన స్టేషన్లు ఉన్నాయి. అవి ISBT, జీరో మైల్, భూత్ నాథ్ రోడ్. బ్లూ లైన్ (నార్త్-సౌత్ కారిడార్) 16.2 కి.మీ విస్తరించి ఉంచుటుంది. పాట్నా జంక్షన్ ను ISBTతో కలుపుతుంది. ఇందులో ఐదు ఎలివేటెడ్, ఏడు భూగర్భ స్టేషన్లు ఉంటాయి. మొత్తం బ్లూ లైన్ లో 12 స్టేషన్లు ఉంటాయి. పాట్నా జంక్షన్, ఆకాశవాణి, గాంధీ మైదాన్, PMCH, పాట్నా యూనివర్సిటీ, మొయిన్ ఉల్ హక్ స్టేడియం, రాజేంద్ర నగర్, మలాహి పక్రి, ఖేమ్ని చాక్, భూత్‌నాథ్, జీరో మైల్, న్యూ ISBT.
Read Also: ప్రయాణీకుడికి గుండెపోటు, కాజీపేట స్టేషన్ లో నిలిచిపోయిన గోదావరి ఎక్స్ ప్రెస్!