E-Paper
Advertisement

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కును ఢీకొట్టిన వ్యాన్.. ఆరుగురు దుర్మరణం!

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కును ఢీకొట్టిన వ్యాన్.. ఆరుగురు దుర్మరణం!
Advertisement

Kushinagar Accident: అప్పటిదాకా కుటుంబ సభ్యులందరితో కలిసి సరదాగా వేడుక జరుపుకున్నారు. వేడుక ముగిశాక నవ్వుతూ, ముచ్చట్లు చెప్పుకుంటూ ఇంటికి బయలుదేరారు. కానీ, ఆ సంతోషం కొద్దిసేపు కూడా నిలవలేదు. మార్గమధ్యలోనే మృత్యువు ప్రమాదం రూపంలో విరుచుకుపడి, ఆ ఇంట తీరని విషాదాన్ని నింపింది.

ఏం జరిగిందంటే..

Advertisement

ఉత్తరప్రదేశ్‌లోని కుషీనగర్ జిల్లాలో తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. హటా-పిప్రైచ్ రహదారిపై వేగంగా వెళ్తున్న ఓమ్ని వ్యాన్, ఎదురుగా వస్తున్న ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి వ్యాన్ తీవ్రంగా నుజ్జునుజ్జయ్యి, అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.

ఒకే కుటుంబంలో 5 బలి

Advertisement

మృతి చెందిన వారిలో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం. వేడుక ముగించుకుని తిరిగి వస్తున్న క్రమంలో ఈ ఘోరం జరగడంతో ఆ కుటుంబంలో తీవ్ర శోకసంద్రం అలుముకుంది. మరో వ్యక్తి కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

డ్రైవర్ పరార్..పోలీసుల దర్యాప్తు..

ఈ ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్ ఘటన జరిగిన వెంటనే వాహనాన్ని వదిలేసి అక్కడ నుంచి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించడంతో స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది.

Also read: గడ్డం, మీసం పెంచితే రేవంత్ రెడ్డి అయిపోతావా? కేటీఆర్‌పై వేముల వీరేశం సంచలన కామెంట్స్!

Tags

Related News

రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. విద్యుత్ తీగలు తగిలి 8 మంది కార్మికులు బలి

ప్రభుత్వ ఉద్యోగం.. ఓఎన్‌జీసీలో 3047 జాబ్స్.. త్వరగా అప్లై చేయండి

భార్య ప్రేమ కోసం తెగించాడు.. దొంగగా మారి కారుని కొట్టేసిన భర్త, మధ్యప్రదేశ్‌లో ఘటన

మేము కొట్టం.. తిట్టం.. కానీ? మోడీ, అమిత్ షాలకు రాహుల్ ఇచ్చిన మైండ్ బ్లోయింగ్ మెసేజ్!

ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌పై.. మమత బెనర్జి సంచలన సెటైర్లు!

రైల్వే జాబ్స్.. 1,215 స్టేషన్ మాస్టర్ ఖాళీలు.. డిగ్రీ అంటే చాలు

రామ్‌లీలా మైదాన్‌లో ఇండియా బ్లాక్ ర్యాలీ..10 లక్షల మంది వస్తారని అంచనా, భారీగా పోలీసుల మోహరింపు

Big Stories

Advertisement
×