Godrej 180 L refrigerator review: ఇంటికి ఒక రిఫ్రిజిరేటర్ ఉండటం అనేది.. నేడు అత్యంత అవసరమైన విషయాల్లో ఒకటి. కూరగాయలు పాడవ కుండా తాజా శక్తితో ఉండాలన్నా, వేసవి కాలంలో చల్లటి నీరు తాగాలన్నా ఫ్రిజ్ కచ్చితంగా ఉండాలి.అయితే.. చాలా మంది కొత్తగా ఫ్రిజ్ కొనేటప్పుడు బడ్జెట్, స్థలం గురించి ఆలోచిస్తుంటారు. ముఖ్యంగా చిన్న కుటుంబాలు లేదా బ్యాచిలర్స్ కోసం సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్లు ఎంతగానో ఉపయోగ పడతాయి. ఈ కోవకే.. చెందిన అద్భుతమైన, అత్యంత నమ్మకమైన మోడల్ ఇది. మార్కెట్లో.. కేవలం రూ.10,990 ధరకే లభిస్తున్న ఈ ఫ్రిజ్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
గోద్రెజ్ బ్రాండ్ క్వాలిటీకి ఎంతో పేరుగాంచింది. ఈ 180 లీటర్ల సింగిల్ డోర్ ఫ్రిజ్ డిజైన్ విషయానికి వస్తే.. ఇది చాలా కాంపాక్ట్‌గా , మోడ్రన్‌గా ఉంటుంది. చిన్న కిచెన్ లేదా తక్కువ స్థలం ఉన్న ఇళ్లలో.. దీన్ని అమర్చుకోవడం చాలా ఈజీ. దీని అందమైన కలర్ , ట్రెండీ లుక్ మీ కిచెన్ ఇంటీరియర్‌కు చక్కటి రూపాన్ని ఇస్తుంది. అలాగే దీని బాడీ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. తద్వారా ఇది సంవత్సరాల తరబడి పని చేస్తుంది.
ఈ రిఫ్రిజిరేటర్ మెయిన్ హైలైట్ ఇందులో ఉన్న 20 లీటర్ల జంబో వెజిటబుల్ ట్రే. సాధారణంగా.. సింగిల్ డోర్ ఫ్రిజ్‌లలో కూరగాయలు పెట్టుకోవడానికి స్థలం తక్కువగా ఉంటుంది. కానీ.. గోద్రెజ్ ఇందులో ..ప్రత్యేకంగా పెద్ద సైజ్ ట్రేను అందించింది. దీని వల్ల మీరు ఎక్కువ మొత్తంలో కూరగాయలు, పండ్లను ఒకే సారి చాలా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రిజ్ లోపల గ్లాస్ షెల్ఫ్‌లు ఇచ్చారు ఇవి బరువును తట్టుకునే శక్తిని కలిగి ఉంటాయి. అందుకే వీటిని శుభ్రం చేయడం కూడా చాలా ఈజీ.
ఇది డైరెక్ట్ కూల్ టెక్నాలజీతో పని చేస్తుంది. దీని వల్ల ఫ్రిజ్ లోపల కూలింగ్ చాలా వేగంగా తయారవుతుంది. పాలు, కూరగాయలు , ఇతర ఆహార పదార్థాలు ఎక్కువ కాలం తాజాగా ఉండేలా ఇది చూస్తుంది.అలాగే.. ఇందులో ఉన్న అడ్వాన్స్డ్ కాపిలరీ టెక్నాలజీ కంప్రెసర్ పని తీరును మెరుగు పరుస్తుంది. తద్వారా తక్కువ కరెంట్ బిల్లుతో .. ఎక్కువ కూలింగ్ లభిస్తుంది. వేసవి కాలంలో ..కూడా ఐస్ చాలా త్వరగా గడ్డకట్టడానికి ఇది సహాయ పడుతుంది.
ప్రస్తుత రోజుల్లో కరెంట్ బిల్లుల గురించి అందరూ ఆలోచిస్తుంటారు. ఈ గోద్రెజ్ ఫ్రిజ్ తక్కువ కరెంట్ వినియోగించుకునేలా డిజైన్ చేసారు. పదే పదే స్టెబిలైజర్ అవసరం లేకుండానే.. వోల్టేజ్ హెచ్చుతగ్గులను ఇది తట్టుకోగలదు. దీని వల్ల మీ ఇంట్లోని వస్తువులు సురక్షితంగా ఉంటాయి. నిర్వహణ పరంగా కూడా దీనికి పెద్దగా ఖర్చు ఉండదు.డిఫ్రాస్ట్ బటన్ నొక్కడం ద్వారా ఐస్‌ను ఈజీగా తొలగించుకోవచ్చు.
Also Read: 1,099కే నెక్ట్ లెవల్ ఫీచర్లున్నఇయర్ బడ్స్! డోంట్ మిస్
ఇండియన్ మార్కెట్లో ఈ మోడల్ ధర కేవలం రూ. 10,990 మాత్రమే. ప్రముఖ ఆన్‌లైన్ స్టోర్లు, ఎలక్ట్రానిక్స్ షోరూమ్‌లలో ఇది కొనడానికి అందుబాటులో ఉంది. కేవలం.. పదిహేను వేల లోపు బడ్జెట్‌లో, నమ్మకమైన బ్రాండ్ నుంచి పెద్ద వెజిటబుల్ ట్రే ,అద్భుతమైన కూలింగ్ కోరుకునే.. వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. మీ ఇంటికి ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ , లాంగ్ లాస్టింగ్ ఫ్రిజ్ కావాలంటే గోద్రెజ్ 180L నిస్సందేహంగా సరైన ఛాయిస్ అవుతుంది.