USB-C Port: ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ లేనిదే ఏ పని జరగడం లేదు. అలాంటి ఫోన్ కు ఛార్జింగ్ పెట్టాలంటే యూఎస్‌బీ – సీ (USB-C) పోర్ట్ ఎంతో కీలకం. అయితే ఈ పోర్ట్ కేవలం ఛార్జింగ్ పెట్టడం కోసం మాత్రమే ఉపయోగపడుతుందని చాలా మంది భావిస్తుంటారు. అయితే ఎక్కువ మందికి తెలియని విషయం ఏమిటంటే.. ఈ చిన్న USB-C పోర్ట్‌తో కంప్యూటర్, లాప్‌టాప్‌లలో చేసే అనేక పనులను ఫోన్‌లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఫోన్ లోని USB-C పోర్ట్‌తో చేయగలిగే 7 ఉపయోగకరమైన పనులను ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.
ఫోన్‌లో స్టోరేజ్ నిండిపోయినప్పుడు, పెన్‌డ్రైవ్‌లో ఉన్న ఫోటోలు, వీడియోలను ఫోన్‌లో చూడాలనుకున్నప్పుడు కొందరు కంప్యూటర్, ల్యాప్ టాప్ సాయం తీసుకుంటారు. ఆ పని లేకుండా ఒక చిన్న ఓటీజీ ఎడాప్టర్ సహాయంతో పెన్‌డ్రైవ్‌ను నేరుగా ఫోన్‌కు కనెక్ట్ చేసి డాటాను తేలికగా కాపీ, మూవ్ చేసుకోవచ్చు.
ఫోన్‌లో పెద్ద పెద్ద డాక్యుమెంట్లు, మెయిల్స్ టైప్ చేయడం కొంత కష్టంగా అనిపించొచ్చు. అలాంటప్పుడు USB-C హబ్ ద్వారా ఫోన్‌కు వైర్డ్ కీబోర్డ్, మౌస్ కనెక్ట్ చేసుకోవచ్చు. దీనివల్ల స్మార్ట్‌ఫోన్ ఒక చిన్న కంప్యూటర్‌లా మారిపోతుంది. టైపింగ్ పనులు చాలా వేగంగా ఫినిష్ చేసేందుకు సాయపడుతుంది.
వై-ఫై సిగ్నల్ సరిగ్గా లేనప్పుడు, హెవీ గేమింగ్, ఆన్‌లైన్ మీటింగ్స్ సమయంలో స్పీడ్ ఇంటర్నెట్ కావలసి వస్తే.. USB-C to Ethernet ఎడాప్టర్ ద్వారా నేరుగా లాన్ (LAN) వైరును ఫోన్‌కు కనెక్ట్ చేయవచ్చు. దీని ద్వారా ఎటువంటి అంతరాయం లేకుండా వేగవంతమైన ఇంటర్నెట్‌ను పొందొచ్చు.
ఫోన్‌లోని సినిమాలు, ఫోటోలు, ఆఫీస్ ప్రజెంటేషన్లను పెద్ద స్క్రీన్‌పై చూడాలనుకుంటే Type-C to HDMI కేబుల్ ఉపయోగించవచ్చు. దీని ద్వారా ఫోన్ స్క్రీన్‌ను నేరుగా టీవీకి, కంప్యూటర్ మానిటర్‌కు కనెక్ట్ చేసి లార్జ్ స్క్రీన్ అనుభూతిని పొందొచ్చు.
వైర్‌లెస్ పద్ధతుల ద్వారా లార్జ్ వీడియోలు, ఫైళ్లు పంపడానికి చాలా సమయం పడుతుంది. కానీ USB 3.0 లేదా అంతకంటే ఎక్కువ వెర్షన్ ఉన్న USB-C కేబుల్ ద్వారా లాప్‌టాప్‌కు కనెక్ట్ చేస్తే జిగాబైట్ల (GB) డేటా కూడా కేవలం కొన్ని సెకన్లలోనే వేగంగా ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు.
ఫోన్‌లో గేమ్స్ ఆడటం ఇష్టమైతే టచ్ స్క్రీన్‌పై ఆడటం కంటే USB-C ద్వారా వైర్డ్ గేమ్ కంట్రోలర్‌ను (Gamepad) కనెక్ట్ చేసి ఆడటం చాలా అనుకూలంగా ఉంటుంది. ఎటువంటి లాగ్ లేకుండా పర్ఫెక్ట్ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇది అందిస్తుంది.
Also Read: శాలరీ అకౌంట్ vs సేవింగ్స్ అకౌంట్.. రెండింటికీ తేడా ఏంటి? ఏ ఖాతా వల్ల ఎక్కువ లాభం?
ప్రస్తుతం వస్తున్న ఫోన్లలో 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉండటం లేదు. ఈ నేపథ్యంలో USB-C పోర్ట్ ద్వారా కనెక్ట్ అయ్యే ఇయర్ ఫోన్లు లేదా Type-C to DAC ఎడాప్టర్లను వాడటం వల్ల సాధారణ ఇయర్ ఫోన్ల కంటే అత్యంత నాణ్యమైన, స్పష్టమైన (Hi-Res) ఆడియోను వినవచ్చు.
Also Read: డేటా అక్కర్లేని వారికి జియో గుడ్ న్యూస్.. అపరిమిత కాల్స్ కోసం సరికొత్త చౌకైన ప్లాన్లు!