Pawan Kalyan : నందమూరి స్టార్ హీరో బాలయ్య పై టాలీవుడ్ స్టార్ హీరో, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. భారతీయ సినిమాకు 50 సంవత్సరాలు అగ్ర కథానాయకుడిగా అందించిన సేవకు గాను నందమూరి బాలయ్యకు ఇప్పుడు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తో పాటుగా, UK గుర్తింపు లభించింది.. ఈ గుర్తింపు కేవలం సినీ ప్రయాణానికి మాత్రమే కాదు, అంకితభావం, క్రమశిక్షణతో పాటు సమాజానికి బాలయ్య చేస్తున్న సేవకు లభించిన నిదర్శనం.
ఐదు దశాబ్దాల బాలయ్య అద్భుతమైన ప్రయాణానికి అద్దం పట్టే ఈ ప్రపంచస్థాయి గౌరవం దక్కడం తెలుగు వారికి గర్వకారణం. ఈ సందర్బంగా నందమూరి బాలయ్యకు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.. అటు నందమూరి అభిమానులు కూడా ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.. ఈ క్రమంలో తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆసక్తికర ట్వీట్ చేస్తారు.. బాలయ్య పై ప్రశంసలు కురిపిస్తూ చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతుంది.
బాలయ్య పై పవన్ ప్రశంసలు..
బాలయ్య 50 ఏళ్లుగా చేసిన సేవలకు దక్కిన గుర్తింపు పై ఇప్పుడు అందరు కొనియాడుతున్నారు. బాలయ్య ను సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు అభినందించారు. ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాలయ్య ప్రశంసలు కురిపిస్తూ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో.. బాలనటుడిగా తెలుగు చలన చిత్ర రంగంలోకి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నట వారసుడిగా అడుగుపెట్టి జానపదాలు, కుటుంబ కథా చిత్రాలు, యాక్షన్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ, నట జీవితంలో 50 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం పూర్తి చేసుకున్న తరుణంలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ( లండన్) లో చోటు సాధించిన ప్రముఖ నటులు, హిందూపురం MLA, పద్మ భూషణ్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయన మరిన్ని సంవత్సరాలు తన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ, ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను.. అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ తో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.
Also Read : ఈ వారం దారుణంగా పడిపోయిన రేటింగ్.. గుండెనిండా గుడిగంటలు పరిస్థితి ఏంటి..?
బాలయ్య సినిమాల విషయానికొస్తే…
బాలయ్య వయసు పెరుగుతున్న జోరు మాత్రం తగ్గలేదు. కుర్ర హీరోలకు పోటీనిస్తూ వరసగా సినిమాలను అనౌన్స్ చేస్తున్నారు.. ఈ ఏడాది డాకు మహారాజ్ మూవీలో నటించారు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ యావరేజ్ టాక్ ను అందుకుంది. ప్రస్తుతం ఈయన బోయపాటి శ్రీను కాంబినేషన్లో అఖండ 2 లో నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ వచ్చే నెల 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ తర్వాత మరో రెండు ప్రాజెక్టులలో బాలయ్య నటించినందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక రాజకీయాలలో కూడా ఎమ్మెల్యేగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నాడు.
బాలనటుడిగా తెలుగు చలన చిత్ర రంగంలోకి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నట వారసుడిగా అడుగుపెట్టి జానపదాలు, కుటుంబ కథా చిత్రాలు, యాక్షన్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ, నట జీవితంలో 50 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం పూర్తి చేసుకున్న తరుణంలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ( లండన్) లో…
— Pawan Kalyan (@PawanKalyan) August 25, 2025