BigTV English

India-China: సుంకాల యుద్ధం.. చైనాతో భారత్ సయోధ్యకు ప్రయత్నం

India-China: సుంకాల యుద్ధం.. చైనాతో భారత్ సయోధ్యకు ప్రయత్నం

అమెరికా సుంకాల యుద్ధం విషయంలో పైకి భారత ప్రభుత్వం గంభీరంగా ఉన్నా.. అంతర్జాతీయ వాణిజ్యంపై పడే ప్రభావానికి ప్రత్యామ్నాయాలు వెదుకుతోంది. ఇతర దేశాలతో వాణిజ్య ప్రయత్నాలను ముమ్మరం చేయడానికి సిద్ధమవుతోంది. కరోనాకు ముందున్న పరిస్థితులను పునరుద్ధరించే దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా చైనాతో సయోధ్యకు భారత్ ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ ప్రయత్నాలకు చైనా కూడా సానుకూలంగా స్పందించడం విశేషం. షిప్కిలా కనుమద్వారా భారత్-చైనా మధ్య గతంలో వాణిజ్యం జరిగేది. 2020లో కరోనా కారణంగా ఆ మార్గాన్ని నిలిపివేశారు. దీంతో చైనాతో వాణిజ్య సంబంధాలు దెబ్బతున్నాయి. ఆ బంధాన్ని ఇప్పుడు బలోపేతం చేసుకోడానికి భారత్ ప్రయత్నిస్తోంది. భారత ప్రతిపాదనను చైనా సూత్రప్రాయంగా అంగీకరించడం విశేషం.


షిప్కిలా కనుమ ద్వారా..
కిన్నౌర్‌ లోని షిప్కి-లా కనుమ ద్వారా భారత్‌తో వాణిజ్యాన్ని తిరిగి ప్రారంభించడానికి చైనా సూత్రప్రాయంగా అంగీకరించినట్టు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ఇటీవల భారత దేశానికి వచ్చారు. హిమాచల్ ప్రదేశ్‌ కిన్నౌర్ జిల్లాలోని షిప్కి-లా ద్వారా వాణిజ్యాన్ని తిరిగి ప్రారంభించాలనే ప్రతిపాదనకు ఆయన సూత్రప్రాయంగా అంగీకరించారు. దీంతో ఈ మార్గం త్వరలో తెరుచుకుంటుందని అంటున్నారు. అదే జరిగితే చైనాతో భారత్ వాణిిజ్య సంబంధాలు మరింత మెరుగవుతాయి. అమెరికా సుంకాల మోత మోగిస్తున్న వేళ, ఇది భారత ఆర్థిక వ్యవస్థకు ఊతంగా మారుతుంది.

కరోనా సమయంలో సరిహద్దుల మూత..
చైనాతో సిక్కిం, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ద్వారా భారత్ వాణిజ్యాన్ని కొనసాగించేది. అయితే కరోనా సమయంలో ఆ సరిహద్దులు మూసివేశారు. తిరిగి ప్రారంభించడానికి ప్రయత్నించినా, ఇరు దేశాల మధ్య సంబంధాలు అంత సానుకూలంగా లేకపోవడంతో ఆ ప్రయత్నాలు మానుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. అమెరికా సుంకాల యుద్దంతో భారత్ కి గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. అటు చైనాకి కూడా దాదాపు అలాంటి ఇబ్బందులే మొదలయ్యాయి. దీంతో ఈ రెండు దేశాలు ఒకే మాటపై వెళ్లాలనుకుంటున్నాయి. చైనా-భారత్ మధ్య సరిహద్దు గొడవలు ఉన్న విషయం తెలిసిందే. అయితే వీలైనంత త్వరగా ఈ గొడవలు పక్కనపెట్టి అంతర్జాతీయ వాణిజ్యం విషయంలో కలసిపోవాలని ఇరు దేశాలు నిర్ణయించడం విశేషం. దీనికి షిప్కి-లా తొలి అడుగుగా భావిస్తున్నారు. షిప్కి-లా (హిమాచల్ ప్రదేశ్), లిపులేఖ్ (ఉత్తరాఖండ్), నాథు లా (సిక్కిం) ప్రాంతాల ద్వారా త్వరలో వాణిజ్యం తిరిగి మొదలవుతుందని భారత్ భావిస్తోంది. ఈమేరకు చైనాతో చర్చలు మొదలయ్యాయని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశారు. ఆయన ప్రకటన సారాంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీడియాకు విడుదల చేసింది. షిప్కిలా కనుమ ద్వారా త్వరలో బారత్-చైనా వాణిజ్యం తిరిగి ప్రారంభమవుతుందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.


ఉమ్మడి శత్రువు అమెరికా..
అదే జరిగితే భారత్-చైనా మధ్య సత్సంబంధాలు మొదలయ్యే అవకాశముంది. ఉమ్మడి శత్రువు అమెరికాను దెబ్బకొట్టేందుకు భారత్-చైనా చేయి కలపబోతున్నాయనే విషయం నిర్థారణ అయినట్టే. అమెరికా సుంకాల యుద్ధంతో విసిగివేసారిన ప్రపంచ దేశాలు కూడా ప్రత్యామ్నాయాలపై దృష్టి పెడితే, అగ్రరాజ్యమే దారిలోకి రావాల్సి ఉంటుంది.

Related News

Kim Jong Un: కన్నీళ్లు పెట్టుకున్న కిమ్.. నమ్మండి ఇది నిజం

Donald Trump: మళ్లీ షాకిస్తున్న ట్రంప్.. ఇక అమెరికా గ్రీన్ కార్డు పొందడం కష్టమే..

Terroist Masood Azhar: మసూద్ టార్గెట్ రూ.120 కోట్లు.. గ్లోబల్ టెర్రరిస్ట్‌కి విరాళాలు ఇస్తుంది ఎవరంటే..?

New York Bus Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

Earthquake: సౌత్ అమెరికాను కుదిపేసిన భారీ భూకంపం.. 7.5గా నమోదు

Big Stories

×