E-Paper
Advertisement

Dhurandhar 2: ప్రభంజనం సృష్టిస్తున్న ధురంధర్ 2.. ఆ రికార్డ్స్ అన్నీ చెరిపేస్తుందా?

Dhurandhar 2: ప్రభంజనం సృష్టిస్తున్న ధురంధర్ 2.. ఆ రికార్డ్స్ అన్నీ చెరిపేస్తుందా?
Advertisement

Dhurandhar 2:సాధారణంగా ఒక సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందంటే ఆ సినిమాకి కొనసాగింపుగా సీక్వెల్స్ వస్తూ ఉంటాయి. అయితే మొదటి సినిమా అందుకున్నంత విజయాన్ని సీక్వెల్స్ అందుకోవడం కష్టమే. కానీ బాహుబలి 2, పుష్ప 2 లాంటి చిత్రాలు మాత్రం సీక్వెల్స్ తో సత్తా చాటొచ్చు అని నిరూపించాయి. అయితే ఇప్పుడు ఈ రికార్డులను కూడా బ్రేక్ చేయడానికి సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరో మూవీ ధురంధర్. 2025 ఫిబ్రవరి 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అతి తక్కువ సమయంలోనే రూ.1,350 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి, రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఈ సినిమాకి కొనసాగింపుగా ‘ధురంధర్ 2: ది రివేంజ్’ పేరిట 2026 మార్చి 19న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.. ఈ సినిమా దాదాపు చాలా సినిమాల రికార్డులన్నింటినీ బ్రేక్ చేసింది. కానీ ఇప్పుడు ఉన్న టార్గెట్ బాహుబలి 2..ఇక మరో రెండు మూడు రోజుల్లో ఆ రికార్డును కూడా బ్రేక్ చేయడం సాధ్యమే.

17 రోజుల్లోనే రూ.1500 కోట్లకు పైగా కలెక్షన్స్..

ఈ సినిమా విడుదలయి ఇంకా 20 రోజులు కూడా కాలేదు అప్పుడే ఆ రికార్డులను బ్రేక్ చేయడానికి కేవలం అడుగు దూరంలో ఉండడం అభిమానులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్యధర్ దర్శకత్వంలో.. రణవీర్ సింగ్ హీరోగా, సారా అర్జున్ హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమిది. ఇప్పటికే దేశవ్యాప్తంగా రూ.1000 కోట్ల క్లబ్ కు చేరువలో నిలిచింది. ధురంధర్ 2: ది రివేంజ్ 17వ రోజు సాయంత్రం 6 గంటల వరకు దేశవ్యాప్తంగా సుమారుగా రూ.14.23 కోట్లు రాబట్టిన ఈ సినిమా.. దేశీయ బాక్సాఫీస్ వద్ద మొత్తం అన్ని భాషల్లో కలుపుకొని రూ.973.60 కోట్లకు చేరుకుంది. కేవలం హిందీ వర్షన్ మాత్రమే 17వ రోజు రూ.13.5 కోట్లు సంపాదించిన ఈ సినిమా.. దీంతో నెట్ కలెక్షన్స్ సుమారుగా . రూ.913.08 కోట్లకు చేరింది. అంటే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.900 కోట్ల మార్కు దాటిన తొలి హిందీ చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది ఈ సినిమా.

Advertisement

ALSO READ:రేణు దేశాయ్ పై నెట్టింట అసభ్య కామెంట్లు.. ఆరుగురు అరెస్ట్!

ఆ రికార్డు బ్రేక్ కి అడుగు దూరంలో..

అంతేకాదు డొమెస్టిక్ బాక్స్ ఆఫీస్ వద్ద వెయ్యి కోట్లు వసూలు చేసిన మూడవ సినిమాగా నిలవడానికి ఇది సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ లిస్టులో అల్లు అర్జున్ పుష్ప 2 తో పాటు ప్రభాస్, రానా కాంబినేషన్లో వచ్చిన బాహుబలి 2 నిలిచాయి . ఈ రెండు సినిమాలు వరుసగా పుష్ప 2 రూ.1,234.10 కోట్లు, బాహుబలి 2 రూ.1,030.42 కోట్లు వసూలు చేశాయి. ఇక ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద తన పట్టును కొనసాగిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 17 రోజులకు గాను రూ. 1564.30 కోట్ల గ్రాస్ లభించింది. ఇప్పటివరకు ఓవర్సీస్ కలెక్షన్స్ సుమారుగా రూ.385 కోట్లు రాబట్టినట్లు సమాచారం . ఏది ఏమైనా బాహుబలి 2, పుష్ప 2 సినిమా రికార్డులను బ్రేక్ చేసే దిశగా ఈ సినిమా అడుగులు వేస్తోంది. మరి అడుగు దూరంలో బాహుబలి 2 రికార్డులు బ్రేక్ చేయడానికి సిద్ధమైందని చెప్పవచ్చు.

Related News

సాంప్రదాయబద్ధంగా సమంత  సీమంతపు వేడుక వైరల్ అవుతున్న ఫోటోలు!

నటుడిగా మెప్పించి ‘నాగపూర్ పవిత్ర తేక్డి గణపతి’ పుస్తకంతో రచయితగా మారుతున్న హీరో సూర్య తేజ్

పావలా శ్యామల కుమార్తె విషయంలో ‘మా’ కీలక నిర్ణయం!

నా ముందే ఆటిట్యూడ్‌తో తిరుగుతున్నావ్.. శోభితపై చైతూ ఓపెన్ కామెంట్స్.. వీడియో చూశారా?

ఆకట్టుకుంటున్న రాగ్ మయూర్ ‘అనుమాన పక్షి’ ట్రైలర్!

హీరో అజిత్ కు  కారు గిఫ్ట్ గా ఇచ్చిన సీఎం విజయ్.. లవ్లీ బ్రదర్ అంటూ!

తరుణ్ నీలో ఈ టాలెంట్ కూడా ఉందా.. ‘ENE రిపీట్’ కోసం భలే కాకా పడుతున్నావే!

డైరెక్టర్ ఇంట్లో వినాయక చవితి చేసుకున్న నటి.. ఆ రిలేషన్ ఎదో కన్ఫర్మ్ చేసేయండయ్యా?

Big Stories

Advertisement
×