E-Paper
Advertisement

వర్షాకాలంలో..స్వర్గాన్ని తలపించే ఇండియన్ రోడ్స్ ఇవే!

వర్షాకాలంలో..స్వర్గాన్ని తలపించే ఇండియన్ రోడ్స్ ఇవే!
Advertisement

Best monsoon road trips in India: కారు అద్దాల మీద పడే చినుకులు, స్పీకర్‌లో మెలోడీ సాంగ్స్, కిటికీ పక్క నుంచి తాకే చల్లని గాలి.. రోడ్ ట్రిప్ లవర్స్‌కు ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి? సాధారణ రోజుల్లో రోడ్ ట్రిప్స్ చేయడం ఒక ఎత్తైతే, వర్షాకాలంలో ప్రయాణించడం మరో ఎత్తు. వానలు పడేటప్పుడు మన దేశంలోని కొన్ని రోడ్లు అచ్చం స్వర్గంలా మారిపోతాయి. కొండల అంచున ప్రయాణిస్తూ, మేఘాలను తాకుతూ వెళ్లే ఆ ఫీలింగే వేరు. మరి ఈ వర్షాకాలంలో అస్సలు మిస్ అవ్వకూడని ఆ బ్యూటిఫుల్ రోడ్ రూట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దామా..

వర్షంలో స్వర్గాన్ని తలపించే ఇండియన్ రోడ్లు:

మన దేశంలో భౌగోళిక వైవిధ్యం చాలా ఎక్కువ. ఇక్కడి పశ్చిమ కనుమల నుంచి హిమాలయాల దాకా వర్షాకాలంలో..చాలా ప్రదేశాలు అందంగా ఉంటాయి. ఈ సీజన్‌లో బైకర్లు, ట్రావెలర్స్ ఎక్కువగా ఇష్టపడే టాప్ రోడ్ ట్రిప్ రూట్స్ ఇవే..

1. ముంబై టు మహాబలేశ్వర్ (పశ్చిమ కనుమల అందాలు):

Advertisement

మహారాష్ట్రలోని ముంబై నుంచి మహాబలేశ్వర్ లేదా లోనావాలా వెళ్లే రూట్ వర్షాకాలంలో.. ఒక అద్భుతం. ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వే గుండా వెళ్లేటప్పుడు దారిపొడవునా కనిపించే పచ్చని కొండలు, ఘాట్ రోడ్లు, అడ్రస్ లేని వందలాది చిన్న జలపాతాలు మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తాయి. ఈ దారిలో పొగమంచు ఎంత దట్టంగా ఉంటుందంటే.. మేఘాల మధ్య నుంచే డ్రైవ్ చేస్తున్నామా అనే ఫీలింగ్ కలుగుతుంది.

2.బెంగళూరు టు కూర్గ్ /చిక్కమగళూరు (కాఫీ తోటలు):

రోడ్ ట్రిప్స్ అనగానే గుర్తొచ్చేది కర్ణాటక. బెంగళూరు నుంచి కూర్గ్ లేదా చిక్కమగళూరు వెళ్లే రోడ్లు వర్షాకాలంలో చాలా అందంగా మారుతాయి. రోడ్డుకు ఇరు వైపులా ఉండే కాఫీ తోటలు, పెద్ద పెద్ద చెట్లు, వాన తడికి వచ్చే మట్టి వాసన పర్యాటకులను కట్టిపడేస్తాయి. దారిలో.. వేడివేడిగా ఫిల్టర్ కాఫీ తాగుతూ చేసే ప్రయాణం లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది.

3. చెన్నై టు పాండిచ్చేరి:

Advertisement

కొండలు వద్దు సముద్రం కావాలి అనుకునేవారికి ఈస్ట్ కోస్ట్ రోడ్ పర్ఫెక్ట్ చాయిస్. ఒకవైపు వర్షం, మరో వైపు బంగాళాఖాతం సముద్రపు అలల సవ్వడి మధ్య బైక్ లేదా కారులో.. వెళ్లడం టూరిస్టులకు సరి కొత్త వైబ్స్ ఇస్తుంది. వానాకాలంలో ఇక్కడి ఆకాశం,సముద్రం రంగులు మారి ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తాయి.

4. ఉదయ్‌పూర్ టు మౌంట్ అబు :

రాజస్థాన్ అంటే.. కేవలం ఎడారి మాత్రమే కాదు.వర్షాకాలంలో ఉదయ్‌పూర్ నుండి మౌంట్ అబు వెళ్లే.. రూట్ చూస్తే ఎవరైనా సరే నోరెళ్లబెట్టాల్సిందే. ఆరావళి పర్వత శ్రేణులు వానాకాలంలో.. పూర్తిగా పచ్చటి తివాచీ పరిచినట్లు మారిపోతాయి. ఈ ఘాట్ రోడ్డులో ప్రయాణం చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది.

Also Read: తెలంగాణలో టాప్ జలపాతాలు..ఈ వర్షాకాలంలో అస్సలు మిస్ అవ్వకూడని క్రేజీ స్పాట్స్!

వర్షాకాలం రోడ్ ట్రిప్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

వానాకాలంలో.. లాంగ్ డ్రైవ్స్ ఎంత కిక్ ఇస్తాయో, అంతే ప్రమాదకరం కూడా. అందుకే ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోండి.

టైర్లు & బ్రేకులు: ట్రిప్ స్టార్ట్ చేసే ముందే మీ వెహికిల్ టైర్లు, బ్రేకులు, వైపర్స్ కరెక్ట్‌గా పనిచేస్తున్నాయో లేదో చెక్ చేసుకోండి. వర్షంలో రోడ్లు బాగా జారతాయి.

ల్యాండ్‌స్లైడ్స్ : భారీ వర్షాలు పడేటప్పుడు హిల్ స్టేషన్లకు వెళ్లే రూట్లలో కొండచరియలు విరిగిపడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వెళ్లే ముందు లైవ్ వెదర్ రిపోర్ట్ చూసుకోవడం బెటర్.

స్పీడ్ లిమిట్: ఘాట్ రోడ్లలో పొగమంచు వల్ల ముందున్న వాహనాలు కనిపించవు, కాబట్టి ఫాగ్ లైట్స్ ఆన్ చేసి, తక్కువ స్పీడ్‌తో వెళ్లడం సేఫ్.

సిటీ లైఫ్ రొటీన్ ఒత్తిడి నుంచి బయటపడటానికి, ప్రకృతికి దగ్గరగా వెళ్లడానికి వర్షాకాలపు రోడ్ ట్రిప్ ఒక బెస్ట్ థెరపీలా పనిచేస్తుంది.

Related News

దేశంలో ఫస్ట్ హైస్పీడ్ టెస్ట్ ట్రాక్ రెడీ.. వందే భారత్‌కు మించి వేగంతో దూసుకెళ్లనున్న రైళ్లు!

సముద్రంలో ఈ పసుపు గుర్తు కనిపిస్తే జాగ్రత్త! ఎందుకో తెలుసా?

మహారాష్ట్రలో ఆటో, క్యాబ్ డ్రైవర్లకు మరాఠీ తప్పనిసరి ఎందుకు చేశారు? కారణాలేంటీ?

బ్రిటీషర్ల నాటి వైభవం.. మన దేశంలోనూ ‘లండన్’ ఉందోచ్.. విశేషాలు ఇవే!

మెట్రో రైలుకు గ్లోబల్ గుర్తింపు, ఆ సర్టిఫికేషన్ సాధించిన తొలి సంస్థగా..

అమృత్ భారత్ రైళ్లలో సూపర్ స్పెసిలిటీస్.. వెర్షన్ 3.0 చూస్తే మతిపోవాల్సిందే!

రాఖీ పండుగ వేళ రైల్వే గుడ్ న్యూస్.. స్పెషల్ ట్రైన్స్ వచ్చేస్తున్నాయ్!

రైల్వే బెడ్‌ షీట్లు కొట్టేసి.. శాలువాలుగా కప్పుకొని.. నెట్టింట వీడియో వైరల్!

Big Stories

Advertisement
×