Kapil Sharma Cafe: బాలీవుడ్ ఇండస్ట్రీలో హాస్య నటుడిగా, యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో కపిల్ శర్మ (Kapil Sharma)ఒకరు. ఈయన కపిల్ శర్మ టాక్ షో ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్న కపిల్ శర్మ మరోవైపు వ్యాపార రంగంలో కూడా దూసుకుపోతున్నారు. ఇప్పటికే పలు వ్యాపారాలు ప్రారంభించిన ఈయన ఇటీవల కెనడాలో ఒక కేఫ్ (Cafe)ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేఫ్ ప్రారంభించిన కొద్ది రోజులకే ఈ కేఫ్ పై ఉగ్రవాదులు దాడి(Terror Attack) చేయడంతో ఇది కాస్త సంచలనంగా మారింది. అసలు కపిల్ శర్మ కేఫ్ పై ఉగ్ర దాడి జరగడం ఏంటి? దాడి వెనుక ఉన్నది ఎవరు? కేఫ్ పై దాడి చేయాల్సిన అవసరం ఏంటీ? అనేక విషయానికి వస్తే..
9సార్లు కాల్పులు..
కెనడాలో(Canada) కపిల్ శర్మ కాప్స్ కేఫ్(Kaps Cafe) పేరుతో రెస్టారెంట్ ప్రారంభించారు. అయితే రెస్టారెంట్ బిజినెస్ లో ఇది తొలి అడుగు కావటం విశేషం. కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలో ఉన్న ఈ కేఫ్ కొన్ని రోజుల క్రితం ఎంతో ఘనంగా ప్రారంభించారు. ఎంతో విజయవంతంగా ఈ కేఫ్ బిజినెస్ సాగుతుంద నేపథ్యంలో ఒక్కసారిగా ఉగ్రదాడి జరిగింది. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో భాగంగా కెనడా కాలమానం ప్రకారం బుధవారం రాత్రి కేఫ్ బయట ఒక వ్యక్తి కారులో కూర్చుని కిటికీ నుంచి కేఫ్ వైపు తుపాకి గురిపెడుతూ ఏకంగా 9 కాల్పులు జరిపినట్టు తెలుస్తుంది.
మనస్థాపానికి గురికావటమే కారణమా…
ఇలా ఒక్కసారిగా కాల్పులు జరగడంతో అక్కడ గందరగోళం వాతావరణ పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ కాల్పులలో భాగంగా ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలుస్తుంది. అయితే ఈ కాల్పులకు దాడి చేసి వ్యక్తి ఎవరనే విషయానికి వస్తే…లడ్డి ఉగ్రవాద నిరోధక సంస్థ NIA మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులలో ఒకడని, అలాగే బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్‌తో సంబంధం కలిగి కలిగి ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఈయన కాల్పులు జరపడానికి కారణం లేకపోలేదు. గతంలో కపిల్ శర్మ ఈయన గురించి చేసిన ఒక ప్రకటన కారణంగా తీవ్రమైన మనస్థాపానికి గురి అయ్యారని, దీంతో కాల్పులకు పాల్పడినట్టు తెలుస్తుంది.
హెచ్చరించిన నిఘా సంస్థ…
కాల్పుల ఘటన తర్వాత పోలీసులు ఫోరెన్సిక్ నిపుణులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఇక ఈ ఘటనకు సరైన కారణం ఏంటి అనేది తెలియాల్సి ఉంది.గత నెలలో కెనడాలోని అత్యున్నత నిఘా సంస్థ, కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ ఒక నివేదికలో, ఖలిస్తానీ ఉగ్రవాదులు భారతదేశ పట్ల హింసాత్మక చర్యలకు ప్రణాళికలు రచిస్తున్నారని తెలియజేశారు. ఇలా కెనడా అత్యంత నిఘా సంస్థ ఈ విషయాన్ని తెలియజేసిన కొద్ది రోజులకి కేఫ్ పై దాడి జరగడంతో ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయి. ఇలా కెనడాలో ఉన్నటువంటి తన కేఫ్ పై దాడి జరగడంతో ఈ విషయం కాస్త బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పెద్ద ఎత్తున చర్చలకు కారణం అవుతుంది. మరి ఈ ఘటన పట్ల కపిల్ శర్మ స్పందన ఏంటో తెలియాల్సి ఉంది. ఈ కాల్పుల వల్ల ఏ విధమైనటువంటి ప్రాణనష్టం జరగకపోయినా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగిందని తెలుస్తోంది.