E-Paper
Advertisement

ఆంధుల ఆసియా కప్.. టీమిండియాపై పాకిస్తాన్ సూపర్ విక్టరీ, రెచ్చగొట్టే సెలబ్రేషన్స్ చేసిన ప్లేయర్లు

ఆంధుల ఆసియా కప్.. టీమిండియాపై పాకిస్తాన్ సూపర్ విక్టరీ, రెచ్చగొట్టే సెలబ్రేషన్స్ చేసిన ప్లేయర్లు
Advertisement

Blind T20 Asia Cup 2026 IND VS PAK:  అంధుల టీ20 ఆసియా కప్ 2026 టోర్నమెంట్ లో ( Blind T20 Asia Cup 2026) పాకిస్తాన్ జట్టు బిగ్ విక్టరీ అందుకుంది. ఢాకాలోని బసుంధర అన్వర్ క్రికెట్ స్టేడియం వేదికగా మంగళవారం జరిగిన కీలక మ్యాచ్ లో టీమిండియా అంధుల జట్టుపై ఒకే ఒక్క వికెట్ తేడాతో విజయాన్ని సాధించింది. ఇక ఈ విక్టరీతో అంధుల టీ20 ఆసియా కప్ 2026 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ కు అర్హత సాధించింది పాకిస్తాన్. ఇక ఈ తరుణంలోనే టీమిండియా ప్లేయర్లను రెచ్చగొడుతూ, పాకిస్తాన్ ప్లేయర్లు సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అండర్ 19 ఆసియా కప్ ఫైనల్ సందర్భంగా భారత యువ క్రికెటర్లు రెచ్చగొట్టిన తరుణంలో తాజాగా దాయాది అంధుల జట్టు ప్రతీకారం తీర్చుకుందని పాక్ సోషల్ మీడియాలో ప్రచారం కూడా మొదలైంది.

ఉత్కంఠ పోరులో 1 వికెట్ తేడాతో పాకిస్తాన్ విక్టరీ

అంధుల టీ20 ఆసియా కప్ 2026 టోర్నమెంట్ లో ( Blind T20 Asia Cup 2026) నేపథ్యంలో ఇవాళ పాకిస్తాన్ వర్సెస్ టీమిండియా మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా అంధుల జట్టు.. నిర్ణీత 20 ఓవర్లు ఆడింది. ఈ తరుణంలోనే 6 వికెట్లు నష్టపోయిన టీమిండియా, 179 పరుగులు సాధించింది. దుర్గారావు 62, సంజయ్ కుమార్ 30, డి. వెంకటేష్ 26 పరుగులు సాధించారు. ఇక ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలోనే చివరి వరకు పోరాడిన పాకిస్తాన్.. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. దీంతో ఫైనల్ లోకి కూడా దూసుకెళ్లింది.

Advertisement

Months After Mustafizur Rahman Controversy, 7 Bangladesh Players Register For IPL 2027 Auctionఐపీఎల్‌లోకి బంగ్లాదేశ్ క్రికెటర్లు రీ-ఎంట్రీ…బీసీసీఐ పెద్దలను తరిమికొట్టాలంటూ ట్రోలింగ్ ?

అంధుల టీ20 ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్ ఎప్పుడంటే ?

అంధుల టీ20 ఆసియా కప్ 2026 ఫైనల్ ( Blind T20 Asia Cup 2026 ) మ్యాచ్ నవంబర్ 20న జరుగనుంది. ఈ ఫైనల్ నేపథ్యంలో ఇప్పటికే పాకిస్తాన్ అంధుల జట్టు తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. నవంబర్ 19న బంగ్లాదేశ్ వర్సెస్ టీమిండియా అంధుల జట్ల మధ్య బిగ్ ఫైట్ జరుగనుంది. ఇందులో గెలిచిన టీమ్, ఫైనల్ కు చేరుకుంటుంది. అప్పుడు పాకిస్తాన్ తో ఫైనల్ ఢాకాలోని బసుంధర అన్వర్ క్రికెట్ స్టేడియం వేదికగా ఆడనుంది. బంగ్లాదేశ్, టీమిండియా బలా బలాలు పరిశీలిస్తే, మన జట్టుకే అడ్వాంటేజ్ కనిపిస్తోంది. అయితే, సొంత మైదానమైన నేపథ్యంలో బంగ్లాదేశ్ జట్టును తక్కువ అంచనా వేయొద్దని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. బంగ్లాను చిత్తు చేసి, టీమిండియా ఫైనల్ కు చేరాలని క్రికెట్ ఫ్యాన్స్ కోరుతున్నారు. మంగళవారం పాకిస్తాన్ చేతిలో ఎదురైన ఓటమికి ఫైనల్ లో ప్రతీకారం తీర్చుకోవాలని పేర్కొంటున్నారు. మరి ఏ జట్టు గెలుస్తుందో చూడాలి.

Advertisement

Fatima Sana Ahead Of Babar Azam? Ex-Pakistan Selector’s Explosive Verdict Sparks Debate : ఫాతిమా ప్రవాహంలో స్మృతి, హర్మన్ కొట్టుకుపోతారు..WPL వేలంలో సనా రూ.10 కోట్లు పలకడం పక్కా!

Related News

పాకిస్తాన్ క్రికెట్‌లో జీరోలు తప్ప, హీరోలు ఒక్కడూ లేడు.. అందుకే మ్యాచ్‌లు ఎవడూ చూడటం లేదు

జాకబ్ బెథెల్ మాములోడు కాదు.. 2030 ఐపీఎల్ నాటికి రూ.150 కోట్లు కొల్లగొడతాడు

నవంబర్ 22న టీమిండియాకు జీవితాంతం గుర్తుండిపోయేలా ఓటమిని రుచి చూపిస్తాం

అమిత్ షా కొడుకనే ఐసీసీ చైర్మ‌న్ కూర్చీలో జై షాను కూర్చోబెట్టారు!

2023లో ధోనిని చెన్నై ప్లేయ‌ర్లు ప‌చ్చి బూతులు తిట్టాడు..ఆకాశ్ చోప్రా సంచ‌ల‌నం

ట్రావిస్ హెడ్ పోతే ఏంటి? భ‌యంక‌ర‌మైన కాటేర‌మ్మ కొడుకుల‌ను దించుకున్న కావ్య పాప‌

జై షా కార‌ణంగా టీమిండియా, పాకిస్తాన్ క్రికెట‌ర్లు త‌న్నుకు చస్తున్నారు!

ధోనిని జ‌న్మ‌లో క్ష‌మించ‌ను…ఐపీఎల్ రిటైర్మెంట్ పై యోగరాజ్ సింగ్ ఫైర్

Big Stories

Advertisement
×