E-Paper
Advertisement

వెకేషన్ వెళుతున్నారా? హోటల్ లేదా ఎయిర్‌బిఎన్‌బి ఏది బుక్ చేసుకోవాలి.. ఏది బెటర్?

వెకేషన్ వెళుతున్నారా? హోటల్ లేదా ఎయిర్‌బిఎన్‌బి ఏది బుక్ చేసుకోవాలి.. ఏది బెటర్?
Advertisement

Hotel Or Airbnb| వెకేషన్ ప్లాన్ చేస్తున్నప్పుడు ముందుగా గుర్తొచ్చేది ఎక్కడికి వెళ్లాలి? ఎంత బడ్జెట్ కేటాయించాలి? అనే ప్రశ్నలు. అయితే ప్రయాణంలో ఎక్కడ బస చేయాలనేది కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా హోటల్ బుక్ చేసుకోవాలా? ఎయిర్‌బిఎన్‌బి ఎంచుకోవాలా? అనే విషయంలో చాలామంది సందిగ్ధంలో పడుతుంటారు. కొందరికి హోటల్‌లో లభించే సౌకర్యాలు ఇష్టం. మరికొందరు ఇంటిలాంటి వాతావరణంలో ఉండటానికి ఇష్టపడతారు. కుటుంబంతో వెళ్తున్నారా? స్నేహితులతో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఒంటరిగా ప్రయాణిస్తున్నారా? అనే విషయాలపై మీ ఎంపిక ఆధారపడి ఉంటుంది. మరి హోటల్, ఎయిర్‌బిఎన్‌బి మధ్య అసలు తేడాలు ఏమిటి? మీ అవసరాలకు ఏది సరైనదో ఇప్పుడు తెలుసుకుందాం.

హోటల్‌లో బస చేస్తే లభించే సౌకర్యాలు

హోటల్ అంటే ప్రయాణికులు డబ్బు చెల్లించి ఉండటానికి వీలుగా ఏర్పాటు చేసిన గదులు. సాధారణంగా ఇక్కడ బెడ్, బాత్రూమ్, రూమ్ సర్వీస్, హౌస్ కీపింగ్, రిసెప్షన్ వంటి సౌకర్యాలు ఉంటాయి. కొన్ని హోటళ్లలో రెస్టారెంట్లు, ఉచిత బ్రేక్‌ఫాస్ట్ వంటి అదనపు సదుపాయాలు కూడా లభిస్తాయి. హోటల్‌లో ఉండటం వల్ల రోజువారీ పనుల గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు. గదులను శుభ్రం చేయడం, ఇతర అవసరాలను చూసుకోవడం హోటల్ సిబ్బంది బాధ్యత. అందుకే తక్కువ రోజులు ప్రయాణించేవారికి హోటళ్లు మంచి ఎంపికగా ఉంటాయి.

ఎయిర్‌బిఎన్‌బిలో బస చేస్తే ఇంట్లో ఉన్న అనుభూతి

Advertisement

ఎయిర్‌బిఎన్‌బి అనేది ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, విల్లాలు లేదా ప్రత్యేక గదులను అద్దెకు తీసుకునేందుకు ఉపయోగించే ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్. ఇందులో మీ అవసరాన్ని బట్టి మొత్తం ఇంటిని లేదా ఒక గదిని బుక్ చేసుకోవచ్చు.
కొన్ని ఎయిర్‌బిఎన్‌బి ప్రాపర్టీలలో కిచెన్, లివింగ్ రూమ్, ప్రత్యేక బెడ్‌రూమ్‌లు ఉంటాయి. దీంతో ఇంట్లో ఉన్నట్లుగా సౌకర్యంగా గడపవచ్చు. ఎక్కువ రోజులు ఉండేవారికి ఈ ఎంపిక ఉపయోగకరంగా ఉంటుంది.

హోటల్, ఎయిర్‌బిఎన్‌బి మధ్య ధరల్లో తేడా

బడ్జెట్ ఆధారంగా కూడా ఈ రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకోవచ్చు. కుటుంబం లేదా స్నేహితులతో వెళ్తే ఎయిర్‌బిఎన్‌బిలె మొత్తం అపార్ట్‌మెంట్ తీసుకుని ఖర్చు షేర్ చేసుకోవచ్చు. హోటళ్లలో ఎక్కువ మంది ఉంటే ప్రత్యేక గదులు బుక్ చేయాల్సి రావచ్చు. భోజనం, ఇతర సౌకర్యాలకు అదనపు చార్జీలు కూడా ఉంటాయి. అయితే అసలు ఖర్చు ప్రదేశం, సౌకర్యాలు, బుకింగ్ ధరపై ఆధారపడి ఉంటుంది.

ప్రైవెసీ, ఎక్కువ స్థలం కావాలంటే ఏది ఎంచుకోవాలి?

Advertisement

ఎయిర్‌బిఎన్‌బిలో మొత్తం ఇల్లు లేదా అపార్ట్‌మెంట్ తీసుకుంటే అందరూ కలిసి ఉండవచ్చు. ప్రత్యేక గదులు, కిచెన్ వంటి సౌకర్యాలు కూడా లభించవచ్చు. హోటళ్లలో సాధారణంగా వ్యక్తిగత గదులకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది.

Also Read: మా దేశానికి రండి మా పౌరులను ప్రేమించండి.. లవ్ చేయాలనుకునేవారికి ఉచిత ఫారిన్ ట్రిప్..

చెక్‌ఇన్, చెక్‌అవుట్ విధానాలు ఎలా ఉంటాయి?

హోటళ్లలో చెక్‌ఇన్, చెక్‌అవుట్ సమయాలు ముందుగానే నిర్ణయిస్తారు. రిసెప్షన్ వద్దకు వెళ్లి సులభంగా చెక్‌ఇన్ చేయవచ్చు. అవసరమైతే ముందుగా గది ఇవ్వాలని లేదా ఆలస్యంగా ఖాళీ చేయడానికి అనుమతి కోరవచ్చు.

ఎయిర్‌బిఎన్‌బిలో మాత్రం ఒక్కో ప్రాపర్టీకి ఒక్కో విధానం ఉంటుంది. కొందరు హోస్ట్‌లు స్వయంగా తాళాలు అందిస్తారు. మరికొందరు డిజిటల్ లాక్ లేదా సెల్ఫ్ చెక్‌ఇన్ సదుపాయం కల్పిస్తారు.

Also Read: మీ లవర్ ఆన్‌లైన్‌లో ఉన్నా మెసేజ్‌కు రిప్లై ఇవ్వడం లేదా? దీనికి కారణం ఇదే

మీ వెకేషన్‌కు ఏది సరైన ఎంపిక?

తక్కువ రోజుల ప్రయాణం, ఒంటరి ప్రయాణికులు లేదా చిన్న గ్రూపులకు హోటళ్లు అనుకూలంగా ఉంటాయి. ఎక్కువ మంది కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో వెళ్తే ఎయిర్‌బిఎన్‌బి మంచి ఎంపిక కావచ్చు. ఎక్కువ రోజులు ఉండేవారికి కూడా ఇది సౌకర్యంగా ఉంటుంది. అందుకే బుకింగ్ చేసే ముందు మీ బడ్జెట్, ప్రయాణ రోజులు, వ్యక్తుల సంఖ్య, అవసరాలను పరిశీలించండి. అప్పుడే మీ వెకేషన్‌ను మరింత సౌకర్యవంతంగా ఆస్వాదించగలుగుతారు.

Related News

ఒంటరిగా ప్రయాణం చేస్తున్నారా? ఈ 4 తప్పులు చేస్తే ప్రమాదమే

ఆత్మవిశ్వాసమే అతని ఆయుధం.. కళ్లు కనిపించకపోయినా ఎవరెస్ట్ ఎక్కేశాడు

ఎయిర్‌పోర్టులో స్పైస్‌జెట్ హైడ్రామా.. 9 గంటలైనా కదలని విమానం!

లక్షద్వీప్ నుంచి అండమాన్ వరకు.. భారత్‌ లో స్కూబా డైవింగ్‌ కు 6 బెస్ట్ ప్లేసెస్ ఇవే!

తాజ్ మహల్ లోకి ఫ్రీ ఎంట్రీ.. పర్యాటకులకు అదిరిపోయే ఆఫర్!

గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న రైలుకు బ్రేకులు పడకపోతే.. ఎలా ఆపుతారో తెలుసా?

బంధువులకు సెండాఫ్ ఇచ్చేందుకు వందేభారత్ ఎక్కారు.. షాకింగ్.. రూ.30 వేల జరిమానా కట్టారు!

Big Stories

Advertisement
×