Dil Raju on Game Changer : టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా సక్సెస్ అందుకున్న దిల్ రాజు(Dil Raju) త్వరలోనే తమ్ముడు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అయితే ఈ సినిమా జులై 4వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో దిల్ రాజుతో పాటు తన సోదరుడు శిరీష్ రెడ్డి(Sirish Reddy) కూడా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూకి హాజరయ్యారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఆయన గేమ్ ఛేంజర్(Game Changer) సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపాయి. గేమ్ ఛేంజర్ సినిమా వల్ల తాము చాలా నష్టపోయామని తెలిపారు.
మా పని అయిపోయిందని హేళన..
ఈ సినిమాకు వచ్చిన నష్టాలు చూసి చాలామంది మా పని అయిపోయింది అంటూ హేళన చేశారు కానీ మరొక మూడు రోజులలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా మమ్మల్ని నిలబెట్టింది. జీవితం కొన్ని రోజులలోనే తారుమారు అయింది అంటూ మాట్లాడారు. అదేవిధంగా గేమ్ ఛేంజర్ సినిమా ఫ్లాప్ అయితే కనీసం హీరో రామ్ చరణ్ (Ram Charan)గానీ డైరెక్టర్ శంకర్ గాని ఫోన్ చేసి మాట్లాడించిన సందర్భాలు కూడా లేవంటూ శిరీష్ మాట్లాడిన తీరు మెగా అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. దీంతో సోషల్ మీడియా వేదికగా మెగా అభిమానులు శిరీష్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు.
శిరీష్ ఉద్దేశం అది కాదు..
ఇలా తన సోదరుడు చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో దిల్ రాజు ఒక ఇంటర్వ్యూ సందర్భంగా వివరణ ఇచ్చారు. తాను తమ్ముడు సినిమా (Thammudu)ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టినప్పటి నుంచి గేమ్ ఛేంజర్ సినిమాకు సంబంధించి ప్రశ్నలు లేకుండా తన ఇంటర్వ్యూ పూర్తి కాలేదని తెలిపారు. ఇక నిన్న తన బ్రదర్ శిరీష్ చేసిన వ్యాఖ్యల గురించి ఈయన మాట్లాడుతూ..గేమ్ ఛేంజర్ సినిమాకు శిరీష్ కు ఏమాత్రం సంబంధం లేదని తెలిపారు. ఈ సినిమా బాధ్యతలు అన్నీ నేను చూసుకోగా ఆయన సంక్రాంతికి వస్తున్నాం బాధ్యతలను చూసుకున్నారని తెలిపారు. అదేవిధంగా రామ్ చరణ్ గురించి ఆయన మాట్లాడిన తీరు తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన ఉద్దేశం అది కాదు అంటూ వివరణ ఇచ్చారు.
చరణ్.. చిరంజీవికి కృతజ్ఞతలు చెప్పాలి…
శిరీష్ మొదటిసారి ఇంటర్వ్యూకి హాజరయ్యారు దీంతో ఎలా మాట్లాడాలి? ఏంటి? అని తెలియక కన్ఫ్యూజన్లో మాట్లాడారే తప్ప రామ్ చరణ్ ను అనాలనే ఇంటెన్షన్ మాత్రం లేదని, తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుంటూ మెగా ఫ్యాన్స్ విమర్శలు చేస్తున్నారని దిల్ రాజు తెలిపారు. నిజానికి గేమ్ ఛేంజర్ అనుకోని విధంగా ఆలస్యమైంది. RRR సమయంలోనే రామ్ చరణ్ గారు మాకు డేట్స్ ఇచ్చారు మధ్యలో ఇండియన్ 2 రావటం వల్ల ఈ సినిమా ఆలస్యమైంది. ఇదే విషయం గురించి చరణ్ దగ్గర మాట్లాడుతూ.. చరణ్ సినిమా ఆలస్యం అయ్యేలాగా ఉంది. మీరు ఏదైనా ఇంకో ప్రాజెక్టు ఉంటే చేసుకోండి అని చెప్పాను కానీ అదేది వినకుండా చరణ్ ఈ సినిమా కోసం తన సమయం కేటాయించారు. ఇక సంక్రాంతి వస్తున్నాం సినిమా విడుదల సమయంలో కూడా చిరంజీవి గారు రామ్ చరణ్ గారిని అడిగే మేము విడుదల చేశామని అందుకు వారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు చెప్పుకోవాలి. మాకు ఇంత మేలు చేసిన హీరో గురించి ఎందుకు మేము విమర్శిస్తాము అంటూ ఈయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
Also Read: Prabhas: హీరో ప్రభాస్ కు ప్రమాదం… ఫౌజీ షూటింగ్లో గాయపడ్డ హీరో?