BigTV English

Prabhas: హీరో ప్రభాస్ కు ప్రమాదం… ఫౌజీ షూటింగ్లో గాయపడ్డ హీరో?

Prabhas: హీరో ప్రభాస్ కు ప్రమాదం… ఫౌజీ షూటింగ్లో గాయపడ్డ హీరో?

Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas)ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అవుతూ క్షణం తీరిక లేకుండా ఎంతో బిజీగా గడుపుతున్నారు. బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా క్రేజీ సొంతం చేసుకున్న ఈయన తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే చేస్తున్నారు. ఇక త్వరలోనే మారుతి దర్శకత్వంలో నటించిన ది రాజా సాబ్(The Raja Saab) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా డిసెంబర్ ఐదవ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్ కు మంచి ఆదరణ లభించింది. ఇకపోతే ఇటీవల ప్రభాస్ కన్నప్ప సినిమాలో రుద్ర పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.


ఫౌజీ సెట్లో ప్రమాదం?

ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్న ప్రభాస్ కి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సాధారణంగా సినిమా షూటింగ్ సమయంలో అనుకోని ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి అయితే తాజాగా ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ సినిమా (Fauji Movie)షూటింగ్ సమయంలో ప్రమాదం చోటు చేస్తుందని ఈ ప్రమాదంలో భాగంగా ప్రభాస్ గాయాల పాలయ్యారు అంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ ప్రమాదంలో భాగంగా ప్రభాస్ కాలికి గాయం తగిలిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ప్రభాస్ అభిమానులు ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ప్రభాస్ కాలికి గాయం?

మరి పౌజీ సినిమా షూటింగ్ సెట్లో ఎలాంటి ప్రమాదం జరిగింది ఏంటి అనే విషయాల గురించి చిత్ర బృందం ఎక్కడ వెల్లడించలేదు. అలాగే ప్రభాస్ టీం కూడా ఇప్పటివరకు ఎక్కడ ఈ విషయం గురించి తెలియజేయలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త వైరల్ గా మారడంతో అభిమానులు కంగారు వ్యక్తం చేస్తున్నారు. ఇక గతంలో కూడా ప్రభాస్ ఇలా షూటింగ్ లొకేషన్లో ప్రమాదానికి గురి కావడంతో ఆయన మోకాలికి తీవ్రమైన గాయం తగిలింది తద్వారా సర్జరీ కూడా చేయించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు మరోసారి కాలికి గాయం తగిలిందనే విషయం తెలియడంతో అదే కాలికి తగిలిందా? ఏంటి? అనే విషయాలు మాత్రం తెలియడం లేదు.

హర్రర్ కామెడీ థ్రిల్లర్..

ప్రస్తుతం ప్రభాస్ గాయాలు పాలయ్యారనే వార్త అందరిని ఆందోళనకు గురిచేస్తుంది. ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలి అంటే చిత్రబృందం లేదా ప్రభాస్ టీం వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రభాస్ ఫౌజీ సినిమాను హను రాఘవపూడి(Hanu Raghavapudi) దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఇమాన్వీ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది . ఇక ప్రభాస్ ప్రస్తుతం ఫాజీ సినిమాతో పాటు సలార్ 2, కల్కి 2, స్పిరిట్ వంటి సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. గత ఏడాది కల్కి ద్వారా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రభాస్ త్వరలోనే ది రాజా సాబ్ అనే హర్రర్ కామెడీ త్రిల్లర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Also Read: King Dom Release Date: కింగ్ డం రిలీజ్ డేట్ లాక్…మాట నిలబెట్టుకున్న వంశీ!

Related News

Mass Jathara : మాస్ జాతర టీం కు లీగల్ నోటీసులు, నిర్మాత వంశీకి దెబ్బ మీద దెబ్బ

Sreeleela: శ్రీలీలా హీరోయిన్ అవ్వడం వెనక ఎన్టీఆర్, బిగ్గెస్ట్ ట్విస్ట్ రివీల్ చేసిన శ్రీలీలా మదర్

Nithiin: పాపం నితిన్… హిట్ కోసం మళ్ళీ ఆ దర్శకుడును నమ్ముకుంటున్నాడు

Nara Rohit: పొలిటికల్ ఎంట్రీపై హీరో క్లారిటీ.. ఆ అపోహలకు చెక్!

Priyanka Chopra: బాలీవుడ్ పై గ్లోబల్ బ్యూటీ అసహనం.. ఆ మార్పు రావాలంటూ?

Kantara Chapter 1: తెలుగు స్టేట్స్ లో భారీ డీల్.. ప్రీక్వెల్ కి అంత అవసరమా?

Big Stories

×