Dil Raju Wife Tejaswini: ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ దిల్ రాజు (Dil Raju) భార్యగా తేజస్విని (Tejaswini) కి మంచి గుర్తింపు ఉంది. అయితే అలాంటి తేజస్విని రీసెంట్ గా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ప్రేమ, పెళ్లి , ఇష్టమైన హీరో ఇలా అన్ని విషయాలను ఓపెన్ గానే చెప్పేసింది.మరి ఇంతకీ చిన్నప్పటి నుండి తేజస్విని ఇష్టపడ్డ ఆ హీరో ఎవరు? ఆ హీరోని ఎప్పుడైనా కలిసిందా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
మళ్లీ ప్రేమ వివాహం చేసుకున్న దిల్ రాజు..
దిల్ రాజు మొదట అనిత రెడ్డి(Anitha Reddy)ని వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కూతురు పుట్టి, కూతురికి పెళ్లయ్యాక అనిత హఠాత్తుగా గుండెపోటుతో మరణించింది. ఆ తర్వాత మూడు సంవత్సరాలకు దిల్ రాజు (వైగా రెడ్డి) తేజస్వినిని ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. వీరిది లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్..
దిల్ రాజు రెండో భార్య తేజస్విని ఫేవరెట్ హీరో ఎవరంటే?
అయితే తాజాగా తేజస్విని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాకు చిన్నప్పటినుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఒక రకమైన ఇష్టం. చిన్నప్పుడు ఖుషి సినిమా (Khushi Movie) చూసినప్పుడే ఆయన థిక్ హెయిర్, లుక్ కి నేను ఫిదా అయిపోయాను. అప్పట్లో ఉండే ఏజ్ అలాంటిది.. కాబట్టి ఆ టైంలోనే నేను పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ని తెగ ఇష్టపడిపోయాను. ఒక్కసారైనా పవన్ కళ్యాణ్ ని కలవాలని అప్పటినుండే ఫిక్స్ అయ్యాను. పవన్ కళ్యాణ్ ఎవరైనా బాధలో ఉన్నారంటే అస్సలు సహించలేడు. ఏదైనా సిచ్యువేషన్ గురించి చెబితే చాలా ఎమోషనల్ అయి.. ఆ బాధ తనదే అన్నట్లుగా ఆ స్థానంలో ఉండి ఆలోచిస్తాడు. ఎదుటి వాళ్ళ బాధను తెలుసుకొని వాళ్ళ ప్లేస్ లోకి వెళ్లి అలోచించి కన్నీళ్లు పెట్టుకుంటారు. అలాంటి బాధలో నుండి వచ్చిన మాటలే మనం చాలా సందర్భాల్లో ఆయన నుండి విన్నాం..
దిల్ రాజు పై ఒత్తిడి తెచ్చి మరీ ఇష్టమైన హీరోని కలిసిన తేజస్విని..
అలాగే నేను పెళ్లి తర్వాత చూసిన మొదటి సినిమా వకీల్ సాబ్ (Vakeel Saab). ఈ సినిమా షూటింగ్ టైంలో పవన్ కళ్యాణ్ ని కలవాలని దిల్ రాజును ఒత్తిడి చేశాను. అయితే పవన్ కళ్యాణ్ కి టైమ్ కుదరదని దిల్ రాజు గారు చెప్పినా కూడా వినకుండా ఫోర్స్ చేసి మరీ ఆయన్ని కలిసేలా చూడమని చెప్పాను. అయితే ఈ విషయం చెప్పడంతోనే పవన్ కళ్యాణ్ కూడా ఒప్పుకున్నారు. అలా వకీల్ సాబ్ సినిమా షూట్ సమయంలో నాకు పవన్ కళ్యాణ్ ని ప్రత్యక్షంగా కలిసే అవకాశం వచ్చింది అంటూ దిల్ రాజు భార్య తేజస్విని(Tejaswini) ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
దిల్ రాజు – తేజస్విని ప్రేమ, పెళ్లి..
ఇక దిల్ రాజు – తేజస్వినిల ప్రేమ గురించి చూస్తే.. తేజస్విని ఎయిర్ హోస్టెస్.. అలా దిల్ రాజు ప్రతిసారి ఫ్లైట్ జర్నీ చేస్తున్న సమయంలో తేజస్వినిని చూసి ఇష్టపడ్డారట.ఆమెను దాదాపు సంవత్సరకాలం గమనించి ఆ తర్వాత ఓ రోజు పెన్ కోసం అడిగి అలా అలా మాటలు కలిపారట. అలా ఒక రోజైతే డైరెక్ట్ గా నెంబర్ అడిగి ఫోన్ మాట్లాడడం చేశారట.అయితే అప్పటికి దిల్ రాజు కి పెళ్ళైంది అనే విషయం తేజస్వినికి తెలియదట. ఆ తర్వాత నిన్ను పెళ్లి చేసుకుంటాను.. నాకు ఇలా ఫస్ట్ పెళ్లి అయిందని చెప్పడంతో కాస్త ఆలోచనలో పడిందట. కానీ నిన్ను పెళ్లి చేసుకోవడానికి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. మా పెద్ద మామయ్య,పిన్ని చాలా స్ట్రిక్ట్ అని తేజస్విని చెప్పడంతో దిల్ రాజు నేరుగా వెళ్లి వాళ్ల పెద్ద మామయ్య ని ఒప్పించారట.ఆ తర్వాత కొద్ది రోజులు తేజస్విని వాళ్ల పిన్ని ఒప్పుకోకపోయినప్పటికీ అందర్నీ ఒప్పించి నిజామాబాద్ లోని ఓ టెంపుల్లో తేజస్వినిని పెళ్లి చేసుకున్నారు దిల్ రాజు.. ఇక ఈ జంట కి మూడు సంవత్సరాల కొడుకు కూడా ఉన్నాడు.
ALSO READ:Vishwambhara Movie: మెగా ఫ్యాన్స్ కి చిరాకు తెప్పించే న్యూస్.. విశ్వంభర వచ్చే ఏడాదేనా?