E-Paper
Advertisement

Toxic: యష్ బర్తడే స్పెషల్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న హీరో ఇంట్రడక్షన్ గ్లింప్స్!

Toxic: యష్ బర్తడే స్పెషల్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న హీరో ఇంట్రడక్షన్ గ్లింప్స్!
Advertisement

Toxic:కేజీఎఫ్ 1&2 చిత్రాలతో పాన్ ఇండియా హీరోగా పేరు సొంతం చేసుకున్నారు హీరో యష్ (Yash) . ఈ చిత్రాల తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకొని ఆయన టాక్సిక్(Toxic) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రముఖ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో తాజాగా నేడు హీరో యష్ పుట్టినరోజు సందర్భంగా హీరో పాత్రను పరిచయం చేస్తూ అద్భుతమైన గ్లింప్స్ రిలీజ్ చేశారు. అయితే ఇక్కడ ఈ గ్లింప్స్ ను ఇంగ్లీష్ లో రిలీజ్ చేయడం గమనార్హం. ఇందులో రాయా అనే పవర్ఫుల్ క్యారెక్టర్ లో యష్ నటిస్తున్నట్లు రివీల్ చేశారు.. తాజాగా హీరో క్యారెక్టర్ ను రివీల్ చేస్తూ విడుదల చేసిన ఈ గ్లింప్స్ ప్రేక్షకులలో గూస్ బంప్స్ తెప్పిస్తోంది. మొత్తానికైతే భారీగా యాక్షన్ పెర్ఫార్మెన్స్ తో మరోసారి ఆకట్టుకోవడానికి యష్ సిద్ధమయ్యారని చెప్పవచ్చు.

రాయా పాత్రలో యష్:

ఇంగ్లీషులో విడుదల చేసిన ఈ గ్లింప్స్ హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించారు అంటూ ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు
ముఖ్యంగా హీరో క్యారెక్టర్ ను రివీల్ చేస్తూ రిలీజ్ చేసిన ఈ గ్లింప్స్ చాలా బాగుందని.. ముఖ్యంగా ఇందులో యష్ తన లుక్స్ తో అందరినీ మరోసారి మెస్మరైజ్ చేయబోతున్నారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఇందులో రాయ అనే ఒక పాత్ర ఈసారి ఆయనకు వేలకోట్ల కలెక్షన్లను తెచ్చిపెడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం.

Advertisement

ALSO READ:Poonam Kaur: స్టార్ హీరోయిన్ పై పూనమ్ ఇన్ డైరెక్ట్ కామెంట్.. దొంగ తిరుగుడెందుకు?

టాక్సిక్ సినిమా విశేషాలు..

లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో యష్ హీరోగా నటిస్తూ ఉండగా.. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. నయనతార. తారా సుతారియా, రుక్మిణి వసంత్ , హుమా ఖురేషి, అక్షయ్ ఒబెరాయ్, సుదేవ్ నాయర్ వంటి భారీ తారాగణం ఈ సినిమాలో భాగమైంది. ఈ చిత్రాన్ని వెంకట కే నారాయణ, యష్ సంయుక్తంగా కేవీఎన్ ప్రొడక్షన్స్ , మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. ఈ ఏడాది మార్చి 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇకపోతే ఈ సినిమాలో రాయ పాత్రలో యష్ , గంగా పాత్రలో నయనతార, నదియా పాత్రలో కియారా అద్వానీ, రెబెక్కా, పాత్రలో తార సుతారియా, మెల్లిసా గా రుక్మిణి వసంత్ ఎలిజిబెత్ పాత్రలో హుమా ఖురేషి నటిస్తున్నారు. ఇప్పటికే వీరి పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లను కూడా రిలీజ్ చేస్తూ ఆకట్టుకున్నారు గీతూ మోహన్ దాస్. ఈ సినిమాతో రికార్డులు క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందించారు. ఇకపోతే ఈ సినిమా పాన్ ఇండియా భాషలు కన్నడ, తెలుగు, తమిళ్, హిందీ , మలయాళం తో పాటు ఇంగ్లీష్ లో కూడా విడుదల కాబోతోంది.

గ్లింప్స్ ఎలా ఉందంటే?

Advertisement

గ్లింప్స్ ఎలా ఉంది అనే విషయానికొస్తే హీరో క్యారెట్రైజేషన్ ని పరిచయం చేశారు. ఒక స్మశానంలో మాఫియా డాన్ తన కొడుక్కి దహన సంస్కారాలు జరిపిస్తుండగా.. రాయ అక్కడికి కారులో వస్తాడు. దాని నుంచి వైర్ల ద్వారా స్మశానం లోపల డైనమైట్లు పెట్టించి కారు నుండి బయటకు రాకుండానే బాంబులు పేల్చేస్తాడు. మామూలుగా హాలీవుడ్ వెబ్ సిరీస్ లో కనిపించే అడల్ట్ టైపు కంటెంట్ ఇక్కడ చూపించడం ఆశ్చర్యం కంటే మరింత షాక్ కలిగిస్తోంది. నిజానికి ఆశించినట్టే మాస్ అవతారంలో అభిమానులు కోరుకున్నట్టే ఉన్నాడు కానీ అలాంటి హాలీవుడ్ అడల్ట్ సన్నివేశాలను ఇక్కడ ఈ గ్లింప్స్ చూపించడం విమర్శలకు దారి తీసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరి దీనిపై ఇటు నెటిజన్స్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

 

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×