Director Bobby Review on Mana Shankara Varaprasad Garu: మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారూ’. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సరిలేరు నీకేవ్వరు, ఎఫ్ 2, ఎఫ్ 3, సంక్రాంతికి వస్తున్నాం వంటి వరుస బ్లాక్‌బస్టర్స్ తర్వాత అనిల్ రావిపూడి చేస్తున్న చిత్రమిది. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా ఇందులో చిరు వింటేజ్ లుక్తో మూవీపై విపరీతమైన బజ్ క్రియేట్ చేసింది. ఇటీవల చిరంజీవి బర్త్డే సందర్భంగా విడుదలైన గ్లింప్స్.. మూవీపై అంచనాలను రెట్టింపు చేసింది. అంతేకాదు రోజురోజుకు మన శంకర వరప్రసాద్ నుంచి బయటకు వస్తున్న అప్డేట్స్.. మరి హైప్ ఇస్తున్నాయి.
దాదాపు ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. ఇప్పటికే పోస్టర్స్, చిరు లుక్తో మన శంకర వరప్రసాద్ గారుపై హిట్ టాక్ మొదలైంది. ఇక తాజాగా డైరెక్టర్ బాబీ చేసిన కామెంట్స్తో బొమ్మ బ్లాక్‌బస్టర్ అంటున్నారు. తాజాగా కిష్కింధపూరి మూవీ సక్సెస్ మీట్లో పాల్గొన్న డైరెక్టర్ బాబీ.. మన శంకరవరప్రసాద్ మూవీపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్లు హీరోహీరోయిన్లుగా నటించిన కిష్కింధపూరి మూవీ మంచి విజయం సాధించింది. దీంతో మూవీ నేడు మూవీ సక్సెస్ మీట్‌ని నిర్వహించింది.
దీనికి డైరెక్టర్లు బాబీ, అనిల్ రావిపూడి, అనుదీప్ కేవీలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు బాబీ కొల్లి మాట్లాడుతూ.. కిష్కింధపూరి మూవీ విశేషాలను పంచుకున్నాడు. ఇక నిర్మాత సాహు గారపాటిని ఉద్దేశిస్తూ బాబీ ఇలా అన్నాడు. “నిర్మాత సాహు గారపాటి అవసరానికి మంచి మాట్లాడరు.. అవసరానికి మంచి ఖర్చు పెట్టరు.. ఈ ఏడాది ఆయన ‘కిష్కింధపూరి’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టారు. ఈ సంక్రాంతికి కూడా ఆయన అనిల్ రావిపూడితో కలిసి మరో బ్లాక్‌బస్టర్ కూడా కొట్టబోతున్నారు. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మన శంకర వరప్రసాద్ గారూ మూవీలోని కొన్ని సీన్స్ చూశాను. ఈసారి సంక్రాంతికి అద్భుతమైన విజయం మూవీ టీం అందుకోబోతోంది. ఈ సంక్రాంతికి హ్యాజ్ బ్లాక్‌బస్టర్ సిద్దం” అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Also Read: Bigg Boss Telugu 9: రెండోవారం హౌజ్ కెప్టెన్ డిమోన్ పవన్.. డేంజర్ జోన్లో ఉంది ఎవరంటే!
ప్రస్తుతం ఆయన కామెంట్స్ ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని నింపుతోంది. ఇప్పటికే ఈ మూవీ సూపర్ హిట్ అని నమ్ముతున్న ఫ్యాన్స్కి డైరెక్టర్ బాబీ కామెంట్స్ మరింత బలాన్ని ఇచ్చాయి. ఈ మన శంకర వరప్రసాద్ గారూ ఈసారి సూపర్ హిట్ కొట్టబోతున్నారంటూ మెగా ఫ్యాన్స్ అంత కాలర్ ఎగిరేస్తున్నారు. కాగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నయన తార హీరోయిన్గా నటిస్తుండగా.. కెథరిన్ థెస్సా సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇందులో చిరు డబుల్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెలు నిర్మిస్తున్న ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ అతిథి పాత్రలో కనిపించబోతున్నారు.
#ManaShankaraVaraPrasadGaru సినిమా పెద్ద హిట్ కొట్టబోతుంది – Director #Bobby#Chiranjeevi #AnilRavipudi #Kishkindhapuri pic.twitter.com/ElqNM3Frwj
— Telugu FilmNagar (@telugufilmnagar) September 18, 2025