Bigg Boss Telugu 9 Second Week Captain: బిగ్బాస్ 9 తెలుగు రెండో వారంలోకి అడుగుపెట్టింది. మొదటి నుంచి హౌజ్లో వాదనలు, ప్రతి వాదనాలు, గొడవలు, ఆరోపణలతో ఆసక్తిగా మారింది. రోజు రోజుకు సరికొత్త కంటెంట్ ఇస్తూ కంటెస్టెంట్స్ ఆడియన్స్‌కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. సలబ్రిటీలు, కామనర్స్ వార్ మామూలుగా లేదు. సెలబ్రిటీలే కామనర్స్కి చుక్కలు చూపిస్తారని, వారిని సామాన్యులు ఎలా తట్టుకుంటారో అనుకున్నారంత. కానీ, హౌజ్లో అడుగుపెట్టినప్పటి నుంచి కామనర్స్ తగ్గేదే లే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇక బిగ్ బాస్ వారిని హౌజ్ ఓనర్స్ పవర్ ఇవ్వడంతో కామనర్స్ చెలరేగిపోతున్నారు.
ముఖ్యంగా ప్రియా, శ్రీజ దమ్ములను ఆపడం ఎవరి వల్ల కావడం లేదు. రోజురోజుకి వారి తీరు, ఆట ముదురుతోంది. ఇది ఆడియన్స్లోనూ చాలామందికి రుచించడం లేదు. ప్రతి చిన్న విషయంలోనూ వారు దూకుడు చూపిస్తున్నారు. ఏ విషయమైన వాదనకు దిగుతున్నారు. దీంతో వారికి నెగిటివిటీ పెరుగుతోంది. ఇక ప్రస్తుతం ఈ రియాలి షో.. పదకొండవ రోజులో భాగంగా కెప్టెన్సీ టాస్క్కు పోరు మొదలైంది. ఈ టాస్క్లో భాగంగా టెనెంట్స్కి బిగ్బాస్ ఫుల్ పవర్ ఇచ్చారు. ఓనర్స్లో కెప్టెన్ అయ్యే అర్హత ఎవరికి లేదో చెప్పాలని టెనెంట్స్ని ఆదేశించారు. దీంతో టెనెంట్స్(సెలబ్రిటీలు) అంతా చర్చించుకుని ప్రియా, శ్రీజ, సోల్జర్ పవన్ కళ్యాణ్, మాస్క్ మ్యాన్ హరీశ్‌లకు కెప్టెన్ అయ్యే అర్హత లేదని తేల్చేశారు.
దీంతో ఫైనల్గా కెప్టెన్సీ కంటెండర్స్గా టెనెంట్స్ నుంచి భరణి, ఓనర్స్ నుంచి మర్యాద మనిష్, డిమోన్ పవన్‌లు నిలిచారు. ఈ ముగ్గురికి నేడు కెప్టెన్సీ టాస్క్లు జరగనున్నాయి. అయితే ఈ పోరులో డిమోన్ పవన్ గెలిచి కెప్టెన్ అయినట్టు తెలుస్తోంది. దీంతో బిగ్ బాస్ తెలుగు 9 రెండో వారంలో కెప్టెన్గా కామనర్స్ నుంచి డిమోన్ పవన్ కెప్టెన్ అయ్యాడు. దీంతో కామనర్స్ నుంచి కెప్టెన్ అయిన తొలి కంటస్టెంట్గా డియోన్ పవన్ నిలిచాడు. ఇక కెప్టెన్సీ పోరు నుంచి శ్రీజ, ప్రియ, హరిశ్, పవన్ కళ్యాణ్‌లను పక్కన పెట్టడంతో.. సెలబ్రిటీలపై కామనర్స్ విరుచుకుపడ్డారు. ముఖ్యంగా ప్రియా, శ్రీజ దమ్ములు సెలబ్రిటీలపై నోరు పారేసుకున్నారు. కావాలని తమని తప్పించారని, హౌజ్ ఫేవరిటిజం చూపిస్తున్నారంటూ సెలబ్రిటీలపై శ్రీజ, ప్రియలు ఆగ్రహం చూపించారు.
అయితే ఈసారి హౌజ్ నుంచి బయటకు వచ్చేవారిలో కామనర్స్లో ఉన్నట్టు తెలుస్తోంది. రెండో వారం నామినేషన్లో భరణి, సుమన్ శెట్టి, ప్రియ, డిమాన్ పవన్, ఫ్లోరా, మనిష్లు ఉన్నారు. వీరిలో భరణి, సుమన్ శెట్టి ఎక్కువ ఓట్లు పడినట్టు తెలుస్తోంది. అధిక ఓట్లతో వీరు టాప్ 2లో ఉన్నారట. ఆ తర్వాత స్థానాల్లో హరీష్, ఫ్లోరా సైనీకి ఓట్లు పడ్డాయట. దీంతో కామనర్స్లో మనీష్, ప్రియా, డిమోన్ పవన్‌లకు తక్కువ ఓట్లతో డేంజర్ జోన్లో ఉన్నారు. ఈ ముగ్గురిలో డిమోన్ పవన్‌కి కాస్తా పాజిటివిటీ ఉంది. పైగా అతడు కెప్టెన్ అయ్యాడు. కాబట్టి ఈసాని నామినేషన్స్ కూడా అతడు సేఫ్ అయ్యేలా ఉన్నాడు. దీంతో మనీష్, ప్రియాలు ఈ వారం బయటకు వచ్చే వారిలో ఉన్నారు. వీరిద్దరిలో ఎవరో ఒకరు.. ఈ సారి హౌజ్ నుంచి బయటకు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.