AFG Vs SL : ఆసియా కప్ 2025లో భాగంగా ఇవాళ అప్గానిస్తాన్ వర్సెస్ శ్రీలంక జట్లు తలపడుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన అప్గానిస్తాన్ జట్టు ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంది. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే శ్రీలంక ఆడిన రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించి సూపర్ 4 కి అర్హత సాధించింది. మరోవైపు అప్గానిస్తాన్ జట్టు బంగ్లాదేశ్ పై ఓటమి పాలైంది. దీంతో కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసింది. ఈ మ్యాచ్ లో అప్గానిస్తాన్ జట్టు ఓటమిపాలైతే.. సూపర్ 4 కి అర్హత సాధించకుంటే వెళ్తోంది. మరోవైపు అప్గానిస్తాన్ గ్రూప్ దశలో హాంగ్‌కాంగ్ పై విజయం సాధించగా.. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. దీంతో ఈ మ్యాచ్‌లో అప్ఘాన్‌కు తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక జట్టులో ఒక మార్పు చేయగా.. అఫ్ఘానిస్థాన్ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది.
Also Read : Fastest Fifty : ఎవడ్రా వీడు…13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. జస్ట్ మిస్… యువీ రికార్డ్ గంగలో కలిసేది !
ముఖ్యంగా గ్రూపు బీ లో అటు శ్రీలంక రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించింది. మరోవైపు బంగ్లాదేశ్ కూడా రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించి ప్రస్తుతం రెండో స్థానంలో కొనసాగుతోంది. ఒకవేళ ఇవాళ శ్రీలంక జట్టు కనుక విజయం సాధించినట్టయితే బంగ్లాదేశ్ సూపర్ 4 కి అర్హత సాధించదు. కానీ ఇవాళ జరుగుతున్న మ్యాచ్ లో శ్రీలంక జట్టు హాట్ పేవరేట్ గా బరిలోకిదిగుతుంది. ఈ మ్యాచ్ లో అదృష్టం ఎవ్వరినీ వరించనుందో గ్రూపు బీ నుంచి ఎవ్వరూ సూపర్ 4 కి అర్హత సాధిస్తారో ఈ మ్యాచ్ ఫలితం వస్తే.. కానీ క్లారిటీ రానుంది. గ్రూపు ఏ నుంచి ఇప్పటికే టీమిండియా, పాకిస్తాన్ జట్లు ఖరారయ్యాయి. కానీ గ్రూపు నుంచి మాత్రమే ఖరారు కావాల్సి ఉంది.
ఇక ఆఫ్గనిస్తాన్ రెండు మ్యాచ్ లలో ఒకే ఒక్క మ్యాచ్ విజయం సాధించి.. టఫ్ పొజిషన్ లో ఉంది. అయితే ఆఫ్ఘనిస్తాన్ రన్ రేట్ ప్లస్ లో ఉండటం… వాళ్లకు కలిసి వచ్చింది. అయితే ఇవాళ శ్రీలంక వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య చివరి లీగ్ దశ మ్యాచ్ ఉంది. ఇందులో కచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించాలి. ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోతే.. శ్రీలంక అలాగే బంగ్లాదేశ్ నేరుగా సూపర్ ఫోర్ లోకి ఎంట్రీ ఇస్తాయి. అందుకే ఎలాగైనా ఈ మ్యాచ్ లో గెలవాలని ఆఫ్ఘనిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకొని పోరాడాలని ప్రయత్నిస్తోంది.
అప్గాన్ జట్టు :
సెడిఖుల్లా అటల్, రహ్మానుల్లా గుర్బాజ్(కీపర్), ఇబ్రహీం జద్రాన్, గుల్బాదిన్ నైబ్, దర్వీష్ రసూలీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, కరీం జనత్, రషీద్ ఖాన్(కెప్టెన్), ముజీబ్ ఉర్ రహ్మాన్, నూర్ అహ్మద్, ఫజల్హాక్ ఫరూఖీ.
శ్రీలంక జట్టు :
పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్ (కీపర్), కమిల్ మిషార, కుషల్ పెరీరా, చరిత్ అసలంక(కెప్టెన్), దసున్ షనక, కమిందు మెండిస్, వనిందు హసరంగా, దునిత్ వెల్లలగే, దుష్మంత చమీర, నువాన్ తుషార.