Bengali Actress Sumi Har Choudhury Found Wandering on Streets: సినీ పరిశ్రమ అంటేనే రంగుల ప్రపంచం. వారి లగ్జరీ లైఫ్, లైఫ్ స్టైల్ చూసి అబ్బా.. లైఫ్ అంటే వారిదని అంతా అనుకుంటుంటారు. అయితే ఇదంత వారి చేతిలో సినిమాలు, ఆఫర్స్ ఉన్నంత వరకే. ఇక ఆఫర్స్ పోయాయంటే నటీనటుల పరిస్థితి అంతే. ఆర్థిక సమస్యలతో రోజు గడవడం కూడా కష్టమైపోతుంది. వారి క్రేజ్ ఉన్నంత వరకు పరిశ్రమ అయినా, ప్రేక్షకులైన సెలబ్రిటీలుగా గుర్తిస్తారు. నటి పావలా శ్యామల, పాకిజా వంటి నటీమణులు విషయంలో ఇప్పటికే రుజువైంది.
వెండితెరపై స్టార్ నటిగా..
తాజాగా మరోనటి దీనస్థితిలో రోడ్డుపడింది. కనీసం ఇల్లు కూడా లేక రోడ్డు పక్కన నివసిస్తోంది. తాను నటినని, తనకు ఆశ్రయం కావాలని ఆర్జించిన పట్టించుకునేవారు లేక రోడ్డుపై అనాథలా జీవిస్తుంది. ఆమె మరెవరో కాదు ప్రముఖ బెంగాలీ నటి బెంగాలీ నటి సుమి హర్ చౌదరి. ఒకప్పుడు బెంగాలీ సినిమా, సీరియల్స్ ప్రముఖ పాత్రలు పోషించి గుర్తింపు పొందింది. ఎన్నో సినిమాల్లో సహానటి పాత్రలు, ప్రధాన పాత్రల్లో నటించి స్టార్ నటి గుర్తింపు పొందారు. అయితే కొంతకాలంగా ఆమె పెద్దగా సినిమాలు, సీరియల్లో చేయడం లేదు. వెండితెరపై కూడా కనిపించి చాలాకాలం అవుతోంది.
గుర్తు పట్టలేని స్థితిలో సుమీ చౌదరి
దీంతో సుమి చౌదరిని పరిశ్రమే కాదు ప్రేక్షకులు సైతం మర్చిపోయారు. చివరి తాను నటిని అని చెప్పిన గుర్తుపట్టలేని పరిస్థితిలో సుమీ చౌదరి దీనస్థితిలో కనిపించడం ఆమె ఫ్యాన్స్ ని బాధిస్తోంది. కాగా నటి సుమీ చౌదరి బెంగాలీ ఎన్నో హిట్ చిత్రాల్లో సహాయ పాత్రలు పోషించింది. సీరియల్లోనూ లీడ్ రోల్స్ పోషించిన ఆమె ప్రస్తుతం కనీస సౌకర్యం లేక రోడ్డుపై అనాథలా కనిపించింది. పశ్చిమ బెంగాల్లోని పుర్బా బర్ధామన్ జిల్లాలో సుమీ చౌదరి మతిస్థిమితం కొల్పోయి రోడ్డుపై కనిపించింది. రోడ్డు పక్కన షాట్, బ్లాక్ ఫుల్ స్లీవ్ టీ షర్టులో, చేతి పెన్ను, డైయిరీతో రోడ్డు పక్కన ఉన్న మహిళలను స్థానికులు గుర్తించారు.
రక్షించిన పోలీసులు
ఆమె గురించి ఆరా తీసేందుకు స్థానికులు ఆమెతో దగ్గరి వెళ్లగా మతిస్థిమితం కోల్పోయి.. బెంగాలీ, ఇంగ్లీష్ భాషలో తడబడుతూ మాట్లాడుతూ కనిపించింది. పదే పదే తాను నటిని అని, తన పేరు సుమీ హర్ చౌదరి అని చెబుతున్నా ఎవరూ నమ్మడం లేదు. దీంతో ఆ పేరుపై గూగుల్ లో సెర్చ్ చేయగా ఆమె ఫోటోలు, సోషల్ మీడియా ఫ్రోఫైల్ చూసి స్థానికులు గుర్తు పట్టారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకున్నారు. ఆమె నటి అని గుర్తించిన పోలీసులు సుమీ చౌదరిని రక్షించి పనరావస కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం ఆమె కుటుంబ వివరాలను తెలుసుకునే దిశ విచారణ కొనసాగిస్తున్నారు.
Also Read: Coolie: ‘కూలి’ మూవీపై రజనీకాంత్ అలాంటి కామెంట్స్.. ఫ్యాన్సులో కలవరం, అంటే కమల్ పరిస్థితేనా?