Singeetham srinivas Rao: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు(Singeetham Srinivas Rao) ఒకరు. తన సినీ కెరియర్లో 60 కి పైగా సినిమాలు చేసి దర్శకుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు పొందారు. ఈయన దర్శకత్వంలో ఎన్నో విభిన్నమైన ప్రయోగాత్మక సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇలా దర్శకుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సింగీతం శ్రీనివాస్ మరణ వార్త ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి.
సింగీతం శ్రీనివాస్ 94 వ సంవత్సరంలో కన్నుమూశారు. ఈయన వయోభారంతో గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చెన్నైలోని కావేరి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇక ఈయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గత రాత్రి హాస్పిటల్లో కన్నుమూశారు. ఇలా సింగీతం శ్రీనివాస్ మరణించడంతో ఈయన సినిమాలకు సంబంధించిన ఎన్నో విషయాలు బయటకు వస్తున్నాయి. అదేవిధంగా సినిమా సెలబ్రిటీలు అందరూ కూడా డైరెక్టర్ గారితో వారికున్న అనుబంధం గురించి గుర్తు చేసుకుంటూ ఆయన మరణం పై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే సింగీతం శ్రీనివాస్ మరణించడంతో ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు నాగ్ అశ్విన్(Nag Ashwin) సైతం తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో ఈయన మరణం పట్ల స్పందించడమే కాకుండా సింగీతం శ్రీనివాస్ తదుపరి సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ కూడా తెలియజేశారు. సింగీతం శ్రీనివాస్ ఇటీవల దర్శకుడుగా సింగ్ గీతం(Singgeetham) సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా నాగ్ అశ్విన్ సమర్పణలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత తన తదుపరి సినిమాకు సంబంధించిన ఒక టైటిల్ కూడా సింగీతం శ్రీనివాస్ తెలియచేశారని నాగ్ అశ్విన్ తెలిపారు.సింగీతం శ్రీనివాస్ తన 62 వ సినిమాకు సంబంధించి “ఎ ఫ్రూట్ కట్స్ ద నైఫ్” (AFruut Cuts the Knife)అనే టైటిల్ నిర్ణయించుకున్నట్టు నాగ్ అశ్విన్ సింగీతం శ్రీనివాస్ వాట్సప్ చాట్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
ఇలా ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ఈయన తన తదుపరి సినిమా టైటిల్ కూడా ఫిక్స్ చేశారని అయితే ఆ సినిమా తెరపైకి రాకుండానే కన్నుమూసారని భావిస్తున్నారు. ఇలా తన చివరి కోరిక నెరవేరకుండానే సింగీతం శ్రీనివాస్ కన్నుమూశారనే విషయం తెలిసిన అభిమానులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. సింగీతం శ్రీనివాస్ దర్శకుడిగా కన్నడ ,తెలుగు ,తమిళ, హిందీ భాషలలో సినిమాలు చేశారు. ఇలా అనారోగ్య సమస్యల కారణంగా మరణించడం ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి. ఆరోగ్య సమస్యలతో మరణించిన సింగీతం అంత్యక్రియలు కూడా నేడు పూర్తికానున్నాయి.
Also Read: లైగర్ డిజాస్టర్ పై ఫస్ట్ టైం రియాక్ట్ అయిన విజయ్..చాలా కష్టపడ్డాను కానీ?