E-Paper
Advertisement

మార్కెట్‌లోకి కొత్త మోడల్.. రచ్చ చేస్తున్న ఈ టీవీ మోడల్ గురించి మీకు తెలుసా?

మార్కెట్‌లోకి కొత్త మోడల్.. రచ్చ చేస్తున్న ఈ టీవీ మోడల్ గురించి మీకు తెలుసా?
Advertisement

Lumio Vision 7 43 inch QLED TV: ప్రస్తుత కాలంలో సాధారణ టీవీల స్థానంలో స్మార్ట్ టీవీలకు డిమాండ్ చాలా పెరిగింది. అందులోనూ క్యూఎల్ఈడీ టెక్నాలజీతో వస్తున్న టీవీలు అందించే.. పిక్చర్ క్వాలిటీ వేరే లెవెల్‌లో ఉంటోంది. అయితే మంచి బ్రాండ్ , హై-ఎండ్ ఫీచర్లు ఉన్న 4K క్యూఎల్ఈడీ టీవీ కొనాలంటే చాలా ఎక్కువ ఖర్చు అవుతుందని చాలా మంది అనుకుంటారు. ఆ అపోహను పూర్తిగా పటాపంచలు చేస్తూ.. సామాన్యుల బడ్జెట్‌కు తగినట్లుగా ‘ల్యుమియో విజన్’ సంస్థ ఈ సరికొత్త ఎడిషన్ టీవీని మార్కెట్లోకి తీసుకువచ్చింది.ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ ట్రెండీ స్మార్ట్ టీవీ విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు:

1.డిస్‌ప్లే, కలర్ క్వాలిటీ:

ఈ టీవీ మెయిన్ హైలైట్ దాని డిస్‌ప్లే. 43 ఇచుల(109 సెం.మీ) స్క్రీన్‌తో వస్తున్న ఈ క్యూఎల్ఈడీ అల్ట్రా HD (4K) డిస్‌ప్లే రంగులను చాలా స్పష్టంగా, సహజ సిద్ధంగా ప్రదర్శిస్తుంది. సాధారణ ఎల్‌ఈడీ టీవీలతో పోలిస్తే క్యూఎల్ఈడీ టెక్నాలజీ వల్ల బ్రైట్‌నెస్ , కాంట్రాస్ట్ రేషియో చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంట్లో కూర్చుని సినిమా చూస్తున్నప్పుడు.. థియేటర్ రియల్ ఫీలింగ్ కలుగుతుంది.

2. డాల్బీ విజన్ సపోర్ట్:

Advertisement

సినిమాలు లేదా వెబ్ సిరీస్‌లను చూసేటప్పుడు విజువల్స్ ఎంత రిచ్‌గా ఉంటే అంత మజా వస్తుంది. ఈ ల్యుమియో విజన్ 7 టీవీలో అందించిన ‘డాల్బీ విజన్’, ‘4K HDR’ టెక్నాలజీ వల్ల చీకటి సీన్లలో.. కూడా ప్రతి చిన్న డీటెయిల్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంతే కాకుండా విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇది నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తుంది.

3. గూగుల్ టీవీ, స్మార్ట్ ఫీచర్లు:

ఇది కేవలం డిస్‌ప్లే పరంగానే కాకుండా సాఫ్ట్‌వేర్ పరంగా కూడా చాలా అడ్వాన్స్‌డ్. లేటెస్ట్ గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఇది పని చేస్తుంది. దీని వల్ల నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్ , యూట్యూబ్ వంటి అన్ని ప్రముఖ ఓటీటీ యాప్‌లను ఈజీగా యాక్సెస్ చేయెచ్చు. బిల్ట్-ఇన్ క్రోమ్‌కాస్ట్ సపోర్ట్ ఉండటం వల్ల మీ స్మార్ట్‌ ఫోన్ స్క్రీన్‌ను నేరుగా టీవీకి కరెక్ట్ చేసుకోవచ్చు. వాయిస్ కంట్రోల్ కోసం గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా లభిస్తుంది.

4. ఆడియో సిస్టమ్:

Advertisement

మంచి పిక్చర్ క్వాలిటీతో పాటు.. పవర్‌ ఫుల్ సౌండ్ కూడా ఉంటేనే ఎంటర్ టైన్మెంట్ పూర్తి అవుతుంది. ఈ టీవీలో ఇన్‌బిల్ట్ హై-క్వాలిటీ స్పీకర్లను అమర్చారు. డాల్బీ ఆడియో సపోర్ట్ ఉండటం వల్ల మ్యూజిక్, డైలాగ్స్ చాలా క్రిస్టల్ క్లియర్‌గా వినిపిస్తాయి. ప్రత్యేకంగా హోమ్ థియేటర్ సిస్టమ్ అవసరం లేకుండానే.. ఇంట్లో అద్భుతమైన సౌండ్ పొందొచ్చు.

Also Read: అమెజాన్ సేల్‌లో సగం ధరకే..బ్రాండెడ్ ఫ్రిజ్‌లు, వెంటనే కొనేయండి

5. మోడ్రన్ డిజైన్, బడ్జెట్ ధర:

బెడ్‌రూమ్ లేదా లివింగ్ రూమ్‌లో ఎక్కడ అమర్చినా ఈ టీవీ ఇంటికి ఒక రిచ్ లుక్‌ను తెచ్చిపెడుతుంది. బెజెల్‌లెస్ డిజైన్ కారణంగా స్క్రీన్ మరింత పెద్దదిగా కనిపిస్తుంది. ఇన్ని లేటెస్ట్ ఫీచర్లు ఉన్నప్పటికీ దీని ధర కేవలం రూ. 32,999 మాత్రమే ఉండటం టెక్ మార్కెట్‌లో సంచలనం సృష్టిస్తోంది.

తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం 4K QLED అనుభవాన్ని కోరుకునే వారికి ఈ మోడల్ ఒక అద్భుతమైన ఆప్షన్. అద్భుతమైన విజువల్స్, లేటెస్ట్ స్మార్ట్ ఫీచర్లు, ఆకర్షణీయమైన ధరతో వస్తున్న ఈ టీవీ మీ ఇంటి వినోదాన్ని పూర్తిగా మార్చేస్తుంది!

Related News

ఇంతకీ ఈ LTPO డిస్‌ప్లే కథేంటి? స్మార్ట్‌ఫోన్లలో ఇది ఉంటే బ్యాటరీ లైఫ్ డబుల్ అవుతుందా?

రూ.499కే బ్లూటూత్ స్పీకర్..పాకెట్ ఫ్రెండ్లీ ప్రైస్‌లో ట్రెండీ మోడల్

రూ.1648కే 3 వస్తువుల కాంబో..ఇలాంటి ఆఫర్ ఎప్పుడూ చూసుండరు

ఐఫోన్ యూజర్లకు అలర్ట్.. మీ లొకేషన్ లీక్ అవ్వకూడదంటే.. ఈ హిడెన్ ఫీచర్‌ ఆన్ చేసుకోండి!

ఐఫోన్ vs ఆండ్రాయిడ్: డిస్‌ప్లే పగిలినా, బ్యాటరీ పోయినా.. దేనికి రిపేర్ ఖర్చు ఎక్కువ?

రూ.1,999కే రియల్‌మీ 20000mAh పవర్ బ్యాంక్..ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్స్ అదిరిపోయాయి!

రూ.6,599కే బెస్ట్ టీవీ..ఆఫర్ పూర్తవకముందే కొనేయండి!

Big Stories

Advertisement
×