Actor Balakrishna: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తూ షూటింగులను నిలిపివేసిన సంగతి తెలిసిందే. తమకున్నటువంటి రూల్స్ ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకి ఒకసారి వేతనాలు పెంచాలి అంటూ డిమాండ్లు చేస్తున్నారు. తమకు 30 శాతం వేతనాలు పెంచే వరకు షూటింగ్స్ కి రామని డిమాండ్లు చేస్తూ షూటింగ్స్ అన్ని నిలిపివేసారు. ఈ క్రమంలోనే నిర్మాతలు అదరూ కూడా ఈ విషయంపై చర్చలు జరపడమే కాకుండా స్టార్ హీరోలను కలిసి వారి సమస్యలను తెలియజేశారు. ఇదివరకే నిర్మాతలందరూ చిరంజీవితో భేటీ అయి తమ సమస్యలను తెలియజేశారు.
బాలయ్యతో భేటీ అయిన నిర్మాతలు…
తాజాగా బాలకృష్ణ(Balakrishna)ని కూడా పలువురు నిర్మాతలు కలిసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం బాలకృష్ణ అఖండ2(Akhanda 2) సినిమా డబ్బింగ్ పనులలో(Dubbing works) ఎంతో బిజీగా ఉన్నారు. ప్రసాద్ ల్యాబ్ లో ఈ సినిమా డబ్బింగ్ పనులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడికి మైత్రి మూవీ మేకర్స్ రవి, ఛాంబర్ ప్రెసిడెంట్ భారత్ భూషణ్ నిర్మాత గోపి అచంట, దామోదరం ప్రసాద్ వంటి వారు బాలకృష్ణను కలిసారు. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో నెలకొన్న పరిస్థితుల గురించి, ఫిలిం ఫెడరేషన్ డిమాండ్స్, యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయాలను బాలయ్యకు వివరించారు . ఇలా ఈ భేటీలో భాగంగా బాలకృష్ణ నిర్మాతలతో చర్చలు జరిపి వారికి కొన్ని సూచనలు కూడా చేసినట్టు తెలుస్తోంది.
ఏడాదికి నాలుగు సినిమాలు చేస్తా..
ఈ క్రమంలోనే నిర్మాత మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్(Prasanna Kumar)బాలయ్యతో భేటీ అనంతరం మాట్లాడుతూ పలు విషయాలను తెలియచేశారు. ప్రతి హీరో సంవత్సరానికి ఎక్కువ సినిమాలు చేయాలని అందుకు అనుగుణంగా నిర్మాతలు కూడా చర్యలు తీసుకోవాలని బాలకృష్ణ చెప్పినట్లు వెల్లడించారు. అలాగే తాను కూడా ప్రతి సంవత్సరానికి నాలుగు సినిమాలు చేస్తానని బాలయ్య చెప్పినట్లు ప్రసన్నకుమార్ వెల్లడించారు. ఇక సినిమాలు చేయడం మాత్రమే కాకుండా నిర్మాణ వ్యయం పెరగకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పడాలని బాలకృష్ణ సూచనలు చేశారట.
కార్మికులు ఇండస్ట్రీలో భాగమే…
ప్రస్తుతం కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి కూడా మాట్లాడుతూ.. కార్మికులు కూడా సినిమా ఇండస్ట్రీలో భాగమే త్వరలోనే వారి సమస్యలని తొలగిపోతాయని అందుకు అనుగుణంగా చర్యలు కూడా తీసుకోవాలని నిర్మాతలకు దిశా నిర్దేశాలు చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం కార్మికుల సమస్య గురించి నిర్మాతలకు కీలక సూచనలు చేయడంతో ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి. ఇక బాలకృష్ణ సినిమాల విషయానికి వస్తే ఇటీవల ఈయన డాకు మహారాజ్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను(Boyapati Sreenu) దర్శకత్వంలో అఖండ 2 పనులలో బిజీగా ఉన్నారు ఈ సినిమా ఈ ఏడాది చివరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. నిజానికి సెప్టెంబర్ 25వ తేదీ విడుదల కావాల్సిందిగా అదే రోజు పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో బాలయ్య వెనకడుగు వేసారని తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు తదుపరి విడుదల తేదీ గురించి మేకర్స్ అధికారక ప్రకటన మాత్రం వెల్లడించలేదు.
Also Read: Jr. NTR: వంట చేయటం ఇష్టం.. పిల్లల కోసం అలవాట్లు మార్చుకున్న తారక్.. నిజంగా గ్రేట్!