E-Paper
Advertisement

సొంత కూతురినే చంపాలనుకునే తండ్రి… కట్ చేస్తే బుర్రపాడు ట్విస్ట్

సొంత కూతురినే చంపాలనుకునే తండ్రి… కట్ చేస్తే బుర్రపాడు ట్విస్ట్
Advertisement

Psycho Thriller on OTT : చిన్న పిల్లలు తెలివిగా, బాగా చదువుతూ, అన్నింట్లో ఫస్ట్ వస్తే ఎంత ముచ్చటగా ఉంటుందో కదా. కానీ అదే పిల్లలు కాస్తా చిచ్చర పిడుగులా మారి, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని వల్లకాడు చేస్తే, అడ్డొచ్చిన వాళ్ళందరినీ అడ్డంగా నరికేస్తే… ఊహించుకోవడానికి భయంకరంగా ఉన్నా ఈ స్టోరీతో రూపొందిన మూవీనే ఈరోజు మన మూవీ సజెషన్. ‘ది బ్యాడ్ సీడ్’ (The Bad Seed 2018) అనే టైటిల్ తో రూపొందిన ఈ మూవీని ఎక్కడ చూడవచ్చు ? స్టోరీ ఏంటి ? అన్నది వివరంగా తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

ఈ మూవీ కథ ఒంటరి తండ్రి డేవిడ్, అతని తొమ్మిదేళ్ల కూతురు ఎమ్మా చుట్టూ తిరుగుతుంది. ఎమ్మా బయటి ప్రపంచానికి చాలా మర్యాదగా ఉండే, తెలివైన, అందమైన చిన్నారిగా కనిపిస్తుంది. ఎవరైనా ఆమెను చూస్తే “ఎంత పర్ఫెక్ట్ అమ్మాయి” అని మెచ్చుకుంటారు. కానీ ఆమె లోపల ఒక భయంకరమైన సోషియోపాత్ ఆ పిల్ల. తనకు కావాలనుకున్నది దక్కించుకోవడానికి ఆమె ఎంతటి ఘోరానికైనా వెనకాడదు. స్కూల్లో జరిగే ఒక పోటీలో ఎమ్మా సాధించాలనుకున్న మెడల్‌ను ఆమె క్లాస్‌మేట్ మిలో గెలుచుకుంటాడు. కొద్ది రోజుల్లోనే మిలో ఓ ప్రమాదంలో పడి చనిపోతాడు.

Advertisement

ఆ తర్వాత స్కూల్ హెడ్‌మిస్ట్రెస్ క్లోయి కూడా ఒక రోడ్డు ప్రమాదంలో మరణిస్తుంది. ఎందుకంటే ఆమెకు ఎమ్మాపై అనుమానం. ఇంట్లో పని చేసే కేర్‌టేకర్ కూడా ఒక భయంకరమైన సన్నివేశంలో సజీవ దహనం అవుతాడు. ఈ వరుస మరణాల వెనుక తన కూతురే ఉందని డేవిడ్‌కు నెమ్మదిగా అనుమానం కలగడం మొదలవుతుంది. డేవిడ్ కూతురు నిజ స్వభావాన్ని అర్థం చేసుకుని భయపడతాడు. ఆమె సమాజానికి ప్రమాదకరమని గ్రహించి, ఆమెను శాశ్వతంగా ఆపాలని నిర్ణయించుకుంటాడు. కానీ ఎమ్మా చాలా తెలివైనది.

తన తండ్రి తనను చంపాలని ప్లాన్ చేస్తున్నాడని గ్రహించి, తానే బాధితురాలిగా నటిస్తూ, తండ్రిని మానసికంగా వేధించడం మొదలు పెడుతుంది. ఈ క్రమంలో కుటుంబం ఎదుర్కొనే మానసిక ఉద్రిక్తత, టెన్షన్ పెట్టే సీన్లు ప్రేక్షకులను ఎడ్జ్ ఆఫ్ ది సీట్‌లో కూర్చోబెడతాయి. మరి చివరికి ఆ తండ్రి తన సొంత కూతురిని ఏం చేశాడు ? ఆ పిల్ల అతని ప్లాన్ ను ఎలా తిప్పికొట్టింది ? షాకింగ్ క్లైమాక్స్ ఏంటి ? అన్నది తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

Advertisement

Also Read : పగటిపూట సైలెంట్ రాత్రైతే వయోలెంట్ ఈ పిల్ల… నలుగురు సార్ల ఎంట్రీతో ట్విస్ట్

ఏ ఓటీటీలో ఉంది ?

‘ది బ్యాడ్ సీడ్’ మూవీ అమాయకత్వం ముసుగులో దాగి ఉన్న రాక్షసి కథ. 2018లో విడుదలైన ఈ అమెరికన్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్… ఈ జానర్లోనే ఒక భయంకరమైన మార్క్ పడేసిన చిత్రం. విలియం మార్చ్ రాసిన ప్రసిద్ధ నవల ఆధారంగా రోబ్ లోవ్ దర్శకత్వం వహించి, ప్రధాన పాత్రలో కూడా నటించిన ఈ సినిమా హాలీవుడ్ హారర్ జానర్‌లో ఒక క్లాసిక్‌గా నిలిచింది. ప్రస్తుతం Amazon Prime Video, Apple TVలలో రెంటల్ ఆప్షన్ లో ఇంగ్లీష్ లో అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్ ఇంకా రాలేదు.

Related News

ఏడేళ్లుగా కనిపించని ప్రేయసి… ఆమె ఆచూకీ చెప్పే మాంత్రిక జీవులతో ప్రయోగం… ఓటీటీలోకి వచ్చిన వింత సిరీస్

బంగారం కోసం సముద్రంలో ప్రాణాంతక వేట… నిధి కోసం నిలువునా ముంచేసే కన్నింగ్ గాళ్ళు… ఊపిరి బిగబట్టి చూడాల్సిన అడ్వెంచర్ థ్రిల్లర్

చిన్ననాటి స్నేహితుల ముసుగులో ద్రోహం… ప్రపంచాన్ని కాపాడేందుకు ప్రాణాలకు తెగించే ఏజెంట్… జాన్ సీనా యాక్షన్ అడ్వెంచర్

దెయ్యాలనే బంధువులుగా భావించే వింత మనిషి… నవ్విస్తూ, ప్రేమలో ముంచెత్తే మలయాళం ఫాంటసీ మూవీ ఓటీటీలోకి

పోలీసులకు హింట్ ఇచ్చి మరీ చంపే కిల్లర్… ట్విస్టుల మీద ట్విస్టులు… సీజన్ 2 రచ్చ షురూ

గ్రామ దేవత ప్రతిరూపంగా భావించే దున్నపోతు… బలిచ్చే రోజే మిస్సింగ్… రవితేజ సోదరుడి కొడుకు మూవీ స్ట్రీమింగ్

దొంగతనాలు చేసే అమ్మాయికి సీక్రెట్ స్పై మిషన్… టార్గెట్ కొడుకుతోనే ప్రేమలో… క్రేజీ కొరియన్ థ్రిల్లర్

అంగారకుడిపై మనుషుల శరీరాలను ఆక్రమించే దుష్టశక్తులు… హాలీవుడ్ హర్రర్ థ్రిల్లర్ నెట్‌ఫ్లిక్స్‌లో

Big Stories

Advertisement
×