Kuberaa : తమిళ స్టార్ హీరో ధనుష్, అక్కినేని నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం కుబేర.. టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ సినిమాను తెరకెక్కించారు.. ఇటీవల థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ ప్రభంజనం అని సృష్టించింది. డిఫరెంట్ కథతో వచ్చిన ఈ స్టోరీకి ప్రేక్షకులు నీరాజనం పలికారు. ధనుష్ అద్భుతమైన నటనను కనబరిచారు అంటూ ఆయన పై ప్రశంసలు కురిపించారు.. ఓవరాల్ గా సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ కలెక్షన్స్ కూడా పర్వాలేదనిపించాయి. అయితే ఈ మూవీ క్లైమాక్స్ గురించి సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ చిత్ర డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. క్లైమాక్స్ గురించి మైండ్ బ్లాక్ అయ్యే స్టోరీని చెప్పారు.
కుబేర క్లైమాక్స్ అందుకే అలా పెట్టాను..
రీసెంట్ గా ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన డైరెక్టర్ శేఖర్ కమ్ముల కుబేర గురించి సంచలన విషయాలను బయటపెట్టారు. ఈ మూవీ క్లైమాక్స్ గురించి ఆడియన్స్ లో ఒక సందేహం ఉందని యాంకర్ అడగ్గా.. దానికి డైరెక్టర్ శేఖర్ కమ్ముల సమాధానం చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. సినిమాలో నాగార్జున పెద్ద ఆఫీసర్ పాత్రలో నటించారు.. ధనుష్ ఒక బిక్షగాడి పాత్రలో నటించారు.. డబ్బున్న వాడితో పెట్టుకుంటే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో ఊహించలేము.. బిక్షగాడు మళ్లీ ఇలాంటి బ్రతుకు నాకొద్దు అని అనుకుంటాడు. డబ్బున్న వ్యక్తి అలాంటి జీవితాన్ని అసలు కోరుకోడు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ సమాజం కరప్ట్ అయిపోయింది. డబ్బున్న వాళ్ళు ఏం చేసినా పెద్దగా పట్టించుకోదు అనే దీంతోనే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చామని ఆయన క్లారిటీ ఇచ్చారు.. ఆ పాయింట్ తోనే కుబేర క్లైమాక్స్ ని ఫినిష్ చేశామని శేఖర్ కమ్ముల అన్నారు. మొత్తానికి ఆయన ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
Also Read :కన్నప్ప వీకెండ్ రిపోర్ట్… ఈ కలెక్షన్లతో గట్టెక్కడం కష్టమే
కుబేర వీకెండ్ కలెక్షన్స్..
కుబేర మూవీ పై నుంచి భారీ అంచనాలే ఉన్నాయి.. సినిమాకు బడ్జెట్ కూడా ఎక్కువగానే పెట్టారు. దాదాపు ఈ మూవీకి 145 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ ని అందుకున్న ఈ మూవీ కలెక్షన్స్ బాగానే రాబట్టింది. తెలుగులో రూ.54 కోట్లు, తమిళంలో రూ.19 కోట్లు, కన్నడంలో రూ.5 కోట్లు, హిందీలో రూ.3 కోట్లు, కేరళలో కోటి రూపాయలు రాబట్టింది. దీంతో 9 రోజుల్లో కుబేర చిత్రం ఇండియా వైడ్‌గా రూ.82 కోట్ల నెట్ కలెక్షన్స్ అందుకుంది. తెలుగులో 50 కోట్ల మార్క్ క్రాస్ చేసిన కుబేర బ్రేక్ ఈవెన్ దిశగా అడుగులు వేస్తోంది.. రెండవ వారం పూర్తయ్యలోగా ఈ సినిమా టార్గెట్ ని రీచ్ అవుతుందని ట్రేడ్ పంతులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం థియేటర్లలో కన్నప్ప మూవీ రన్ అవుతుంది. ఈ రెండు సినిమాలు పోటాపోటీగా కలెక్షన్లను వసూలు చేస్తున్నాయి.
#Kuberaa క్లైమాక్స్ Poetic జస్టిస్ చేశా… చాలా ఆలోచించాకే ఆ క్లైమాక్స్ పెట్టాము – Sekhar Kammula #Kuberaa in Cinemas Now ! pic.twitter.com/e2M3vS0df1
— Rajesh Manne (@rajeshmanne1) June 30, 2025