Tirumala Crime: అన్నమయ్యా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక టెంపో ట్రావెలర్‌ను లారీ వచ్చి ఢీ కొట్టడంతో స్పాట్‌లోనే ముగ్గురు చనిపోయారు. 9 మందికి గాయాలు అయినట్లు తెలిపారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో టెంపోల్ ట్రావెలర్‌లో 14 మంది భక్తులు ఉన్నారు. ఈ ప్రమాదం జరగగానే ముగ్గురు చనిపోయారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పాటు అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. గాయపడ్డవారిని అక్కడి సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ వారిని బెంగళూరుకు తరలించారు. మరణించిన వారిలో ఒకరు మహిళ, ఇద్దరు పురుషులుగా గుర్తించారు.
Also Read: సోషల్ మీడియాలో ఇద్దరి ఫోటోస్! స్వేచ్ఛపై పూర్ణ సీరియస్
ఈ ఘటన ఈ రోజు ఉదయం 6 గంటల సమయంలో జరిగింది. లారీ ఢీ కొట్టిన వేగానికి టెంపూ మొత్తం నుజ్జు నుజ్జు కావడం జరిగింది. ఢీకొట్టిన లారీ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చెపట్టారు. మృతులు కర్నాటకలోని బాగేపల్లికి చెందినవారుగా గుర్తించారు. వీరంత తిరుపతికి వెళ్లి శ్రీవారిని దర్శించుకుని ఉదయం 3 గంటలకు బయటకు వచ్చారు. దీంతో కిందికి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ కేసులో లారీ డ్రైవర్‌ది తప్పా లేదంటే.. వాహనం నడుపుతున్న డ్రైవర్‌ది తప్పా అనే విషయంపై పోలీసులు దర్యాప్తూ చేస్తున్నాం అని తెలిపారు.