PM Kisan: తెలంగాణలో రైతు భరోసా లాగా కేంద్రంలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం అమలువుతోన్న విషయం తెలిసిందే. మన దేశంలో ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయం పైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్రంలోని మోదీ సర్కార్ 2019లో రైతుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీంను ప్రారంభించింది. ఈ స్కీం ద్వారా రూ.6వేలను రైతుల అకౌంట్లలో జమచేస్తున్నారు. ఏడాదికి మూడు విడతల్లో రూ.2వేల చొప్పున నేరుగా రైతల అకౌంట్లలో జమఅవుతోంది.
తాజాగా ఈ వారం రోజుల లోపల పీఎం కిసాన్ 20వ విడత నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. జులై 18న రైతుల అకౌంట్లలో డబ్బులు పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ డబ్బులు అకౌంట్లో పడాలంటే పీఎం కిసాన్ ఈ -కేవైసీ తప్పనిసరి చేసి ఉండాలి. ఈ పీఎం కిసాన్ ఈ కేవైసీ ప్రక్రియ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎవరైనా సులభంగా చేసుకోవచ్చు. దీనికి కావాల్సింది ఆధార్ కార్డు, ఆధార్ తో లింక్ అయిన మొబైల్ నంబర్ అవసరం ఉంటుంది.
ముందుగా పీఎం కిసాన్ అఫీషియల్ వెబ్ సైట్‌కు వెళ్లాలి. pmkisan.gov.in వెబ్ సైట్‌కి వెళ్లిన తర్వాత హోం పేజీలో farmers cornerలో ఈ-కేవైసీ ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి. అందులో 12 అంకెల ఆధార్ నంబర్ ను నమోదు చేసి సర్చ్ బటన్ ను క్లిక్ చేయండి. ఆధార్ తో లింక్ అయిన తర్వాత మొబైల్ నంబర్ కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ ప్రెస్ చేయాలి. దీంతో పీఎం కిసాన్ ఈ – కేవైసీ ప్రక్రియ కంప్లీట్ అవుతోంది.
NOTE:
మీ ఫోన్ నంబర్ ఆధార్ తో లింక్ కాకపోతే.. మీ దగ్గరలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్ (సీఎస్‌సీ) కి వెళ్లి బయోమెట్రిక్ ఈ కెవైసీ చేసుకోవచ్చు. ఇది సింపుల్ ప్రాసెస్.
ALSO READ: ECIL Recruitment: 55వేల జీతంతో హైదరాబాద్‌లో జాబ్స్.. జస్ట్ ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు బ్రో
ముఖ్యమైన గమనిక:
పీఎం కిసాన్ ఈ కేవైసీ పూర్తి చేయని రైతులకు అకౌంట్లలో డబ్బులు జమ కావు. దీంతో నిరాశకు గురి కావాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకే వీలైనంత త్వరగా మీ ఆధార్ నంబర్ తో ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోండి. ఈ కేవైసీ ప్రక్రియ ఆధార్ తో బ్యాంక్ ఖాతా లింక్ అయిందని నిర్ధారిస్తుంది. అందుకే వెంటనే ఈ-కెవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోండి. రూ.2000 పొందండి.
ALSO READ: JOBS: డిగ్రీ అర్హతతో భారీ ఉద్యోగ నోటిఫికేషన్, డోంట్ మిస్ గోల్డెన్ ఛాన్స్